Bigg Boss Season 7: ఈ చంటిగాడు శివాజీ చంచా - ప్రశాంత్‌పై అర్జున్ వ్యాఖ్యలు, బయటపడిన అసలు రూపం
Bigg Boss Season 7: అర్జున్ అంబటి బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి తను స్ట్రాంగ్ ప్లేయర్ అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ తాజాగా ప్రశాంత్‌పై నోరుపారేసుకొని తప్పు చేశాడు అర్జున్.
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయిదుగురు కంటెస్టెంట్స్.. బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అయితే ఈ ఐదుగురు.. ఆరు వారాలుగా బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ ఆడుతున్న ఆటను, వారి ప్రవర్తనను బయట నుంచి చూసే వచ్చారు. ఈ అయిదుగురు కచ్చితంగా ఏదో ఒక స్ట్రాటజీతోనే బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టి ఉంటారు. అందుకే కొందరు కొత్త కంటెస్టెంట్స్.. ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది అనుకుంటున్న పాత కంటెస్టెంట్స్‌తో సావాసం చేస్తున్నారు. ఇప్పటికే అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఈ ఇద్దరూ కలిసి పల్లవి ప్రశాంత్‌పై చేసిన నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శివాజీ చంచా
అర్జున్, గౌతమ్ కలిసి పోటుగాళ్లు టీమ్‌లో కలిసి ఆడారు. దీంతో వీరు బాగా క్లోజ్ అయ్యారు. అందుకే ఇద్దరూ కలిసి ఇతర కంటెస్టెంట్స్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌పై అర్జున్ అంబటి దారుణమైన కామెంట్స్ చేశాడు. ‘‘ఈ చంటిగాడు శివాజీ చంచా’’ అంటూ అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ‘‘మంచి టాస్క్ పడని వీడి పనిచెప్తా’’ అని ప్రశాంత్‌ను ఉద్దేశించి అన్నాడు అర్జున్. ఇక అర్జున్ హెడ్స్ ఆఫ్ లగేజ్‌గా ఉన్నాడు కాబట్టి అప్పుడు కూడా ప్రశాంత్ తను చెప్పిన మాట వినలేదని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ప్రశాంత్‌పై ఒక బూతు పదాన్ని కూడా ఉపయోగించాడు.
ప్రశాంత్‌ను ఎర్రిపుష్పం అన్న అర్జున్
‘‘ఈ ఎర్రిపుష్పంగాడు నేను చెప్తే వినలేదు. ఈరోజు బట్టలు త్యాగం చేయరా అని చెప్పాను. అలా అయితే రేపు రెండు బట్టలు తీసుకోవచ్చు కదా అని చెప్పాను. అయినా వినలేదు. వెళ్లి శివాజీని అడిగొచ్చాడు. బేరాలు ఆడాడు. అంటే తనకంటూ ఒక అభిప్రాయం లేదు. అన్నింటికి శివాజీ దగ్గరకు వెళ్తున్నాడు’’ అని అర్జున్ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మామూలుగా పల్లవి ప్రశాంత్.. శివాజీ ఏం చెప్తే అది చేస్తాడని, తనకంటూ సొంత అభిప్రాయం లేదని ఇతర కంటెస్టెంట్స్‌తో పాటు చాలామంది ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. కానీ అదే విషయం చెప్పడానికి అర్జున్ ఉపయోగించిన పదాలు చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు.
చిన్నపిల్లలు ఆడినట్టు ఆడావు
ఈ డిస్కషన్ అంతా గౌతమ్‌తో జరుగుతుంది కాబట్టి గౌతమ్, పల్లవి ప్రశాంత్ కలిసి ఆడిన కెప్టెన్సీ టాస్క్ గురించి కూడా అర్జున్ గుర్తుచేశాడు. ‘‘ఆ కలర్ టాస్క్‌లోనే వాడిని మడతెట్టేయాల్సింది. చిన్నపిల్లలు ఆడినట్టు ఆడావు.’’ అంటూ గౌతమ్‌ను విమర్శించాడు అర్జున్. అయితే అర్జున్ అన్న మాటలను గౌతమ్ ఒప్పుకోలేదు. సంచాలకురాలిగా ఉన్న ప్రియాంకదే తప్పు అని అన్నాడు. ‘‘ఆ టాస్క్‌లో ఒకవేళ ప్రశాంత్ ఓడిపోయింటే.. వీడు టాస్కులు బాగా ఆడుతాడు, గెలుస్తాడు అనే మాట వచ్చేది కాదు కదా’’ అన్నాడు అర్జున్. మామూలుగా ఒక కంటెస్టెంట్‌పై ఇతర కంటెస్టెంట్స్‌కు అసూయ అనేది ఉండడం సహజమే. కానీ ఎవరూ ఇంత ఓపెన్‌గా చెప్పడానికి ముందుకు రారు. అర్జున్ మాత్రం ఈ ఒక్క సంభాషణతో తనకు ప్రశాంత్‌పై ఎంత కోపం ఉందనే విషయం బయటపడింది.
Also Read: నోరు మూసుకో అంటూ పూజాపై అశ్విని ఫైర్ - ‘సై’ మూవీ తరహాలో బిగ్ బాస్ బంతాట, యావరే కెప్టెన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial