Bigg Boss Telugu 7 Finale: 'బిగ్ బాస్ 7' ఫినాలేకి గెస్ట్‌గా ఆ స్టార్ హీరో - ఇదే ఫస్ట్ టైమ్, ఫ్యాన్స్ పండగే!
Bigg Boss 7 Telugu Finale : బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు సమాచారం.
BiggBoss Telugu Seson 7 Finale Guest : తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని మరికొద్ది రోజుల్లో ఏడవ సీజన్ ని కూడా కంప్లీట్ చేసుకోబోతోంది. ప్రస్తుతం 'బిగ్ బాస్ సీజన్ 7' ఫైనల్ దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈసారి ఫైనల్ ఎపిసోడ్ ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అయ్యారు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ కి ఓ బిగ్ సెలబ్రిటీ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ బిగ్ సెలబ్రిటీ మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు అని సమాచారం.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తున్న 'గుంటూరు కారం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ కి మహేష్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిసెంబర్ 17 ఆదివారం రోజున బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. గత సీజన్ గెస్ట్లు లేకుండానే ప్లాన్ చేశారు. అలా గెస్టులు లేకుండా ఫైనల్ ఎపిసోడ్ ని ముగించడంపై కొన్ని విమర్శలు వచ్చాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు ఈసారి అలా కాకుండా బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకు మహేష్ బాబును చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసినట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ స్టేజ్ పై మహేష్ తన గుంటూరు కారం మూవీని ప్రమోట్ చేసుకోబోతున్నారు.
ఇప్పటివరకు మహేష్ తన సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి రియాల్టీ షోస్ కి వెళ్ళింది లేదు. కానీ మొదటిసారి ‘గుంటూరు కారం’ కోసం ఈ స్టెప్ తీసుకోబోతున్నాడని అంటున్నారు. మరి నిజంగానే బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలేకు మహేష్ వస్తారా? లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ లో మహేష్‌తో పాటు మరికొందరు సంక్రాంతి హీరోలు కూడా సందడి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది హీరోయిన్ల ఆటపాటలతో, సెలబ్రిటీ గెస్ట్ లతో బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలేని భారీ ఎత్తున నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కు చేరుకున్నారు.
శివాజీ తో పాటు ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి, అమరదీప్, ప్రియాంక జైన్ టైటిల్ రేస్ లో నిలిచారు. ఓటింగ్ కి మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో ఆడియన్స్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్ చేస్తూ సపోర్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం హౌస్ లో టాప్ 6 ఉన్నప్పటికీ ముగ్గురి మధ్య మాత్రమే టైటిల్ వార్ జరగబోతుందని తెలుస్తోంది. ఆ ముగ్గురు మరెవరో కాదు పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్. వీళ్ళ మధ్య టైటిల్ వార్ చాలా గట్టిగా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. మరి చివరికి టైటిల్ ఎవరి సొంతమవుతుందో చూడాలి.
Also Read : మ్యాజికల్ కాంబో మళ్లీ రిపీట్, ముచ్చటగా మూడోసారి రవితేజతో హరీష్ మూవీ