అన్వేషించండి

Bigg Boss Telugu 7: నామినేషన్స్‌లో ఎనిమిది మంది, కెప్టెన్‌తో పాటు ఆ ఒక్కడే సేఫ్!

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా జరిగిన నామినేషన్స్‌లో 8 మంది నామినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా.. ఇద్దరు మాత్రమే సేవ్ అయ్యారు.

Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7లో గత కొన్నివారాలుగా నామినేషన్స్ అనేవి రెండురోజులు ప్రసారమవుతున్నాయి. బిగ్ బాస్ ఫ్యాన్స్‌ కూడా ఈ నామినేషన్స్‌ను చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనడానికి రెండురోజులు ప్రసారమవుతున్న ఎపిసోడ్సే సాక్ష్యం అనుకోవచ్చు. సీజన్ మొదటితో పోలిస్తే.. ఈమధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రివెంజ్ నామినేషన్స్ అనేవి ఎక్కువయ్యాయి. ఒక కంటెస్టెంట్.. మరో కంటెస్టెంట్‌ను నామినేట్ చేయగా.. తిరిగి అదే కంటెస్టెంట్ వచ్చి తనను నామినేట్ చేసినవారిని నామినేట్ చేస్తున్నారు. తాజాగా జరిగిన నామినేషన్స్‌లో కూడా రివెంజ్ నామినేషన్సే ఎక్కువగా జరిగాయి. ఈసారి నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

పదిలో ఎనిమిదిమంది నామినేట్..
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వారే అమర్‌దీప్, ప్రియాంక, శోభా శెట్టి, అర్జున్, ప్రియాంక, రతిక, అశ్విని, ప్రిన్స్ యావర్, గౌతమ్. శివాజీ కెప్టెన్ అవ్వడంతో ఆయన నామినేషన్స్‌లో లేరు. ఇక పల్లవి ప్రశాంత్‌ను కూడా కేవలం అర్జున్ మాత్రమే నామినేట్ చేయడంతో తను కూడా ఈవారం నామినేషన్స్ నుండి బయటపడ్డాడు. నిన్న ప్రసారమయిన ఎపిసోడ్‌లో ప్రియాంక.. అశ్వినిని చేసిన నామినేషన్స్ హైలెట్ అవ్వగా.. ఈరోజు అశ్విని తిరిగి ప్రియాంకను నామినేట్ చేసింది. వీరి నామినేషన్స్ రెండు ఎపిసోడ్స్‌లో హైలెట్‌గా నిలిచాయి. 

రతిక విశ్వరూపం..
ఇక నామినేషన్స్ ప్రారంభం అవ్వకముందు శివాజీ దగ్గర టిప్స్ తీసుకున్న రతిక.. ప్రియాంక, శోభాలను నామినేట్ చేసింది. అవసరం లేకపోయినా అరుస్తూ.. మళ్లీ పాత రతికలాగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో కొందరు ప్రేక్షకులు రతిక ఈజ్ బ్యాక్ అని ఫీల్ అవుతున్నారు. ఇక తన నామినేషన్స్‌లో మాత్రమే కాకుండా అమర్‌దీప్, యావర్ మధ్య జరిగిన నామినేషన్స్‌లో కూడా రతిక కీలక పాత్ర పోషించింది. రతిక చెప్పిన ఒక్క మాటను విని యావర్.. అమర్‌ను నామినేట్ చేశాడు. దాని వల్ల వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అమర్ కూడా యావర్‌ను నామినేట్ చేసినప్పుడు కూడా రతిక చెప్పిన మాటనే కారణంగా తీసుకున్నాడు. 

బ్యాడ్ కెప్టెన్‌ అంటూ కామెంట్స్..
ఇక శోభా శెట్టిని బ్యాడ్ కెప్టెన్ అన్నందుకు యావర్‌కు, శోభాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. శోభా కెప్టెన్సీ ముగిసిన తర్వాత అర్జున్, యావర్ మాత్రమే తనను బ్యాడ్ కెప్టెన్ అన్నారు. దీంతో ఈ విషయాన్ని శోభా చాలా సీరియస్‌గా తీసుకుంది. తనను బ్యాడ్ కెప్టెన్ అంటే ఒప్పుకోనని తనను నామినేట్ చేసిన రతిక, అర్జున్, యావర్‌లతో వాగ్వాదానికి దిగింది. అయినా కూడా వారి ఓట్లతో నామినేషన్స్‌లో నిలబడింది. ఇక ప్రియాంక, అశ్వినిల మధ్య జరిగిన నామినేషన్స్‌లో కొన్ని బాడీ షేమింగ్ పదాలు కూడా ఎపిసోడ్‌లో హైలెట్ అయ్యాయి. సంబంధం లేకుండా అశ్విని బాడీ పార్ట్స్ గురించి మాట్లాడడంతో ప్రియాంక కూడా దానికి కౌంటర్ ఇచ్చింది. ఇక వాడివేడిగా నామినేషన్స్ జరిగిన తర్వాత, ఒకరితో ఒకరు వాదించుకున్న తర్వాత కంటెస్టెంట్స్ అంతా కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు.

Also Read: నీ బాడీలో అన్ని పార్ట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా, నా బాడీలో కరెక్ట్‌గా లేవా? అశ్వినిపై ప్రియాంక ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget