Bigg Boss Season 7: ఏం చెప్పినా నమ్మేస్తాడు, మనుషులను హ్యాండిల్ చేయడం రాదు - అమర్ ప్రవర్తనపై భార్య తేజస్విని వ్యాఖ్యలు
Bigg Boss Season 7: అమర్‌దీప్ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన తర్వాత తన భార్య తేజస్విని ఎక్కువగా అమర్ ఆటపై స్పందించడానికి ముందుకు రావడం లేదు.
![Bigg Boss Season 7: ఏం చెప్పినా నమ్మేస్తాడు, మనుషులను హ్యాండిల్ చేయడం రాదు - అమర్ ప్రవర్తనపై భార్య తేజస్విని వ్యాఖ్యలు tejaswini reveals some interesting facts about amardeep before he entered into Bigg Boss Season 7 Bigg Boss Season 7: ఏం చెప్పినా నమ్మేస్తాడు, మనుషులను హ్యాండిల్ చేయడం రాదు - అమర్ ప్రవర్తనపై భార్య తేజస్విని వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/13/cdd81f538f2ef77743932e3e213558811697215834875802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన తర్వాతే సీరియల్ యాక్టర్ అనుదీప్ ఎలా ఉంటాడు అనే విషయం చాలామంది ప్రేక్షకులకు తెలిసింది. అందులో కొందరు ప్రేక్షకులు అమర్‌దీప్‌ను ప్రశంసిస్తుంటే.. చాలామంది మాత్రం తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అమర్‌దీప్ తల్లి సైతం అలాంటి నెగిటివ్ కామెంట్స్ ఆపేయండి అంటూ ప్రేక్షకులను కోరుకుంది. ఇక తన భార్య తేజస్విని మాత్రం అమర్‌దీప్ ఆట గురించి పెద్దగా స్పందించానికి ఇష్టపడడం లేదు. కానీ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లే ముందు అమర్‌దీప్, తన భార్య కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అసలు బిగ్ బాస్ హౌజ్‌లో ఎలా ఉంటాడో అని అంచనా వేసి చెప్పింది తేజస్విని.
మైండ్ గేమ్స్ ఆడతారు
అమర్‌దీప్ చాలా అల్లరి చేస్తాడు అని తేజస్విని చెప్పుకొచ్చింది. మరి బిగ్ బాస్ హౌజ్‌లో ఎలా ఉంటాడని అనుకుంటున్నారు అని ప్రశ్న తేజస్వినికి ఎదురయ్యింది. దానికి సమాధానంగా.. ‘‘అదే తెలియడం లేదు. ఎలా ఉంటుంది ఏంటి అని. మనసులో ఏముండదు తనకు చెప్పేటప్పుడు. అక్కడికి వచ్చేవారు ఎక్కవగా మైండ్ గేమ్ ఆడేవాళ్లు చాలామంది ఉంటారు. అంటే ముందు బాగున్నట్టే ఉంటారు అలా చాలా జరుగుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే.. ఏం చెప్పినా నమ్మేస్తాడు అమర్. తనను అర్థం చేసుకుంటారా లేక తను మాట్లాడేది ఇంకొక రకంగా తీసుకుంటారా అనేది నాకు బయట భయమేస్తుంది. తను ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నాడు అని మాకు తెలిసినా.. అక్కడికి వచ్చేవాళ్లకి తెలియదు కదా’’ అని తన భయాన్ని బయటపెట్టింది తేజస్విని.
ప్రోమోలపై అమర్‌దీప్ భార్య రియాక్షన్
ఇక ప్రోమోల గురించి మాట్లాడుతూ వారు 23 గంటలు బాగున్నా.. ఒక గంట గొడవపడితే ప్రోమోల్లో అవే ఉంటాయి, వాటిని ఆధారంగా ఒక మనిషిని జడ్జ్ చేయలేము అని అన్నారు తేజస్విని. అమర్ గురించి మాట్లాడుతూ.. ‘‘తనకు హార్డ్ వర్క్ చేయాలని ఉంటుంది. టాస్క్ ఇచ్చినా, గేమ్ ఇచ్చినా కచ్చితంగా గెలవాలి అని కచ్చితంగా ఉంటుంది. కానీ టాస్క్ పక్కన పెడితే.. మనుషులను హ్యాండిల్ చేయడం రాదు. మనుషులను హ్యాండిల్ చేయడం వస్తే ఇలా ఉండేది కాదు.’’ అని తెలిపింది తేజస్విని. అటు తల్లి, ఇటు భార్య అమర్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడినా, తన ఫ్యాన్స్ తనకు ఓట్లు వేస్తూ బిగ్ బాస్‌లో ముందుకు నడిపిస్తున్నా.. ఇప్పటికే పలువురు ప్రేక్షకుల్లో అమర్‌పై ఒకటి నెగిటివ్ అభిప్రాయం అయితే వచ్చేసింది.
సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నా
అమర్‌దీప్ కూడా ఈ ఇంటర్వ్యూలో తన గురించి చాలామంది ప్రేక్షకులకు తెలుసు అని, తను బయట ఎలా ఉంటానో బిగ్ బాస్ హౌజ్‌లో కూడా అలాగే ఉంటాను అని చెప్పుకొచ్చాడు. తను యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన కొత్తలో ఎవరైనా చూస్తే బాగుండు అని అనుకునేవాడని, ఇప్పుడు అమర్ అంటే ఏంటో కొంతమందికి తెలిసేలా తన సామ్రాజ్యాన్ని తానే స్థాపించుకున్నానని గర్వంగా చెప్పుకొచ్చాడు. తనకు సపోర్ట్ చేయమని కోరాడు. అమర్‌దీప్ కోరుకున్నట్టుగానే ప్రతీవారం తను నామినేషన్స్‌లోకి వస్తున్నా.. తనను సేవ్ చేస్తూ హౌజ్‌లోనే ఉండనిస్తున్న ఫ్యాన్స్ ఉన్నారు. కానీ తన ఆటతీరు కొంచెం మార్చితే బాగుంటుంది అని ఫీలయ్యే ప్రేక్షకులు కూడా ఉన్నారు.
Also Read: ఈ చంటిగాడు శివాజీ చంచా - ప్రశాంత్‌పై అర్జున్ వ్యాఖ్యలు, బయటపడిన అసలు రూపం
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)