Bigg Boss Season 7: ఫుల్ ఫన్ క్రియేట్ చేసిన ఆటగాళ్లు - బిగ్ బాస్‌తో వన్స్ మోర్ అనిపించుకున్న అమర్ దీప్
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 లో ఆటగాళ్లు, పోటుగాళ్ల మధ్య ఐదో టాస్క్ మొదలైంది. దీనిలో భాగంగా ఇంటి సభ్యులు ఫన్ బాగా క్రియేట్ చేసి నవ్వులు పూయించారు.
Bigg Boss 7 Telugu Latest Episode: బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిన తర్వాత ఎంటర్టైనమెంట్ డోస్ కాస్త పెరిగినట్టు అనిపిస్తుంది. ఇంటి సభ్యులతో కలిసి బిగ్ బాస్ కూడా ఫన్ క్రియేట్ చేస్తున్నారు. కొత్తగా హౌజ్‌లోకి వచ్చిన వాళ్ళని పోటుగాళ్లు అని.. పాత కంటెస్టెంట్స్‌ని ఆటగాళ్లుగా మార్చి వీరిలో ఎవరు బెస్ట్ అనే పోటీలు పెడుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు కలర్ కలర్ విచ్ కలర్ టాస్క్, ఎవరు స్ట్రాంగెస్ట్ అంటూ పోటీలు పెట్టారు. ఇక ఇప్పుడు ఎవరు స్మార్టెస్ట్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్లో ఎవరికి ఎంత సినిమా నాలెడ్జ్ ఉందో బిగ్ బాస్ తెలుసుకున్నారు. ఇందులో కంటెస్టెంట్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు.
ఇంటి సభ్యుల్లో ఎవరు స్మార్ట్ అనేది తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఇస్తున్న ఐదో టాస్క్ హు ఈజ్ ది స్మార్టెస్ట్. ఇందులో భాగంగా సినిమా నాలెడ్జ్‌ని పరిశీలించారు. కొన్ని సినిమా పాటలు, డైలాగ్స్ వినిపించి అందులో హీరోలు వాడిన వస్తువులు ఏంటి? ఎవరు డాన్స్ చేశారు వంటి ప్రశ్నలు వేశాడు బిగ్ బాస్. మొదటగా ఆటగాళ్ల నుంచి అమర్ దీప్ రాగా బాలయ్య సినిమాలో డైలాగ్ వినిపించి అందులోని ఆయుధం ఏంటో చెప్పమన్నారు. అమర్ కరెక్ట్‌గా చెప్పాడు. తేజకి దేవసేన డైలాగ్ ఇచ్చి ఆమె ఎలా చెప్పిందో చెప్పమని అన్నారు. తేజ యాక్ట్ చేస్తూ చూపించిన తీరు ఫన్నీగా ఉంది. తర్వాత ప్రశాంత్, గౌతమ్‌కి ఒక్కడు సినిమాలో డైలాగ్ వినిపించి ప్రకాశ్ రాజ్‌ని కొట్టిన ప్లేస్ ఏదో అడిగారు. ప్రశాంత్ కరెక్ట్‌గా సమాధానం ఇచ్చాడు. అమర్ ప్రకాశ్ రాజ్‌గా, గౌతమ్ మహేష్ బాబుగా నటించి ఫన్ క్రియేట్ చేయాలని చూశారు.
ప్రకాశ్ రాజ్‌గా అమర్ దీప్..
తేజ పక్కన ఉండి ప్రకాశ్ రాజ్ వాయిస్ ఇమిటేట్ చేయమని అమర్‌కి చెప్తూ వెరైటీగా షియాజీ షిండేని ఇమిటేట్ చేసి నవ్వులు పూయించాడు. గౌతమ్ కొట్టినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. అమర్ దొర్లుకుంటూ వెళ్లి తేజ మీద పడి దొర్లుతూ నవ్వించేశారు. బిగ్ బాస్‌కు వాళ్ల పెర్ఫామెన్స్ నచ్చినట్టుగా ఉంది. అమర్ వాళ్లని వన్స్ మోర్ అంటూ అడిగారు. ఇప్పటి వరకు పోటుగాళ్లు టీం సభ్యులు జీనియస్, ఫిట్ నెస్, స్ట్రాంగెస్ట్ టాస్క్‌లో గెలిచారు. ఇక ఆటగాళ్లు టీం కేవలం ఫాస్టెస్ట్ టాస్క్‌లో మాత్రమే విజేతలుగా నిలిచారు. ఇక తాజాగా పెట్టిన స్మార్టెస్ట్ టాస్క్‌లో కూడా ఆటగాళ్లు గెలిచినట్టుగా అనిపిస్తుంది. ఇందులో ఎవరు గెలిచారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
కెప్టెన్‌గా ప్రశాంత్?
నిన్నటి ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) మంచి కెప్టెన్ కాదంటూ తన దగ్గర నుంచి బ్యాడ్జ్ తీసుకున్నాడు బిగ్ బాస్. కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ప్రశాంత్‌కి కెప్టెన్ బ్యాడ్జ్ అలాగే ఉంది. అంటే నిజంగా తీసుకున్నారా? లేదంటే బిగ్ బాస్ మళ్లీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు ప్రశాంత్‌కి ఇచ్చారో తెలియాలంటే బిగ్ బాస్ లైవ్ చూడాల్సిందే.
Also Read: ప్రశాంత్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ, భోలే షావలి