Bigg Boss Sivaji: శివాజీ విన్నర్ అవుతారా? ఆయన ప్లస్, మైనస్‌లు ఇవే - శిష్యుడే పోటీ!
Bigg Boss 7 Telugu Winner: కొన్నివారాల క్రితం వరకు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ శివాజీనే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు తన శిష్యుడే తనకు పోటీగా వచ్చాడు.
Bigg Boss 7 Telugu Winner: ఒకప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, వాయిస్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో బిజీగా ఉన్న శివాజీ (Shivaji).. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. రాజకీయ నాయకుడు కాకాపోయినా.. రాజకీయాల్లో ఉన్న ఇంట్రెస్ట్‌తో విశ్లేషకుడిగా మారాడు. ఇక ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ అనే రియాలిటీ షోలోకి కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యాడు. కొన్ని గుర్తుండిపోయే సినిమాల్లో నటించడం వల్ల శివాజీని ఇంకా చాలావరకు ప్రేక్షకులు మర్చిపోలేదు. బిగ్ బాస్ సీజన్ 7లో ప్రేక్షకులంతా గుర్తుపట్టే కంటెస్టెంట్స్ లిస్ట్‌లో శివాజీ కూడా ఒక్కడయ్యాడు. ఇక ఈ సీజన్ ఫైనల్స్‌కు చాలా చేరువలో ఉండడంతో టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఒకడుగా ఉన్న శివాజీ.. ట్రోఫీకి చాలా దగ్గర్లో వచ్చి ఆగిపోతున్నట్టు తెలుస్తోంది. దానికి తన శిష్యుడే కారణమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఎంటర్‌టైన్మెంట్‌లో పీహెచ్‌డీ
బిగ్ బాస్ రియాలిటీ షో అనేది తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తిచేసుకుంది. ఎంత ఉల్టా, పుల్టా సీజన్ అయినా కూడా బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల దృష్టి మారలేదు. అందులో ఉండే టాస్కులు మారలేదు. అయితే రాజకీయ విశ్లేషకుడిగా అనుభవం ఉన్న శివాజీ.. బిగ్ బాస్ విశ్లేషకుడిగా మారి.. అన్ని సీజన్స్ చూసి, అంతా తెలుసుకునే హౌజ్‌లోకి ఎంటర్ అయినట్టు మొదటినుండే ప్రేక్షకులకు అనుమానం కలిగింది.
అసలు ఆడియన్స్‌ను ఎలా ఎంటర్‌టైన్ చేయాలి అనే విషయంలో శివాజీ (Sivaji) ఏమైనా పీహెచ్‌డీ చేశాడా అని చాలామందికి అనిపించింది. ఎంత సీరియస్ టాస్కులో కూడా ఎంటర్‌టైన్మెంట్ తీసుకొచ్చి.. ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేవాడు శివాజీ. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయినప్పటి నుండే అందరూ ఒకలాగా ఆలోచిస్తే.. నేను ఇలా ఎందుకు చేయకూడదు అని అందరికంటే భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. దీంతో శివాజీ ఇచ్చే ఎంటర్‌టైన్మెంట్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
న్యాయం వైపు నిలబడడం, తప్పును తప్పు అని చెప్పడం, అవసరం వచ్చినప్పుడు కరెక్ట్‌గా మాట్లాడడం.. ఇవన్నీ క్వాలిటీలు ప్రేక్షకులకు నచ్చాయి. తన తోటివారికి అన్యాయం జరిగినా కూడా శివాజీ గట్టిగా మాట్లాడడానికి ముందుకొచ్చేవాడు. కానీ అది అందరి విషయంలో జరగలేదు. హౌజ్‌లో అంతమంది కంటెస్టెంట్స్ ఉండగా.. కేవలం ఇద్దరిని మాత్రమే తన శిష్యుల్లాగా భావించి.. ఎప్పుడూ పక్కనే పెట్టుకున్నాడు. ఇప్పుడు తను బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవ్వడానికి కూడా వారే అడ్డుగా మారినట్టు తెలుస్తోంది.
ఆడపిల్లలపై కామెంట్.. ఓట్లపై ఎఫెక్ట్
నేను చెప్పేది కరెక్ట్ అనుకోవడం అందరిలో సహజంగా ఉండే గుణమే. కానీ నేను చెప్పేది మాత్రమే కరెక్ట్ అనుకోవడం శివాజీ గుణం. అదే మెల్లగా ఆడియన్స్ పట్ల తనపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడేలా చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన కొత్తలో చాలా కూల్‌గా, ఎక్కువగా కోప్పడకుండా, అవసరం వచ్చినప్పుడే పాయింట్స్ మాట్లాడుతూ ఉండే శివాజీ ప్రవర్తన మెల్లగా మారింది. అనవసరంగా అరవడం మొదలుపెట్టాడు.
గొడవలు జరిగినా కూడా ఆ గొడవలో తన పాత్ర ఉన్నా కూడా అసలు తన తప్పు ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడడం ప్రేక్షకులకు నచ్చలేదు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, యావర్‌లు మాత్రమే కష్టపడి వచ్చారని, మిగతావారంతా వేస్ట్ అన్నట్టుగా కంటెస్టెంట్స్ వెనుక చాలాసార్లు కామెంట్స్ చేశాడు శివాజీ. దీంతో ఓటింగ్ విషయంలో మొదటి స్థానంలో ఉండే శివాజీ.. వారాలు పెరుగుతున్నకొద్దీ రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఇటీవల ఆడపిల్లలపై శివాజీ చేసిన కామెంట్.. సోషల్ మీడియాలో దుమారాన్నే సృష్టించింది. తను ఏం చేసినా కరెక్ట్ అని భావించేవారు మాత్రమే ఇప్పుడు తనకు సపోర్ట్‌గా నిలబడ్డారు. మిగిలినవారంతా పల్లవి ప్రశాంత్ సైడ్ షిఫ్ట్ అయిపోయారు. అందుకే ఓటింగ్ విషయంలో పల్లవి ప్రశాంత్ మొదటి స్థానానికి చేరుకున్నాడని సోషల్ మీడియాలో జరిగే పోలింగ్ చెప్తోంది. దానివల్ల హౌజ్‌లో తనకు శిష్యుడిగా ఉన్న పల్లవి ప్రశాంత్‌కే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ టైటిల్ దక్కుతుందని అందరూ అనుకుంటున్నారు. మరి, అఫిషియల్ ఓటింగ్‌లో ఎవరు లీడ్ ఉన్నారు, ఎవరు విజేత అవుతారనేది ఆదివారం ప్రసారమయ్యే ఫినాలేలోనే తెలుస్తుంది.
Also Read: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు గ్రాండ్‌గా ఏర్పాట్లు - ఎన్నో సర్ప్రైజ్‌లతో!