Shivaji: ప్రశాంత్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ, భోలే షావలి
Bigg Boss Season 7: పల్లవి ప్రశాంత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించకపోవడంతో తన కెప్టెన్సీని తొలగించారు. దీంతో భోలే షావలి, శివాజీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయినప్పటి నుంచి పవర్ అస్త్రా కోసమే పోటీ జరిగింది. పవర్ అస్త్రా వస్తేనే కంటెస్టెంట్స్ అంతా హౌజ్‌మేట్స్ అవుతారని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. కాబట్టి పవర్ అస్త్రా గురించి మాత్రమే కంటెస్టెంట్స్ ఆలోచించేవారు. తాజాగా పవర్ అస్త్రా అనే అంశం పూర్తయ్యింది. అందరూ హౌజ్‌మేట్స్ అయిపోయారు. ఆ తర్వాత కెప్టెన్ ఎవరు అవుతారు అనే విషయంపై పోటీ జరిగింది. అలా బిగ్ బాస్ సీజన్ 7 మొదటి కెప్టెన్‌గా పల్లవి ప్రశాంత్ గెలిచాడు. కానీ కెప్టెన్సీ గెలుచుకున్న కొన్నిరోజుల్లోనే బిగ్ బాస్.. ప్రశాంత్ చేసిన తప్పులను గుర్తుచేసి తన దగ్గర నుంచి కెప్టెన్ బ్యాచ్‌ను తీసేసుకున్నారు. దీంతో ప్రశాంత్ కెప్టెన్సీ విషయంలో తనతో పాటు తనను ఇష్టపడే కంటెస్టెంట్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
కెప్టెన్ బాధ్యలను నిలబెట్టుకోలేదు..
బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో పవర్ అస్త్రాను సాధించుకున్నాడు పల్లవి ప్రశాంత్. కానీ అది తన చేతికి వచ్చిన మూడోరోజే పవర్ అస్త్రా వెనక్కి ఇచ్చేయమన్నారు బిగ్ బాస్. దీంతో ఆ వెంటనే జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో కసిగా ఆడి కెప్టెన్ అయ్యాడు. కానీ తను కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు నిర్వర్తించలేకపోయాడు. నేగు (అక్టోబర్ 11న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో ముందుగా కెప్టెన్ అంటే ఎలా ఉండాలి అంటూ కంటెస్టెంట్స్‌ను అడిగి తెలుసుకున్నాడు బిగ్ బాస్. ఈ ప్రశ్నకు ఒక్కొక్క కంటెస్టెంట్.. ఒక్కొక్క సమాధానం చెప్పారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను కూడా మంచి కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని అడిగారు. దానికి ప్రశాంత్.. కెప్టెన్ అయినా కూడా తన మాట ఎవరూ వినడం లేదని వాపోయాడు. కెప్టెన్ అంటే నేను పనిచేస్తూ వారితో చేపించాలి అని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
కెప్టెన్సీ పోయింది..
పల్లవి ప్రశాంత్ మంచి కెప్టెన్ అని ఎవరెవరు అనుకుంటున్నారో చేతులు ఎత్తమని బిగ్ బాస్ ఆదేశించారు. అర్జున్, ప్రియాంక, పూజా మూర్తి, భోలే షావలి, అశ్విని శ్రీ, నయని పావని, శోభా, యావర్, శివాజీ.. వీరిందరూ ప్రశాంత్‌ను సపోర్ట్ చేస్తూ మంచి కెప్టెన్ అని చేయి ఎత్తారు. కానీ సందీప్, గౌతమ్, తేజ మాత్రం ఎత్తకుండా ప్రశాంత్ మంచి కెప్టెన్ కాదు అని డిసైడ్ చేసేశారు. అమర్‌దీప్ మాత్రం చేయి ఎత్తాలా, వద్దా అనే కన్ఫ్యూజన్‌లోనే చివరి వరకు ఉన్నాడు. కంటెస్టెంట్స్ అభిప్రాయాలు బయటపెట్టిన తర్వాత బిగ్ బాస్.. ప్రశాంత్ చేసిన తప్పులను తనకు గుర్తుచేశాడు. తేజ నిద్రపోయాడని, యావర్ తెలుగులో మాట్లాడలేదని.. ఇవన్నీ కెప్టెన్‌గా చూస్తూ కూడా ప్రశాంత్ ఏమీ చేయలేదని చెప్తూ తన కెప్టెన్సీ బ్యాచ్‌ను వెనక్కి తీసేసుకున్నారు బిగ్ బాస్. కానీ కెప్టెన్సీ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ మాత్రం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
ప్రశాంత్ కెప్టెన్సీ పోయిన తర్వాత శివాజీ, భోలే షావలితో కలిసి బాధగా కూర్చున్నాడు. బాధపడుతున్న ప్రశాంత్‌కు శివాజీ హితబోధ చేశాడు.
శివాజీ, భోలే షావలి కన్నీళ్లు..
‘‘ఏది అతి అయినా కూడా వికటిస్తుంది. మళ్లీ ఆడు, గెలువు, మళ్లీ కెప్టెన్ అయ్యి చూపించు’’ అంటూ ప్రశాంత్‌ను ఓదారుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘‘నేను కెప్టెన్ అవ్వాలని చాలా చేశాడు’’ అని శివాజీ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. వీరిద్దరి బాండింగ్ చూసి భోలే షావలి సైతం ఎమోషనల్ అయ్యాడు. కెప్టెన్సీ కోసం ప్రశాంత్ ఎంత కష్టపడ్డాడు అని గుర్తుచేసుకున్నాడు శివాజీ. ‘‘నాకే వస్తుంది ఏడుపు’’ అంటూ ఇతర కంటెస్టెంట్స్ ముందు బాధపడ్డాడు. ‘‘వాడు వేషం వేయడమెందుకు దొంగోడిలాగానే ఉన్నాడు కదా అని ఒకడు అన్నాడు.’’ అని ప్రశాంత్‌కు జరిగిన అవమానాలను గుర్తుచేసుకుంటూ ఏడ్చాడు శివాజీ.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial