Bigg Boss 7 Telugu: అలా చేయడం తప్పు, మీ కూతురైతే అలా చేస్తారా? - అమర్‌పై ప్రియాంక ప్రియుడు శివ్ ఆగ్రహం
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో అమర్‌దీప్, ప్రియాంక బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టుగా ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ వాళ్లిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని శివ్ క్లారిటీ ఇచ్చాడు.
Telugu Bigg Boss 7: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో ప్రస్తుతం ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ప్రియాంక కూడా ఒకరు. ఫినాలే అస్త్రా గెలుచుకున్న అర్జున్ తర్వాత సెకండ్ ఫైనలిస్ట్‌గా ప్రియాంక నిలిచింది. ప్రస్తుతం ఫైనల్స్‌లో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి ప్రియాంక. అందుకే తాజాగా బిగ్ బాస్ కూడా తనకు శివంగి ప్రియాంక అని బిరుదు ఇచ్చారు. ఇక హౌజ్‌లో తను విన్నర్ అవ్వడానికి ఎంత కష్టపడుతుందో.. తన బాయ్‌ఫ్రెండ్ శివ్ కూడా బయట తనను గెలిపించడానికి అంతే కష్టపడుతున్నాడు. ప్రియాంక ఆట గురించి శివ్ మాటల్లో తెలుసుకోవడానికి యూట్యూబ్ ఛానెళ్లు చాలావరకు తన ఇంటర్వ్యూల కోసం వెంటపడుతున్నారు. అలా తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో అమర్‌దీప్‌పై ఫైర్ అయ్యాడు శివ్.
అమర్‌తో స్నేహంపై శివ్ స్పందన..
అమర్‌దీప్, ప్రియాంకలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని, అమర్ కోసం ప్రియాంక ఏమైనా చేస్తుందని బిగ్ బాస్ సీజన్ 7ను మొదటి నుంచి ఫాలో అవుతున్న ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కొన్నిటాస్కుల్లో అవసరం లేకపోయినా ప్రియాంక.. అమర్‌ను సపోర్ట్ చేయడంపై తనపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ కూడా ఏర్పడింది. ఇక అమర్‌తో ప్రియాంక స్నేహంపై శివ్ స్పందించాడు. వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయాన్ని కొట్టిపారేశాడు. ‘‘ప్రియాంక.. కేవలం అమర్‌కు మాత్రమే సపోర్ట్ చేయలేదు. అందరికీ చేసింది’’ అని క్లారిటీ ఇచ్చాడు. తనలో కొన్ని గుణాలను బిగ్ బాస్‌లోకి వెళ్లిన తర్వాతే చూస్తున్నానని అన్నాడు. అందుకే తనను చూస్తుంటే సర్‌ప్రైజ్‌గా ఉండడంతో పాటు గర్వంగా కూడా ఉందని తెలిపాడు.
బెస్ట్ ఫ్రెండ్స్ కాదు.. జస్ట్ ఫ్రెండ్స్..
‘‘సీరియల్ అనేది ఒక వర్క్ లాంటిదే. మామూలుగా గవర్నమెంట్ వర్క్ చేస్తున్నవారు సంవత్సరమంతా రోజూ మీరు ఆఫీస్‌కు వెళ్తే మీ పక్కన కూర్చున్నవారితో ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది. వాళ్లు కుటుంబ సభ్యులులాగా అయిపోతారు. అలాగే సీరియల్ కూడా. పొద్దున లేచి 7 గంటలకు బయలుదేరి రాత్రి 9 వరకు వాళ్లతోనే ఉంటాం. ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ రెండున్నర నుంచి మూడు సంవత్సరాల వరకు జరిగింది. అలా ఉన్నప్పుడు చిన్న ఫ్రెండ్‌షిప్ అయినా ఉంటుంది కదా. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. వాళ్లు ఫ్రెండ్స్ అంతే. బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లినప్పుడు అమర్ నాకు తెలుసు అంతే. దానికంటే ఎక్కువ ఏం లేదు. శోభా కూడా నాకు తెలుసు. వీరు కాకుండా యావర్ గానీ, పల్లవి ప్రశాంత్ గానీ, శివాజీ గానీ ఎవరూ నాకు తెలియదు. అలా 10 మంది ఉన్నప్పుడు మనకు తెలిసినవారితోనే మనం మాట్లాడతాము కదా’’ అని ప్రియాంక, అమర్ మధ్య ఉన్న స్నేహం గురించి క్లారిటీ ఇచ్చాడు శివ్.
అమర్‌పై చాలా కోపమొచ్చింది..
ఫ్రెండ్ అయినా కూడా పలు టాస్కుల్లో ప్రియాంకతో అమర్ ప్రవర్తన సరిగా లేదని ప్రేక్షకులు సైతం ఫీల్ అయ్యారు. ముఖ్యంగా ఫినాలే అస్త్రా కోసం జరిగిన బాల్ టాస్కులో ప్రియాంకను ఎత్తిపడేశాడు అమర్. ఆ ప్రవర్తనపై శివ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ‘‘నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే ఒక్క పాయింటే కదా. ఒక టాస్క్ కోసం ఒక అమ్మాయిని నేనెప్పుడూ అలా చేయను. ఆ ఒక్క పాయింట్‌లో బిగ్ బాస్ కప్ ఏమైనా పోతుందా? ఒక పాయింట్ వల్ల, ఒక బాల్ వల్ల.. ఒక అమ్మాయిని అలా పట్టుకొని లాగడం అనేది మంచిది కాదు. జస్ట్ ఒక్క పాయింటే కదా. ఇప్పుడు ఆ బాల్ దొరికింది ఆయన ఆ బిగ్ బాస్ కప్ గెలిచేశారా? లేదు కదా.. నాకు నిజంగా అప్పుడు చాలా కోపమొచ్చింది అమర్ మీద. ఎందుకంటే ఒక అమ్మాయిని అలా చేయడం తప్పు. మీ కూతురితో ఎవరైనా అలా ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు కదా’’ అంటూ అమర్‌పై తనకు వచ్చిన కోపాన్ని బయటపెట్టాడు శివ్.
Also Read: ఇంటికెళ్లి మరీ శోభాను వేధిస్తున్న SPY సపోర్టర్స్ - నాకేం చెప్పొద్దంటూ మోనితా సీరియస్