అన్వేషించండి

Save The Tigers 2 OTT Review - సేవ్ ద టైగర్స్ 2 రివ్యూ: సూపర్ హిట్‌కు సీక్వెల్ - హాట్‌స్టార్‌లో కొత్త సిరీస్ నవ్విస్తుందా? లేదా?

Save The Tigers 2 Web Series Review: 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ ఓటీటీ వీక్షకులను విపరీతంగా నవ్వించింది. మరి, సెకండ్ సీజన్ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.

Save The Tigers 2 Review: ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా.... 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ హీరోయిన్లుగా నటించిన వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్'. మహి వి రాఘవ్ షో రన్నర్ & క్రియేటర్. ఓటీటీ వీక్షకులను విపరీతంగా నవ్వించిందీ సిరీస్. ఇప్పుడు సెకండ్ సీజన్ (Save The Tigers Season 2) వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సీరత్ కపూర్, దర్శనా బానిక్ యాడ్ అయ్యారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఎలా ఉంది? నవ్విస్తుందా? అనేది రివ్యూలో చూద్దాం. 'సేవ్ ద టైగర్స్' ఫస్ట్ సీజన్ ముగిసిన చోటు నుంచి సీజన్ 2 మొదలైంది.

కథ (Save The Tigers 2 Story): హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) ఎక్కడ? అని పోలీస్ స్టేషన్‌లో విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను ప్రశ్నిస్తారు. ఆమె మిస్సింగ్ కేసులో ముగ్గురికీ గట్టిగా లాఠీ ట్రీట్మెంట్ ఇస్తారు. తమకు తెలియదని  ఎంత చెప్పినా పోలీసులు వినరు. వాళ్లకు స్టార్ హోటల్ నుంచి హంసలేఖను తీసుకువెళ్లిన వీడియో చూపిస్తారు. ఆ ముగ్గురూ కలిసి ఆమెను చంపేశారేమో అని న్యూస్ ఛానళ్లు అనుమానం వ్యక్తం చేస్తాయి. అదంతా అబద్ధమని, తాము కలిసి పార్టీ చేసుకున్నామని హంసలేఖ డైరెక్టుగా వచ్చి చెప్పడంతో వదిలేస్తారు పోలీసులు.

స్టేషన్ నుంచి విక్రమ్, రవి, రాహుల్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ ముగ్గురి భార్యలు స్పందన (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకు వెళ్లారు? రవికి కార్పొరేటర్ టికెట్ ఇస్తానని ఎమ్మెల్యే ఎందుకు చెప్పాడు? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుకోవాలన్న రవి భార్య హైమావతి (జోర్దార్ సుజాత) కల నెరవేరిందా? లేదా? విక్రమ్ భార్య రేఖ (దేవియాని శర్మ) లాయర్ ప్రాక్టీస్ ఎందుకు ఆపేయాలని అనుకుంది? రాహుల్, అతని భార్య మాధురి (పావని గంగిరెడ్డి) మధ్య హారిక (దర్శనా బానిక్) ఎవరు? మూడు జంటల మధ్య గొడవలకు కారణం ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Save The Tigers 2 Telugu Review): కళ్లతో చూసేది ప్రతిదీ నిజం కాదు... 'సేవ్ ద టైగర్స్ 2'లో అంతర్లీనంగా ఉందీ సందేశం. టీవీ ఛానళ్లలో వైరల్ న్యూస్ చూస్తుంటాం, హీరోయిన్ల గురించి గాసిప్స్ చదువుతాం, ఎక్కడో ఎవరినో చూసి వాళ్లు ఏదో చేస్తున్నారని భావిస్తాం... నిజమని నమ్మేస్తాం. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసే తీరిక, ఓపిక తక్కువ మందికి ఉంటోంది. అసలు విషయం తెలుసుకోకుండా ఓ అభిప్రాయానికి రావడం వల్ల జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళుతున్నాయనేది 'సేవ్ ద టైగర్స్ 2'లో చక్కగా చెప్పారు. అయితే... ఎక్కడా క్లాస్ పీకినట్లు ఉండదు. అదీ మహి వి రాఘవ్ క్రియేషన్‌లో స్పెషాలిటీ.

మహి వి రాఘవ్ (Mahi V Raghav) రచనలో డ్రామా బాగుంటుంది. మంచి కామెడీ టేస్ట్ కూడా ఉందని 'ఆనందో బ్రహ్మ' చూస్తే అర్థం అవుతుంది. 'సేవ్ ద టైగర్స్' విషయంలోనూ కామెడీతో సక్సెస్ అందుకున్నారు. రియాలిటీకి దగ్గరగా తీయడం ఆ సిరీస్ సక్సెస్ ఫార్ములా. 'సేవ్ ద టైగర్స్ 2'లో అంతర్లీనంగా సందేశం ఉన్నా... రియాలిటీ, కామెడీ, డ్రామా మిస్ కాకుండా చూసుకున్నారు మహి.

Save The Tigers 2 OTT Review - సేవ్ ద టైగర్స్ 2 రివ్యూ: సూపర్ హిట్‌కు సీక్వెల్ - హాట్‌స్టార్‌లో కొత్త సిరీస్ నవ్విస్తుందా? లేదా?

ప్రదీప్ అద్వైతంతో కలిసి మహి వి రాఘవ్ క్రియేట్ చేసిన 'సేవ్ ద టైగర్స్ 2'లో ఫస్ట్ మూడు ఎపిసోడ్స్ హిలేరియస్ అని చెప్పవచ్చు. నాలుగో ఎపిసోడ్‌లో 10000BC ట్రాక్ నవ్వించలేదు. వివాహ వ్యవస్థ పుట్టుక వెనుక చెప్పిన కథ ఆకట్టుకోదు. ఆ తర్వాత మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందీ సిరీస్. కామెడీతో పాటు ఎమోషన్స్ బ్యాలన్స్ చేస్తూ క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్రియదర్శి - సుజాత, చైతన్యకృష్ణ - దేవియాని శర్మ మధ్య సన్నివేశాలతో పలు జంటలు రిలేట్ అవుతాయి. 

కార్పొరేటర్ టికెట్ ఇస్తానని ఎమ్మెల్యే చెబితే ముందు వెనుక ఆలోచించకుండా రవి (ప్రియదర్శి) డబ్బులు ఇవ్వడం... ఆఫీసులో మరొక అమ్మాయికి, రాహుల్ (చైతన్య కృష్ణ) మధ్య సన్నివేశాలు ఇంకా బాగా రాసుకోవాల్సింది. మహి వి రాఘవ్ క్రియేషన్, అరుణ్ కొత్తపల్లి డైరెక్షన్ మధ్య సింక్ కుదిరింది. చిన్నా వాసుదేవరెడ్డి, మహి వి రాఘవ్ నిర్మాణ విలువలు బావున్నాయి. అజయ్ అరసాడ సంగీతం కథతో పాటు సాగింది.

Also Read: బ్రీత్ రివ్యూ: నందమూరి చైతన్యకృష్ణ సినిమా థియేటర్లలో డిజాస్టర్... మరి, ఓటీటీలో చూసేలా ఉందా?

ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ... ముగ్గురి నటన బావుంది. అయితే... కుమార్తె పెద్దమనిషి అయ్యాక ఆమెతో మాట్లాడిన సన్నివేశంలో గానీ, స్కూల్‌లో తన గురించి కుమార్తె మాట్లాడిన వీడియో చూసేటప్పుడు గానీ ప్రియదర్శి నటన టాప్ క్లాస్. ఆయన భావోద్వేగాలు పలికించిన తీరు అద్భుతం. అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, ఆ డైలాగ్ డెలివరీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలా బాగా చేశారు. రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ జీవించారు. జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి సైతం తమ తమ క్యారెక్టర్లలో జీవించారు.

Also Readశపథం మూవీ రివ్యూ: సెన్సార్ బ్రేకుల్లేని బండి - 'వ్యూహం' సీక్వెల్‌లో వర్మ ఏం చూపించారంటే?

హంసలేఖగా సీరత్ కపూర్ చక్కగా నటించారు. భార్యాభర్తలుగా సత్యకృష్ణ, వేణు ఎల్దండి సన్నివేశాలు నవ్విస్తాయి. దర్శనా బానిక్ పాత్ర నిడివి తక్కువ. గంగవ్వ, ముక్కు అవినాష్ తదితరులు తమ పరిధి మేరకు చేశారు. రోహిణి మరోసారి మాస్ మెయిడ్ క్యారెక్టర్‌లో నవ్వించారు.

'సేవ్ ద టైగర్స్ 2'... ఈ సిరీస్ నవ్విస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో చెబుతుంది, తండ్రీ కూతుళ్ళ అనుబంధం చూపిస్తుంది, ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయవద్దని ధైర్యం ఇస్తుంది. కామెడీతో పాటు ఎమోషన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. వీకెండ్ మీ టైమ్ అడ్జస్ట్ చేసుకోండి... హ్యాపీగా సిరీస్ చూడండి.

Also Read: భీమా రివ్యూ: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ - సినిమా హిట్టా? ఫట్టా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget