అన్వేషించండి

Priyanka Jain: ‘బిగ్ బాస్’ ప్రియాంక జైన్ కళ్లకు సర్జరీ - టెన్షన్‌‌లో ప్రియుడు శివ్

Bigg Boss Priyanka: బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు ప్రియాంక కళ్లజోడుపై నెటిజన్లు కామెంట్ చేశారని బయటికి వచ్చిన తర్వాత ఏకంగా సర్జరీకే సిద్దమయ్యింది. ఈ ప్రక్రియను వీడియో తీసి తన యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది.

Priyanka Shiv: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక.. ఆ రియాలిటీ షో పూర్తయిన తర్వాత తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది. ముఖ్యంగా తన యూట్యూబ్ ఛానెల్‌లో బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి వీడియోలు చేస్తూ.. ఎంతోమంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. తాజాగా తన కళ్లకు జరిగిన సర్జరీ గురించి కూడా వివరంగా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసింది. అసలు ప్రియాంక కళ్లకు సర్జరీ ఎందుకు చేయించుకుంటుంది, సర్జరీ ప్రక్రియ ఏంటి లాంటి సమాచారాన్ని తన బాయ్‌ఫ్రెండ్ శివ్.. ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు.

ప్రియాంక కళ్లజోడుపై కామెంట్స్..
ముందుగా ఈ వీడియోలో ప్రియాంక బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు, బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత అనేక కామెంట్స్ వచ్చాయని చెప్తూ.. అలాంటి ఒక కామెంట్‌ను చూపించాడు శివ్. ‘‘కళ్లజోడు పెట్టుకుంటే వాళ్ల ఫీలింగ్స్, ఎక్స్‌ప్రెషన్స్ దాగిపోతాయి. అందుకే ప్రియాంక ఎవరి ముందుకు రావడం లేదు అని కామెంట్స్ వచ్చాయి’’ అని బయటపెట్టాడు. అయితే ప్రియాంక బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు తాను కంటికి సర్జరీ చేయించుకున్నానని, ఇప్పుడు ఇంక తనకు కళ్లజోడుతో పనిలేదని అన్నాడు. అదే విధంగా ప్రియాంక కూడా సర్జరీ చేయించుకోబోతుందని తెలిపాడు. ఈ వీడియోను మొత్తం వారు హాస్పిటల్‌లో ఉండే షూట్ చేశారు. 

టెన్షన్‌గా ఉంది..
‘‘నాకు సైట్ 7వ తరగతి నుండి ప్రారంభమయ్యింది. దాదాపు 10, 15 సంవత్సరాల నుండి నేను కళ్లజోడు పెట్టుకుంటూనే ఉన్నాను. కళ్లజోడు వల్ల చిరాకు వస్తుంది. శివ్ సర్జరీ చేయించుకున్నాడు కాబట్టి నాకు అంత భయం ఏం రావడం లేదు’’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక. నొప్పి ఉంటుంది భరించాలి అంటూ ప్రియాంకకు పదేపదే చెప్పాడు శివ్. ప్రియాంకకు సర్జరీ జరుగుతున్నందుకు తనకే ఎక్కువగా టెన్షన్‌గా ఉందని అన్నాడు. అయితే తను స్ట్రాంగ్ అని, తనకు ఏం భయం లేదని ప్రియాంక చెప్పగా.. బిగ్ బాస్‌లో చూశాం ఎంత స్ట్రాంగ్ అని అంటూ శివ్ కౌంటర్ ఇచ్చాడు. సర్జరీకి ముందు ప్రియాంక కూల్‌గా కూర్చొని కాఫీ తాగుతుంటే.. తనకు ఎక్కడ ఉన్నా కాఫీ, టీ లాంటివి కావాలి అని శివ్ బయటపెట్టాడు.

చిన్నపిల్లలాగా అయిపోయావు..
వీడియో తీస్తున్న సమయంలో ‘‘నేను ఎంత సన్నగా కనిపిస్తున్నాను చూడు’’ అని ప్రియాంక ఒక్కసారిగా తనను తాను చూసుకుంటూ ఆశ్చర్యపోయింది. ‘‘నువ్వు బిగ్ బాస్ తర్వాత సన్నాగానే అయిపోయావు’’ అంటూ క్లారిటీ ఇచ్చాడు శివ్. ‘‘నేను మొదటిసారి బిగ్ బాస్ తర్వాత ప్రియాంకను చూసినప్పుడు ఇది నా ప్రియాంకనేనా అనుకున్నాను. చిన్నపిల్లలాగా అయిపోయింది’’ అన్నాడు. ‘‘నేను లోపలికి వెళ్లిన తర్వాత నువ్వు గడ్డం, మీసం తీసేస్తే నా శివ్‌యేనా అనిపించింది నాకు’’ అని ప్రియాంక రివర్స్ అయ్యింది. ‘‘నేను బిగ్ బాస్‌ లోపలికి వచ్చిన తర్వాత నా లుక్ ఎంతమందికి నచ్చిందో తెలుసా’’ అని అడిగాడు శివ్. ఆడియన్స్ మీరే చెప్పండి అని అన్నాడు. ‘‘నాకు కూడా నచ్చింది కానీ డిఫరెంట్‌గా ఉన్నావు’’ అని ప్రియాంక చెప్పింది. ‘‘టైమ్‌తో పాటు లుక్స్ కూడా మారిపోవాలి. ఇప్పుడు టైమ్‌తో పాటు నువ్వు కూడా సర్జరీ చేయించుకుంటున్నావుగా’’ అని అన్నాడు శివ్. అలా ప్రియాంక కంటి సర్జరీకి సంబంధించిన ప్రతీ వివరాన్ని స్పష్టంగా ఈ వీడియోలో చూపించారు.

Also Read: కాట్రాజు to బ్రహ్మానందం: ‘గుంటూరు కారం’ మీనాక్షి ఫస్ట్‌లుక్‌పై జోరుగా మీమ్స్, నవ్వకుండా ఉండండి చూద్దాం

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Embed widget