Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు పోలీసులు విధించిన షరతులేమిటీ?
Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్.. రెండురోజుల పాటు జైలుశిక్షను అనుభవించిన తర్వాత ఫైనల్‌గా తనకు బెయిల్ మంజూరు అయ్యింది.
Pallavi Prashanth Bail : తన ఫ్యాన్స్ చేసిన పని వల్ల బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. ఈ కేసులో ప్రశాంత్ తప్పు ఏమీ లేదంటూ, తనను విడుదల చేయాలంటూ తన తరపున లాయర్లు కోర్టుకెక్కారు. బెయిన్ పిటీషన్‌ను అప్లై చేయగా.. ఒకరోజుకు వాయిదా వేసింది కోర్టు. ఇక తాజాగా పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు అంగీకరించిందని తెలుస్తోంది. కానీ బెయిల్ ఇవ్వడానికి పలు షరతులు పెట్టినట్టు సమాచారం. పల్లవి ప్రశాంత్‌పై మాత్రమే కాకుండా స్టూడియో బయట జరిగిన అల్లర్ల కేసులో తన సోదరుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇద్దరికీ పలు షరతులపై నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
షరతులతో బెయిల్..
ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్‌కు కోర్టు.. నాంపల్లి కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. దాంతో పాటు పలు షరతులు పెట్టింది. అందులో ముందుగా ఆదివారం పోలీసుల విచారణకు హాజరు కావాలని పల్లవి ప్రశాంత్‌ను నాంపల్లి కోర్టు ఆదేశించింది. దాంతో పాటు రూ.15 వేల చొప్పున రెండు షురిటీలను వారికి సమర్పించాలని చెప్పింది. దీంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఫ్యాన్స్ అనే పేరుతో పలువురు చేసిన పనికి ప్రశాంత్ శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదని కొందరు భావించినా.. ప్రశాంత్ కూడా తమ మాట వినకపోవడంతోనే కేసు ఫైల్ చేశామని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని, అక్కడి నుండి వెళ్లిపోమని చెప్పినా కూడా ప్రశాంత్ వినకుండా ర్యాలీ నిర్వహించడం వల్లే గొడవ పెద్దగా అయ్యిందని పోలీసులు అన్నారు.
శివాజీ, యావర్ స్పందన..
ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ స్పందించారు. ముఖ్యంగా ప్రశాంత్.. స్పై బ్యాచ్‌లో ఒకడు కాబట్టి.. తన స్నేహితులు అయిన శివాజీ, యావర్.. ఈ ఘటనపై స్పందిస్తూ వీడియోలు విడుదల చేశారు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసినప్పటి నుండి తాను ప్రతీ విషయం ఫాలో అవుతున్నానని, తన ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నానని బయటపెట్టాడు శివాజీ. అంతే కాకుండా ప్రశాంత్‌కు ఏమీ కాదని, సేఫ్‌గానే బయటికి వస్తాడని అందరికీ ధైర్యం చెప్పాడు. చట్టప్రకారమే బయటికి వస్తాడని, తప్పకుండా తనకు బెయిల్ వస్తుందని గురువారం తను విడుదల చేసిన వీడియోలో తెలిపాడు శివాజీ. ఇక యావర్ కూడా పల్లవి ప్రశాంత్‌కు ఈ సమయంలో తమ సపోర్ట్ ఎంతో అవసరమని, ప్లీజ్ తనను సపోర్ట్ చేయమని కోరాడు.
పోలీసులదే బాధ్యత..
బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి పల్లవి ప్రశాంత్‌తో కేవలం కొన్నివారాలు మాత్రమే పరిచయం ఉన్న భోలే షావలి.. తన కోర్టు విషయాలను, కేసు విషయాలను దగ్గర ఉండి చూసుకున్నాడు. లాయర్స్‌తో పాటు తను కూడా యాక్టివ్ పాత్రను పోషించాడు. ఇక పల్లవి ప్రశాంత్ తరపున లాయర్స్ మాత్రం ప్రశాంత్ తప్పేమీ లేదని, తనతో శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా వెళ్లిపోమని చెప్పడం కరెక్ట్ కాదని విమర్శించారు. ప్రశాంత్ కోసం భారీ ఎత్తున ఫ్యాన్స్ రావడంతో తను కలవాలని అనుకున్నాడని, ఎలాంటి సమయాల్లో అయినా శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుందని తెలిపారు.
Also Read: మహిళలు ఉన్నారని మర్చిపోతే ఎలా? అమర్ కారు దాడిపై స్పందించిన ప్రియాంక