Bigg Boss Telugu 6: ఎంటర్టైన్మెంట్ పక్కా - బిగ్ బాస్ కంటెస్టెంట్ గా బన్నీ ఐటెం గర్ల్!
తొమ్మిదో కంటెస్టెంట్ గా కంటెస్టెంట్ గా అభినయ శ్రీ ఎంట్రీ ఇచ్చింది.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
తొమ్మిదో కంటెస్టెంట్ గా కంటెస్టెంట్ గా అభినయ శ్రీ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' సినిమాలో 'అ అంటే అమలాపురం' సాంగ్ కి స్టెప్పులేసి బాగా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. ఇదే సాంగ్ కి పెర్ఫార్మ్ చేస్తూ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమెని బిగ్ బాస్ షోలోకి తీసుకొచ్చి గ్లామర్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అభినయ శ్రీ తన కెరీర్ లో 'ఎవడి గోల వాడిది', 'పైసాలో పరమాత్మ', 'అత్తిలి సత్తిబాబు' వంటి సినిమాల్లో నటించింది. చాలా కాలంగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇప్పుడు తిరిగి కం బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా కనిపించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
స్టేజ్ పైకి వచ్చిన అభినయతో కాసేపు ముచ్చటించారు నాగార్జున. ఇప్పుడు తనకు టైం వచ్చిందని.. బిగ్ బాస్ షోతో అందరినీ ఎంటర్టైన్ చేస్తానని చెప్పింది. చాలా ఏళ్ల తరువాత తనకు దొరికిన ఓ బంగారు స్టేజ్ బిగ్ బాస్ అని.. దీన్ని వదులుకోనని చెప్పింది. తనకు యానిమల్స్ అంటే చాలా ఇష్టమని.. నిజమైన ప్రేమ వాటి దగ్గరే దొరుకుతుందని చెప్పింది. యానిమల్ లవర్ అయినప్పటికీ.. తనకు బల్లి అంటే చాలా భయమని చెప్పింది.
కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరినీ ఒక్కో కార్డు సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు నాగార్జున. అభినయ శ్రీ సెలెక్ట్ చేసుకున్న కార్డు నక్క. దానికి అర్ధం ఏంటో తరువాత చెబుతానని అన్నారు నాగార్జున.
ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.
Also Read : ఎంబీబీఎస్ పక్కన పెట్టి మరీ వచ్చిన శ్రీ సత్య - 'రేసుగుర్రం'లో పాటతో ఎంట్రీ
Also Read : 'సుర్రు సుమ్మైపోద్ది' - బిగ్ బాస్ హౌస్ లో చలాకీ చంటి గ్రాండ్ ఎంట్రీ!
We welcome our 9th contestant #AbhinayaSree to Bigg Boss house.#AbhinayaSreeOnBBTelugu#BiggBossTelugu6 #BBLiveOnHotstar@StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/WFkUg8udkG
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 4, 2022