Bigg Boss 6 Telugu Episode 51: నువ్వొక పెరుగు దొంగవి, రేవంత్ పై నోరుపారేసుకున్న గీతూ - నామినేషన్స్‌లో అందరూ ఆన్ ఫైర్
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ నామినేషన్స్ డే కోసం ఎదురు చూసేవారికి ఈ ఎపిసోడ్ పండగలాగే ఉంటుంది.
Bigg Boss 6 Telugu: నామినేషన్స్‌లో చాలా మంది ఇంటి సభ్యులు ఎదుటి సభ్యుడు నామినేషన్‌ను వాదించకుండానే తీసుకునేవారు. కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం ట్రెండు మారింది. ప్రతి ఒక్కరూ తమ కోసం స్టాండ్ తీసుకుని మాట్లాడారు. గట్టిగా వాదించారు. ఎప్పటిలాగే రేవంత్ ఆన్ ఫైర్ మీదే ఉన్నాడు. ఆయనకు గీతూకి గట్టిగానే వాదన పడింది. ఈసారి చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడూ వాదించని మెరీనా కూడా గట్టిగానే స్టాండ్ తీసుకుని మాట్లాడింది.
నామినేషన్లలో భాగంగా బిగ్‌బాస్ చిన్న మంట పెట్టాడు. ఆ మంటలో నామినేట్ చేయాలనుకుంటున్న సభ్యుడి ఫోటో వేసి తగిన కారణం చెప్పాలని చెప్పాడు. అయితే వాసంతి, రోహిత్ ఇప్పటికే నామినేషన్లలో ఉన్నందున వీరిని ఎవరూ నామినేట్ చేయకూడదని చెప్పారు. శ్రీసత్యతో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. శ్రీసత్య మొదటగా సూర్య, మెరీనాను నామినేట్ చేసింది. తాను చిట్టీలు వేసినప్పుడు అడ్డు చెప్పకుండా, మరుసటి రోజు తన నిర్ణయం మార్చుకున్నప్పుడు నిర్ణయం చెప్పకుండా నాగార్జున ముందు మాత్రం ఇష్టం లేదనడం నచ్చలేదని చెప్పింది. ఇక మెరీనాను ఇదే విషయంపై నామినేట్ చేసింది. దీనికి ‘నీ ఫూలిష్‌నెస్‌తో వేరే వాళ్లను జడ్జ్ చేయం తప్పు, లీడర్ లా ప్రవర్తించు’ అని చెప్పింది. దానికి సత్య ‘నీ దగ్గర నేర్చుకుంటానులే’ అంది కాసేపు ఇద్దరూ వాదించుకున్నారు.
ఆదిరెడ్డి ఇనయా, మెరీనాను నామినేట్ చేశాడు. ఈ నామినేషన్ స్మూత్‌గానే సాగింది. మెరీనా ఇనయా, గీతూని నామినేట్ చేసింది. మెరీనా- గీతూకి కాసేపు మాటల యుద్ధం సాగింది. అసలే గీతూ నోటికి అడ్డూ అదుపు ఉండదు. మెరీనా చాలా సాఫ్ట్ అండ్ స్వీట్. వీరిద్దరికీ ఫైట్ అవుతుంటే మెరీనానే వెనకడుగు వేస్తుందనుకున్నారు అంతా, కానీ మెరీనా ఉన్నంతలో పోరాడింది. ఏడు వారాల్లో నువ్వు అయిదు వారాలు ఆట ఆడలేదు, నువ్ువ గుడ్ పర్సన్ కానీ గుడ్ గేమర్ కాదు’ అంది గీతూ. అంతేకాదు ‘నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు’ అంది. దీంతో మెరీనా చాలా ఫీలయ్యింది.
ఇక రోహిత్ వచ్చి గీతూని నామినేట్ చేశాడు. ఆమె ఆటలో కావాలనే తనకన్నా చాలా స్ట్రాంగ్ అయిన ఆదిరెడ్డి, శ్రీహాన్ పట్టుకుని లాగుతున్నట్టు నటించిందని అన్నాడు. ఫైమా, వాసంతిలను తాను లాగగలనని తెలిసినా వారి జోలికి వెళ్లలేదన్నాడు. దీంతో గీతూ నోటికి పనిచెప్పింది. ‘నువ్వు స్మార్ట్ కాదు,నేను చాలా స్మార్ట్’ అంది. రోహిత్ ‘నేను నీ గేమ్ గురించి మాట్లాడుతున్నా’ అన్నాడు. దానికి గీతూ ‘నేను నీ మైండ్ గురించి మాట్లాడుతున్నా’ అని చెప్పింది.
మెరీనా వర్సెస్ ఫైమా
వీరిద్దరికీ గొడవ పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. రేవంత్ - గీతూ గొడవ తరువాత బాగా హైలైట్ అయిన గొడవ వీరిదే. తనకు డిజాస్టర్ ట్యాగ్ ఇవ్వడాన్ని ప్రసావించింది మెరీనా. ఆ విషయంపై వారిద్దరూ వాదించుకున్నారు. ఫైమా కూడా గీతూలాగే కాస్త నోరుపారేసుకుంది. మెరీనా ‘నా ఒపినియన్ ముందు పెట్టచ్చు’ అంది. దానికి ఫైమా ‘ముందు పెట్టుకో, వెనుక పెట్టుకో, పక్కన పెట్టుకో’ అని వెటకారంగా అంది. దానికి మెరీనా ‘వెనుక పెట్టుకోవడం ఏంటి? వయసుకు రెస్పెక్ట్ ఇవ్వు’ అంది. దానికి కూడా ఫైమా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కాసేపు గీతూలా కనిపించింది.
కీర్తిని రేవంత్‌ను నామినేట్ చేసింది. వారిద్దరూ వ్యక్తిగతంగా తిట్టుకున్నారు. కీర్తి ‘కిచెన్లో ప్రతి విషయంలో తలదూరుస్తున్నాడని, ఇరిటేషన్ వస్తోందని’ అంది. దానికి రేవంత్ చాలా కోప్పడ్డాడు. ‘నాకు నువ్వంటేనే ఇరిటేషన్, అసహ్యం వస్తుందని, అయినా నేను ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదని’ అన్నాడు. దానికి కీర్తి ‘నాకు నీడ పడినా అసహ్యం’ అంది. ‘ప్లీజ్ నన్ను కెలక్కు’ అంటూ రేవంత్ ఆపేశాడు.
రేవంత్ వర్సెస్ గీతూ
తనను పెరుగు దొంగ అని ఎలా అంటావ్ అని అడుగుతూ రేవంత్ గీతూని నామినేట్ చేశాడు. దీనికి గీతూ ‘అవును నువ్వు పెరుగు దొంగవే’ అని మళ్లీ అంది. ఆమెకు కీర్తి కూడా సపోర్ట్ వచ్చింది.దీంతో రేవంత్ - గీతూ ఓ స్థాయిలో తిట్టుకున్నారు. నువ్వు నన్ను ఏం పీకలేవ్ అని రేవంత్ అనడం, రా పీకి చూపిస్తా అంది గీతూ. వీరిద్దరికీ నోళ్లు ఆగవు, ఇక వీరిద్దరి మధ్య మాటల ఫైట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి.
మన మధ్య ఏం లేదు
ఇక ఇనయా సూర్య, శ్రీహాన్‌లను నామినేట్ చేసింది. ‘శ్రీహాన్ నీకు సిరి బయట ఉందని నాకు తెలుసు. నేను మామూలుగా నీ బర్త్ డేకు కేకు రెడీ చేశా. కానీ కొందరు దాన్ని మరో విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారని అది తనకు నచ్చడం లేదని, తమ మధ్య ఏమీ లేదని చెప్పడానికే నామినేట్ చేస్తున్నా’ అని చెప్పింది. తరువాత సూర్యకు కూడా ఇదే కారణం చెప్పి నామినేట్ చేసింది. సూర్య ‘నీది నాది స్నేహం మాత్రమే. బుజ్జిమాది నాది స్నేహాన్ని దాటిపోయింది. నీకు నచ్చితే మాట్లాడు, లేకుంటే లేదు’ అని చెప్పాడు సూర్య. దానికి ఇనయా ‘నిన్ను కేవలం ఒక కంటెస్టెంట్‌గానే చూస్తా’ అని చెప్పింది.
అందరూ నామినేషన్లో...
ఈ వారం ఇంట్లో ఉన్న 14 మంది నామినేషన్లో ఉన్నట్టు చెప్పారు బిగ్‌బాస్. ఈ వారం ఇంటికి కెప్టెన్ కూడా లేడు. దీంతో ఎవరూ సేవ్ కాలేదు. అందరూ నామినేట్ అయ్యారు.