Bigg Boss 8 Telugu : సంచాలక్ ప్రేరణను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న యశ్మీ... సొంత నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ ఈ ఏడుపు ఎందుకో?
Bigg Boss 8 Episode 12 :బిగ్ బాస్ హౌజ్ లో ఎవరు ఎవరి వల్ల ఇన్ఫ్లూయెన్స్ అవుతారనేది చెప్పడం కష్టం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తీసుకున్న నిర్ణయం గురించి సంచాలక్ గా ఉన్న ప్రేరణ కన్నీరు పెట్టుకుంది.
![Bigg Boss 8 Telugu : సంచాలక్ ప్రేరణను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న యశ్మీ... సొంత నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ ఈ ఏడుపు ఎందుకో? prerana kambam influenced by yashmi gowda in price money task in Bigg Boss 8 Telugu Bigg Boss 8 Telugu : సంచాలక్ ప్రేరణను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న యశ్మీ... సొంత నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ ఈ ఏడుపు ఎందుకో?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/13/a1e34b564150433529dc8c31f0cfdbe617261914303131106_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss 8 Telugu Day 11 : బిగ్ బాస్ తాజా సీజన్లో కూడా కొంతమంది గ్రూపులుగా ఆడుతున్నారన్న వాదన బయట వినిపిస్తోంది. అయితే రోజురోజుకూ ఈ షోను చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తుంది. హౌస్ లోకి ఎవరికి వారే సపరేట్ ఇండివిడ్యువల్ కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టినప్పుడు ఎవరి నిర్ణయం వాళ్లే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బేబక్క విషయంలో ఇలా జరిగినప్పటికీ హౌస్ మేట్స్ మాత్రం మారట్లేదు. ముందు వేరొకరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత అలా ఎందుకు తీసుకున్నామా అనే విషయాన్ని హౌస్ మేట్స్ ముందు వెళ్ళబోసుకుంటూ ఏడవడం సరిపోయింది.
సాక్స్ టాస్క్ లో నిర్ణయంపై ప్రేరణ ఎమోషనల్
ముందు బేబక్క నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకొని తనకు తానే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అతని క్లాన్ లో జాయిన్ అయ్యానని, కానీ అతను అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు అంటూ వేరొకరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అని కంప్లైంట్ చేసింది. ఆమె తన క్లాన్ కోసం నిలబడకుండా వేరొకరి క్లాన్ లోకి జంప్ అయ్యింది. ఇక మొదటి వీకెండ్ నాగార్జున కూడా ఇదే చెప్పారు. మీ ఆట మీరే ఆడండి అని చెప్పినప్పటికీ కంటెస్టెంట్స్ నాగ్ మాటలను పెడచెవిన పెట్టినట్టుగా కనిపిస్తోంది. నిన్నటికి నిన్న ఫుడ్ టాస్క్ లో నైనిక సంచాలక్ గా ఉండి టాస్క్ లో విన్ అయిన మణికంఠను చీట్ చేసింది. పైగా గెలిచిన వాళ్లను విన్నర్ గా ప్రకటించకపోవడాన్ని సమర్థించుకుంటూ, వాళ్లకు పాయింట్స్ ఇస్తే ఇక్కడ 6 మంది కడుపు కాలుతుంది అనే ఉద్దేశంతో ఇలా చేశాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా స్ట్రీమింగ్ అయిన ఈరోజు ఎపిసోడ్ లో ప్రేరణ కూడా ఇదే పని చేసింది.
మారుతున్న హౌజ్ లెక్కలు
ఆరవ టాస్క్ లో సాక్స్ కాలి నుంచి విడిపోకుండా చూసుకోవాలని బిగ్ బాస్ రూల్ పెట్టగా పేరున సంచాలక్ గా వ్యవహరించింది. అయితే ఇందులో ఎక్కువగా యశ్మి గౌడ టీం హడావిడి కనిపించింది. ముఖ్యంగా యష్మి గేమ్ పాజ్ చేయండి, అతను అవుట్ అయ్యాడు, ఇతను పుష్ చేస్తున్నారు సంచాలక్ అంటూ అరవడం, అక్కడే సంచాలక్ గా ఉన్న ప్రేరణ తన సొంత నిర్ణయాలు తీసుకోకుండా, కీలు బొమ్మలా ఆమె చెప్పిందల్లా చేయడం కనిపించింది. దీంతో గేమ్ లో భాగంగా కొంతమంది డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. మరి కొంతమంది ప్రేరణ వాళ్ళ టీంకు సపోర్ట్ చేస్తోంది అని డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉంటే ఇన్ఫ్లుయన్స్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రేరణ ఆ తర్వాత ఏం మాట్లాడినా పది మంది ఎక్కేస్తున్నారు అంటూ ఏడ్చింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఆమె ఏడవగానే అందరూ చుట్టూ మూగి గేమ్ లో ఇలాగే ఉంటుందిలే అని ఓదారుస్తున్నారు. పైగా ఆ ఓదార్చే వారిలో ప్రేరణ సొంత క్లాన్ కంటే అవతలి టీం సభ్యులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే మరో రెండు మూడు రోజుల్లో హౌస్ లో పూర్తిగా కంటెస్టెంట్ల లెక్కలు మరి అవకాశం ఉంది అనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)