Bigg Boss 6 Telugu: నిన్ను సంచాలక్‌గా సెలెక్ట్ చేయడమే మా తప్పు - సూర్యతో గొడవపెట్టుకున్న ఇనయా
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఫిజికల్ టాస్కు ఓ స్థాయిలో జరుగుతోంది.
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టాస్కు మొత్తం చేపలమయయే. ‘పుష్ ఫర్ ఫిష్’ పేరుతో ఓ టాస్కు ఇచ్చారు. దీనికి సూర్యకు సంచాలక్ గా ఎంచుకున్నారు ఇంటి సభ్యులు. రేవంత్ - ఇనాయ,బాలాదిత్య - మెరీనా, కీర్తి - రోహిత్, ఆదిరెడ్డి - గీతూ, ఫైమా - రాజ్, శ్రీహాన్ - వాసంతి జంటలుగా ఉన్నట్టు ప్రోమోలో కనిపించారు. కాగా ఓ కూరగాయల బండి మీద నలుగురు అమ్మాయిలు కూర్చోగా, వారి టీమ్ లోని మగవారు తోస్తూ కనిపించారు. ఎవరైతే రెడ్ లైన్ దాటి ఆ బండిని తోస్తారో, వారే గెలిచినట్టు. ఇందులో రేవంత్ - ఇనయా ఓడిపోయారు. దీంతో రేవంత్ ‘చాలా మంది ఆనందపడుతున్నారు మనం ఓడిపోయినందుకు’ అని ఇనయాతో అన్నాడు. ఫేవరటిజం కనిపించింది అన్నాడు రేవంత్. దానికి రాజ శేఖర్ ‘ఫేవరటిజం ఎవరికీ చేయలేదు’ అన్నాడు. దానికి రేవంత్ ‘రాజ్ నేను నీతో మాట్లాడలేదు దయచేసి మాట్లాడకు మర్యాదగా ఉండదు’ అన్నాడు.
సంచాలక్‌గా ఉన్న సూర్యతో ఇనయా గొడవకు దిగింది. రెండు బండిని పైకెత్తినా రాజ్‌ను ఏమీ అనలేదంటూ సూర్యతో మాట్లాడింది. దానికి సూర్య ఏదో చెప్పబోయాడు. దానికి ఇనయా ముందు నుంచే ప్లాన్ చేసుకుని చేశారని కనిపిస్తూనే ఉంది అంది. ‘నన్ను సంచాలక్‌గా మీరు సెలెక్ట్ చేశారు’ అన్నాడు సూర్య. దానికి ఇనయా ‘అదే మేము చేసిన తప్పు’ అని మాటకు మాట సమాధానం ఇచ్చింది. కానీ ఎందుకో ఇంకా పాత ఇనయా వచ్చినట్టు కనిపించలేదు. ఆ ఫైటర్ ఇంకా బయటపడలేదు. వాదిస్తున్నా నెమ్మదిగానే మాట్లాడుతోంది కానీ, ఆ జోరు కనిపించడం లేదు.
మళ్లీ పైనుంచి చేపలు విసరడం మొదలు పెట్టారు బిగ్ బాస్. వాటి కోసం జంటలన్నీ మళ్లీ కిందా మీద పడి కొట్టుకున్నాయి. ఇక గీతూ అయితే ఫిజికల్ గేమ్ ఆడలేక రేవంత్ పైనే ఆ విసుగు చూపిస్తూ కనిపించింది. మొత్తమ్మీద ఈ టాస్కు ఎలా సాగుతుందో, ఎవరెవరు కెప్టెన్సీ కంటెండర్లుగా మారుతారో చూడాలి.
ఈ వారం ఇంట్లో ఉన్న 14 మంది నామినేషన్లో ఉన్నట్టు చెప్పారు బిగ్‌బాస్. ఈ వారం ఇంటికి కెప్టెన్ కూడా లేడు. దీంతో ఎవరూ సేవ్ కాలేదు. అందరూ నామినేట్ అయ్యారు. ఈ వారం ఎవరు బయటికి వెళతారో అంచనా వేయడం కూడా చాలా కష్టంగా ఉంది. ఈసారి మెరీనా వెళ్లడం ఖాయం అనుకున్నారంతా. కానీ ఈ వారం మెరీనా ఫైట్ ఓ స్థాయిలో ఉంది. గట్టి పోటీ ఇచ్చింది. తన స్టాండ్ తాను గట్టిగా తీసుకుని మాట్లాడింది. కాబట్టి ఈసారి వాసంతికి ఎసరు పెట్టడం ఖాయంలా ఉంది. ఈ వారం కూడా ఆట తక్కువగా ఉన్నది వాసంతిదే. ఇన్నాళ్లు ఆట లేకపోయినా అందంగా నెట్టుకొచ్చింది వాసంతి. మరి ఈ వారం చూడాలి ఏం జరుగుతుందో.
Also read: నువ్వొక పెరుగు దొంగవి, రేవంత్ పై నోరుపారేసుకున్న గీతూ - నామినేషన్స్‌లో అందరూ ఆన్ ఫైర్