Pallavi Prashanth: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘బిగ్ బాస్’ పల్లవి ప్రశాంత్ - రైతు కుటుంబానికి ఆర్థిక సాయం
Pallavi Prashanth: బిగ్ బాస్ 7 విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్.. స్టేజ్‌పైనే రైతు కుటుంబాలకు సాయం చేస్తానని మాటిచ్చాడు. అన్నట్టుగానే మూడు నెలల తర్వాత ఓ కుటుంబానికి సాయం చేయడానికి ముందుకొచ్చాడు.
Bigg Boss Season 7 Winner Pallavi Prashanth: ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ 7 సీజన్స్‌ను పూర్తిచేసుకుంది. కానీ సీజన్ 7కు వచ్చినంత పాపులారిటీ, క్రేజ్ ఇంకా ఏ ఇతర సీజన్‌కు రాలేదు అని చెప్పడానికి ఫైనల్స్ రోజు జరిగిన రచ్చే ఉదాహరణ. బిగ్ బాస్ సీజన్ 7కు పల్లవి ప్రశాంత్ విన్నర్ అని తెలియగానే ఫ్యాన్స్ అంతా అక్కడికి రావడం, వాళ్లు ఆరోజు అక్కడ గొడవ చేయడం గురించి చాలామంది బిగ్ బాస్ లవర్స ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఇక ఈ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టినప్పటి నుంచి తనకు గెలిస్తే ప్రైజ్ మనీ అంతా రైతులకే అని స్టేట్‌మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు ప్రశాంత్. అనుకున్నట్టుగానే షో ముగిసిన మూడు నెలల తర్వాత కొందరికి సాయం చేయడానికి ముందుకొచ్చాడు.
ఇన్నాళ్ల తర్వాత..
బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన కొన్నిరోజుల వరకు కూడా పల్లవి ప్రశాంత్ చట్టపరమైన సమస్యలు ఎదుర్కుంటూనే ఉన్నాడు. ఫైనల్స్ ముగిసినరోజు తన ఫ్యాన్సే అని చేశారని, తను కూడా పోలీసుల మాట వినకపోవడం వల్లే ఇలా జరిగిందని తనను అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజుల పాటు జైలు జీవితాన్ని గడిపిన తర్వాత పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ వచ్చింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం తగ్గించేశాడు ప్రశాంత్. ఇన్నాళ్ల తర్వాత తన మాట నిలబెట్టుకుంటున్నానంటూ కొందరు పేదలకు సాయం చేస్తూ.. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే పల్లవి ప్రశాంత్ చేసిన ఈ సాయానికి మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా తోడయ్యారు.
ప్రైజ్ మనీ మొత్తం వారికే..
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవ్వడం వల్ల పల్లవి ప్రశాంత్‌కు రూ.35 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. ఆ ప్రైజ్ మనీని అందుకుంటున్న సమయంలో కూడా అందులో ఒక్క రూపాయి కూడా తను ఖర్చుపెట్టనని, అన్నీ పేదలకే అని మాట కూడా ఇచ్చాడు. తను చెప్పినట్టుగానే గజ్వేల్ కొలుగూరులోని ఒక రైతు కుటుంబానికి సాయం చేశాడు పల్లవి ప్రశాంత్. వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించడంతో పాటు పూర్తిగా సంవత్సరానికి సరిపడా బియ్యాన్ని అందించాడు. తను మాత్రమే కాకుండా బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆట సందీప్ కూడా వారికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందించినట్టు తెలుస్తోంది.
ఇచ్చిన మాటకోసం..
‘‘ప్రాణం పోయినా మాట తప్పను, మీకు ఇచ్చిన మాట కోసం ముందుగా చేసిన సహాయం. 1 లక్ష రూపాయలు, 1 సంవత్సరానికి సరిపడా బియ్యం ఇస్తున్నాను. మీ ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను’’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను పోస్ట్ చేశాడు పల్లవి ప్రశాంత్. అందులో శివాజీ, భోలే షావలితో పాటు పల్లవి ప్రశాంత్, ఆట సందీప్ వెళ్లి ఆ రైతు కుటుంబానికి సాయం చేసినట్టుగా చూపించాడు. అంతే కాకుండా అందులో డబ్బులను శివాజీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందజేశాడు ప్రశాంత్. దీంతో మరోసారి పల్లవి ప్రశాంత్ చాలా గ్రేట్ అంటూ ప్రశంసించడం మొదలుపెట్టారు ఫ్యాన్స్.
View this post on Instagram
Also Read: సేవ్ ద టైగర్స్ 2 రివ్యూ: సూపర్ హిట్‌కు సీక్వెల్ - హాట్‌స్టార్‌లో కొత్త సిరీస్ నవ్విస్తుందా? లేదా?