అన్వేషించండి

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు గ్రాండ్‌గా ఏర్పాట్లు - ఎన్నో సర్ప్రైజ్‌లతో!

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు అప్పుడే షూటింగ్ మొదలయ్యిందని సమాచారం. అంతే కాకుండా ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 7 అయిపోవడానికి ఇంకా రెండురోజులు మాత్రమే ఉంది. ఫైనల్స్ దగ్గర పడుతుండగా.. దీని గురించి పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగా ప్రతీ సీజన్ బిగ్ బాస్ ఫైనల్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తారు మేకర్స్. అదే విధంగా సీజన్ 7 ఫైనల్స్ కూడా వేరే లెవెల్‌లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 17న సీజన్ 7 ఫైనల్స్ ప్రసారం కానున్నాయి. దీనికోసం తయారీ మొత్తం పూర్తయ్యిందని సమాచారం. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు స్పెషల్ గెస్ట్‌గా ఎవరు వస్తారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరికొన్ని అప్డేట్స్ కూడా బయటికొచ్చాయి.

ప్రాక్టీస్ మొదలు..
ఆదివారం బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్.. టీవీలో ప్రసారం కాగా..  ఇప్పటికే హౌజ్‌లో దానికి సంబంధించిన షూటింగ్ మొదలయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సీజన్ 7 మాజీ కంటెస్టెంట్స్ కొందరు ఫైనల్స్‌లో స్టేజ్‌పై పర్ఫార్మెన్స్‌లు ఇవ్వడానికి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారట. ఈ రెండు రోజుల్లో ఈ పర్ఫార్మెన్స్‌లకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఫైనల్స్ అంటే సెలబ్రిటీ గెస్ట్‌ల హవా కూడా మామూలుగా ఉండదు. అందుకే కొందరు బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ స్టేజ్‌పై కొందరు హీరోయిన్స్ పర్ఫార్మెన్స్‌లు కూడా ఉండబోతున్నాయని సమాచారం. దీంతో పాటు నాగార్జున.. తన అప్‌కమింగ్ మూవీ ‘నా సామిరంగ’ నుంచి అదిరిపోయే అప్డేట్ కూడా ఇవ్వడానికి ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది.

‘నా సామిరంగ’ అప్డేట్..
ఇప్పటికే బిగ్ బాస్ స్టేజ్‌పైనే తన అప్‌కమింగ్ మూవీ ‘నా సామిరంగ’ గురించి పలు అప్డేట్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ చేశారు నాగార్జున. ముందుగా ఆ మూవీలో తన హీరోయిన్ ఎవరు అనేది బిగ్ బాస్ స్టేజ్‌పైనే రివీల్ చేశారు. ఆ తర్వాత అందులో నుంచి మొదటి పాటను కూడా బిగ్ బాస్‌లోనే లాంచ్ చేశారు. ఇప్పుడు ‘నా సామిరంగ’ టీజర్‌ను కూడా బిగ్ బాస్ ఫైనల్స్ రోజే రిలీజ్ చేయడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. ఈ సందర్భంగా అల్లరి నరేష్ కూడా బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేయనున్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ ఫైనల్స్ షూటింగ్‌కు, టెలికాస్ట్‌కు రెండు గంటలు మాత్రమే తేడా ఉంటుందని తెలుస్తోంది. ఆదివారం రోజు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అనే విషయాన్ని ప్రకటించగా.. దానికంటే ముందుగా ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయ్యే ప్రక్రియ చాలా క్రియేటివ్‌గా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

మహేశ్ బాబు చేతుల మీదుగా..
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు రూ.50 లక్షలు ప్రైజ్ మనీతో పాటు కారు, వజ్రాల హారం కూడా గిఫ్ట్స్‌గా లభించనున్నాయి. అయితే విన్నర్‌కు ఇవన్నీ అందజేయడానికి మహేశ్ బాబు రానున్నాడని వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన అప్‌కమింగ్ మూవీ ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్‌ను బిగ్ బాస్ నుండే మొదలుపెట్టవచ్చని మహేశ్ భావిస్తున్నాడట. ఇప్పటికే బిగ్ బాస్ ఫైనల్స్‌కు చిరంజీవి, వెంకటేశ్‌లాంటి సీనియర్ హీరోలు వచ్చారు. కానీ మొదటిసారి ఈ స్టేజ్‌పైకి మహేశ్ రానున్నాడు. ఇక ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్‌లో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అవుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: 'సలార్' కోసం వర్క్ షాప్స్ చేశామంతే, ప్రత్యేకంగా కష్టపడలేదు - ప్రభాస్ ఇంటర్వ్యూ   

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget