Bigg Boss Telugu 7: ప్రియాంక, అమర్‌ల మధ్య శోభా చిచ్చు, సూపర్ సక్సెస్ అయిన లేడీ విలన్ ప్లాన్!
Bigg Boss Telugu 7: అమర్, ప్రియాంక మధ్య అవుతున్న గొడవలను తగ్గించడం కాకుండా పెంచే ప్రయత్నం చేసింది శోభా. దీంతో తను అనుకున్నట్టుగానే వారిద్దరి మధ్య దూరం పెరిగింది.
![Bigg Boss Telugu 7: ప్రియాంక, అమర్‌ల మధ్య శోభా చిచ్చు, సూపర్ సక్సెస్ అయిన లేడీ విలన్ ప్లాన్! shobha creates more gap between amardeep and priyanka in bigg boss telugu 7 Bigg Boss Telugu 7: ప్రియాంక, అమర్‌ల మధ్య శోభా చిచ్చు, సూపర్ సక్సెస్ అయిన లేడీ విలన్ ప్లాన్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/30/8a85a1b1ac345dcf1f48e60990006a251701302307456802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో ఎవరి గేమ్ వాళ్లే ఆడుకోవాలి అని, ఫ్రెండ్స్ అని చూసి హెల్ప్ చేయడం కరెక్ట్ కాదని హోస్ట్ నాగార్జున ఎన్నోసార్లు చెప్పారు. అయినా కూడా స్పా బ్యాచ్, స్పై బ్యాచ్.. ఆయన మాట వినడం లేదు. టాస్కులు వచ్చేసరికి కలిసి ఆడడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని అనుకుంటున్నారు. గతవారం ఫ్రెండ్స్ గురించి ఆలోచించి శోభాకు టాస్క్ విషయంలో హెల్ప్ చేసింది ప్రియాంక. ఈ పాయింట్‌పై కంటెస్టెంట్స్ తనను నామినేట్ కూడా చేశారు. అందుకే ఈవారం అలా జరగకుండా ఫ్రెండ్స్‌ను ఒక మాట కూడా అడగకుండా తనకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో అమర్ హర్ట్ అయ్యాడు. అమర్ పక్కనే ఉంటూ శోభా.. ప్రియాంకపై తనను మరింత రెచ్చగొట్టింది. దీనివల్ల ప్రియాంకను చూసి ప్రేక్షకులు జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హర్ట్ అయిన అమర్..
ఫినాలే అస్త్రా రేసులో అయిదు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సమయానికి ప్రియాంక.. తక్కువ పాయింట్లతో ఉంది. దీంతో తన పాయింట్స్‌లోని సగం ఇంకొక కంటెస్టెంట్‌కు ఇచ్చి తను రేసు నుంచి తప్పుకోవాలి అని బిగ్ బాస్ ప్రకటించారు. వెంటనే గౌతమ్ పేరు చెప్పింది ప్రియాంక. దీంతో అమర్ హర్ట్ అయ్యాడు. పాయింట్ల గురించి శివాజీ తనను అడిగినప్పుడు కూడా ప్రియాంక ఇస్తుందని ధైర్యంగా చెప్పుకున్నాడు అమర్. తన అంచనా తప్పు అయ్యేసరికి జీర్ణించుకోలేకపోయాడు. అయితే ప్రియాంక, గౌతమ్.. ఇద్దరూ లాస్ట్‌లో ఉన్నారు కాబట్టి ఒకవేళ వాళ్లిద్దరినీ కలిపి టాస్కుల్లో నుంచి తొలగించినా.. వారిద్దరూ కలిసి అర్జున్‌కు సపోర్ట్ చేయాలని మాట్లాడుకున్నట్టు శోభా విని అమర్‌కు చెప్పింది. దీంతో అమర్ కోపం మరింత పెరిగింది.
ఎవరూ ఓదార్చరు..
అమర్, ప్రియాంక మధ్య పాయింట్ల గురించి గొడవ మొదలయినప్పుడు శోభా.. అమర్ పక్కన చేరి ప్రియాంక గురించి మరింత నెగిటివ్‌గా చెప్పడం మొదలుపెట్టింది. నమ్మి వెధవను అయ్యాను ఫీల్ అవుతుంటే ప్రియాంక వచ్చి సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది. శోభా మధ్యలో చేరి అక్కడ కూడా అమర్‌ను రెచ్చగొట్టినట్టే మాట్లాడింది. దీంతో ప్రియాంక ఒంటరిగా వెళ్లి లగేజ్ ఏరియాలో కూర్చొని బాధపడింది. అమర్ అక్కడికి వచ్చినా కూడా ప్రియాంకను చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత శోభా వచ్చి తనను వంట చేయడానికి పిలిచింది. అందరు బాధపడినప్పుడు తను వెళ్లి ఓదారుస్తానని కానీ తను బాధపడినప్పుడు మాత్రం ఎవరూ కనీసం పట్టించుకోవడం లేదని బాధపడింది ప్రియాంక. గత కొన్నిరోజులుగా తనకు చాలా దిగులుగా అనిపిస్తుందని ఏమోషనల్ అయ్యింది. అయినా కూడా శోభా జాలి లేకుండా మాట్లాడింది. మళ్లీ మళ్లీ తనను వంట చేయడానికి పిలుస్తూనే ఉంది. నువ్వు వెళ్లు, నేను వస్తా అంటూ శోభాను అక్కడి నుంచి పంపించేసింది ప్రియాంక.
తప్పు లేకపోయినా సారీ..
ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో కూర్చున్న అమర్, శోభాల దగ్గరకు వచ్చింది. తన తప్పు లేకపోయినా అమర్‌కు సారీ చెప్పాలని చూసింది. అయితే అర్జున్‌కు తాము సపోర్ట్ చేయాలనుకున్న విషయాన్ని గుర్తుచేశాడు అమర్. కాసేపటి వరకు స్పా బ్యాచ్ ఓవరాక్షన్ అంతా గమనిస్తూనే ఉన్న అర్జున్.. శోభా దగ్గరకు వచ్చి తన పేరు వినబడిందని, కచ్చితంగా ఈ విషయం గురించి మాట్లాడతానని అన్నాడు. మరోవైపు ప్రియాంక ఎంత చెప్తున్న అమర్ మాత్రం అన్యాయం అయిపోయానని డ్రామా మొదలుపెట్టాడు. అప్పటివరకు అమర్‌ను రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయిన శోభా మళ్లీ వచ్చి ప్రియాంకను వంట చేయడానికి పిలిచింది. తాను బాధలో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా తన వాళ్లే అలా చేయడం చాలా బాధేస్తుంది అంటూ అర్జున్‌తో చెప్పి ఏడ్చింది ప్రియాంక.
ఆ తర్వాత కిచెన్‌లో చపాతీలు చేస్తున్న శోభా దగ్గరకు వెళ్లి తాను చేస్తానని మాట్లాడడానికి ప్రయత్నించింది. శోభా మాత్రం గట్టిగట్టిగా అరుస్తూ ప్రియాంకను దగ్గరకు రానివ్వలేదు. పట్టించుకోలేదు. దీంతో ప్రియాంక కూడా సీరియస్ అయ్యింది. ఎక్కడో కోపం ఇక్కడ చూపించకు అంటూ ప్రియాంక మీద అరిచింది శోభా. వంట నేర్చుకోవాలని అర్థమయ్యింది అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది. అమర్, ప్రియాంకల మధ్య జరిగిన గొడవలోకి శోభా రాకపోయుంటే అది కాసేపటికే ముగిసిపోయేదని కానీ శోభా వచ్చి రెచ్చగొట్టినట్టుగా మాట్లాడిందని బిగ్ బాస్ ప్రేక్షకులు ఫీలయ్యారు.
Also Read: టాలీవుడ్ హీరోకు ధోనీ సర్‌ప్రైజ్ గిఫ్ట్, నెట్టింట్లో ఫోటో వైరల్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)