అన్వేషించండి

Shobha Shetty: ఇంటికెళ్లి మరీ శోభాను వేధిస్తున్న SPY సపోర్టర్స్ - నాకేం చెప్పొద్దంటూ మోనితా సీరియస్

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 నుంచి చివరిగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ శోభా శెట్టి. దీంతో తన ఇంటర్వ్యూ కోసం ఎన్నో ఛానెళ్లు తన ఇంటి వరకు వెళ్లిపోయాయి.

Telugu Bigg Boss 7: ‘బిగ్ బాస్’ నుంచి బయటకు వెళ్లిన తర్వాత శోభా శెట్టికి కొంతమంది కంటెస్టెంట్లకు సపోర్ట్ చేసే యూట్యూబ్ చానెళ్లు, అభిమానుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి ఏకంగా ఆమె నివసిస్తున్న అపార్టుమెంటుకే అంతా చేరుకుంటున్నారు. దీంతో, శోభాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది.

శోభా ఇంటి సభ్యులు సీరియస్..
ముందుగా తన ఇంటి చుట్టూ మీడియా వారంతా నిండిపోవడంతో శోభా ఇంటి సభ్యులు బయటికి వచ్చి.. ‘‘లైన్‌లో నిలబడండి, అరవకండి’’ అంటూ వారందరినీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ‘‘పక్కింటి వారికి కూడా డిస్టర్బ్ అవుతుంది కదా’’ అని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది శోభా. ‘‘ఫోటో అని చెప్పారు, వీడియో ఎందుకు తీస్తున్నారు’’ అంటూ తన ఇంటి సభ్యులు సీరియస్ అయ్యారు. ఒకే ఒక ఇంటర్వ్యూ అని చెప్పడంతో కాసేపు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది శోభా. ముందుగా ‘‘ఎవరు బాగా ఆడుతున్నారు?’’ అనే ప్రశ్నకు ‘‘అందరూ బాగా ఆడుతున్నారు’’ అని జవాబు ఇచ్చింది శోభా.

బజ్ ఎలా ఉందో తెలీదు..
‘‘బయటికి వచ్చాక చూశారు కదా’’ అని ఒకరు ప్రశ్న అడుగుతుండగానే మధ్యలో జోక్యం చేసుకున్న శోభా.. ‘‘నేను ఇంకా ఏమీ చూడలేదండి. నేను ఇప్పుడే వచ్చాను. ఇంకా ఫోన్ కూడా చూడలేదు. బయట బజ్ ఎలా ఉందో నాకు తెలియదు. శివాజీ సార్ బాగానే ఆడుతున్నారు’’ అని చెప్పుకొచ్చింది. ‘‘రైతుబిడ్డ గురించి ఏమనుకుంటున్నారు? ఎవరి గురించి పాజిటివ్‌గా అనుకుంటున్నారు?’’ అని అడగగా.. ‘‘నేను ఎవరి గురించి ఏమీ అనుకోవడం లేదు. అందరూ పాజిటివ్. ప్రశాంత్ మాత్రమే కాదు.. అందరూ పాజిటివ్’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ‘‘బయట రైతుబిడ్డకు చాలా ఫాలోయింగ్ ఉంది. గెలుస్తారు అనుకుంటున్నాడు’’ అనగా.. తనకు తెలియదని సూటిగా చెప్పేసింది శోభా.

నెగిటివ్ కామెంట్స్ ఆశీర్వాదంలాగా తీసుకుంటాను..
ఇతర కంటెస్టెంట్స్ గురించి మాత్రమే కాదు.. తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌పై కూడా శోభా స్పందించింది. ‘‘నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కదా. వాళ్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు?’’ అని శోభాకు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘కచ్చితంగా వాళ్ల నెగిటివ్ కామెంట్స్ నేను ఆశీర్వాదంలాగా తీసుకుంటాను. వాళ్లు ఏదో చూసి నెగిటివ్ అనుకోని ఉండొచ్చు. నేను అలా కాదు. గేమ్ కోసమే ఫైట్ చేశాను. రియల్ లైఫ్‌లో మనం ఎందుకు అంత ఫైట్ చేస్తాం? చేయలేం కదా. ఒకవేళ వారికి అది నెగిటివ్‌గా అనిపించి ఉండొచ్చు. వాళ్లంతా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకేం వినాలని లేదు. నాకేం చెప్పొద్దు. ఎవరైతే నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టారో.. అది నాకు ఆశీర్వాదం అనుకుంటాను. ఎవరైతే నాకు పాజిటివ్‌గా సపోర్ట్ చేశారో వారికి థాంక్యూ చెప్పుకుంటాను’’ అని చెప్పి ఇంటర్వ్యూను ముగించాలనుకుంది శోభా.

కానీ శివాజీ, రైతుబిడ్డ ఫ్యాన్స్ కలిసి ఇదంతా చేశారు కదా.. అని అడుగుతుండగానే.. ‘‘ఇవే వద్దు’’ అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది. అయితే, శోభా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా శోభాను కొందరు చుట్టుముట్టి.. ‘‘మీరు ఎప్పుడో బయటకు రావల్సింది. ఇప్పుడు వచ్చారు’’ అంటూ హేళన చేశారు. ‘బిగ్ బాస్’ చరిత్రలో శోభాశెట్టికి వచ్చినంత నెగిటివిటీ మరే కంటెస్టెంట్‌కు రాలేదు. ఆమె ఎలిమినేట్ కావడంతో ఇతర కంటెస్టెంట్ల సపోర్టర్లు కాస్త శాంతించారు. అయితే, వారంతా SPY సపోర్టర్స్ అని, మీడియా కాదని, ఆమెతో సెల్ఫీ కావాలని చెబుతూ ఆమెతో తమ అభిమాన కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేసేలా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అభిమానులు అంటున్నారు. 

Also Read: రీమేక్ కాదంటున్న ప్రభాస్ నిర్మాత - అయితే 'సలార్' కొత్త కథేనా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget