అన్వేషించండి

Bigg Boss Telugu 6: నువ్వెవరు ఆడించడానికి? బిగ్‌బాస్ ఉన్నారుగా, కామన్‌సెన్స్ లేదా? - గీతూకి గట్టిగానే క్లాసు తీసుకున్న నాగ్

Bigg Boss Telugu 6: గీతూకి గట్టిగానే క్లాసు తీసుకున్నారు నాగార్జున. ఇకపైనైనా ఆమె ఓవరాక్షన్ తగ్గుతుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Bigg Boss Telugu 6: ఈ వారం గీతూ ఆట చూసి చాలా మంది ప్రేక్షకులు మండిపోయింది. ఇంత ఓవరాక్షన్ అవసరమా? అని ప్రతి ఒక్కరూ చిరాకు పడ్డారు. అంతేకాదు ఆమె ఇంట్లో ఎంత అరాచకం చేసినా బిగ్‌బాస్ నిశ్శబ్దంగా ఉన్నాడు. దీంతో గీతూయే ఆడిస్తుంటే ఇక బిగ్‌బాస్ ఎందుకు అని కామెంట్లు కూడా చేసుకున్నారు. ఇంకెందుకు గీతూకి తీసుకెళ్లి టైటిల్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకున్నారంతా. కానీ ఈ వీకెండ్లో గీతూకి గట్టిగానే క్లాసు తీసుకున్నారు నాగార్జున. నిజం చెప్పాలంటే ఈ సీజన్ మొత్తంలో ఇప్పటివరకు ఇంత గట్టిగా క్లాసు తీసుకుంది గీతూకేనేమో. అయినా ఆమెకు ఈ కోటింగ్ ఏం సరిపోతుంది లెండి. కుక్కతోక వంకర కదా. వచ్చే వారం కూడా ఇదే బుద్ధి చూపిస్తుందేమో. 

విడుదల చేసిన ప్రోమోలో గీతూకి క్లాసు పీకుతూ కనిపించారు నాగార్జున. ఆదిరెడ్డి - గీతూ నిల్చుని ఉండగా, నాగార్జున ‘మొన్న జరిగిన చేపల టాస్కులో నీ పార్టనర్ గీతూ ఫిజికల్ టాస్కు ఇవ్వండి గుద్ది పడేస్తా అంది, గుద్ది పడేసిందా’ అని ఆదిరెడ్డిని అడిగారు. గీతూకి నీడలా మారిన ఆదిరెడ్డి ‘ఆడింది సర్’ అని చెప్పాడు. ఏం ఆడిందో ఆయనకే తెలియాలి. దానికి నాగార్జున ‘బాగా ఆడితే మీరే ఎందుకు లీస్ట్‌లో ఉన్నారు’ అని అడిగారు. ‘నువ్వు గెలవాలని కాదు, అవతలి వారి వీక్‌నెస్ మీద దెబ్బకొట్టాలని ట్రై చేశావ్ ’ అన్నారు నాగార్జున. దానికి గీతూ ‘లాస్ట్ వీక్ పువ్వుల టాస్కు  ఎవరు సరిగా ఆడలేదు సర్, నేనుండే సీజన్, వాళ్లు ఆడకపోయినా నేనే ఆడిపిద్దామని, అందరినీ కావాలనే రెచ్చగొట్టా’ అంది గీతూ. 

అది బిగ్‌బాస్ పని
‘గేమ్‌ని ఇంట్రెస్ట్‌గా మార్చడం ఎలాగో బిగ్‌బాస్ చూసుకుంటాడు, ఎవరి ఆట వాళ్లు ఆడితే సీజన్ ఎక్కడో ఉంటుంది’ అని అన్నారు నాగార్జున. దానికి గీతూ ‘మెంటలైపోతుంది సర్ గేమంటే, బయట కూడా నేను గేమర్‌ని సర్’ అంది గీతూ. ‘ఒకరి వీక్‌నెస్ మీద ఆడడం గేమర్ కాదు’ అన్నారు నాగ్. ‘అసలు నువ్వెవరు ఆటలో ఇన్వాల్వ్ అవ్వడానికి, సంచాలక్ అంటే ఎంపైర్. నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది. ఆ మాట బావుందా? బాగోలేదు కదా. కోపం వస్తే కామన్ సెన్స్, అన్నీ వెళ్లిపోతాయేమో’ అని చాలా కోప్పడ్డారు నాగార్జున. గీతూ ముఖం మాడిపోయింది. ‘గీతూ నీకు పనిష్మెంట్ తీసుకోవడానికి అర్హురాలివి’ అన్నారు నాగార్జున. మరి ఏ పనిష్మెంట్ ఇస్తారో చూడాలి. 

సీజన్లో ప్రతి కంటెస్టెంట్‌కు అభిమానులు ఏర్పడతారు. కానీ విచిత్రంగా ఈ సీజన్లో మాత్రం గీతూ అభిమానులు కన్నా ద్వేషించే వాళ్లని ఎక్కువగా మూటకట్టుకుంది. అందుకే అతి ఎప్పుడైనా అనర్ధమే. ఆమె తన నోటికి తాళం వేసుకుని, అతిగా మాటలు విసిరేయకుండా ఉంటేనే మంచిది. 

Also read: అతడే ఇంటి కెప్టెన్, ఆడినా కూడా బాలాదిత్యను జైలుకి పంపిన శ్రీహాన్, శ్రీసత్య-గీతూల కోసమేనా?

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today November 12th: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు మా అమ్మ ఒక్కటే.. మనసులో మాట బయట పెట్టేసిన సూరజ్! మాలినికి దిమ్మతిరిగే షాక్!
కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు మా అమ్మ ఒక్కటే.. మనసులో మాట బయట పెట్టేసిన సూరజ్! మాలినికి దిమ్మతిరిగే షాక్!
Bigg Boss Season 10 Today November 11th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఇంటి మొత్తాన్ని ఏడిపించేసిన ముకేశ్ తల్లి! హౌస్‌లో శివ, పరిల ఎంగేజ్మెంట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఇంటి మొత్తాన్ని ఏడిపించేసిన ముకేశ్ తల్లి! హౌస్‌లో శివ, పరిల ఎంగేజ్మెంట్!
Bigg Boss Season 10 Today Nov 11th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ఫ్యామిలీ వీక్‌లో శివ, ప్రియాంకల నిశ్చితార్థం! అంగరంగ వైభవంగా ఏర్పాట్లు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ఫ్యామిలీ వీక్‌లో శివ, ప్రియాంకల నిశ్చితార్థం! అంగరంగ వైభవంగా ఏర్పాట్లు!
Bigg Boss Season 10 Today November 10th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి 3 ఫ్యామిలీస్! వంశీ కూతురు హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి 3 ఫ్యామిలీస్! వంశీ కూతురు హైలెట్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Anirudh Ravichander Kavya Maran Wedding : అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
Parivarthana Rajaneethi Party Launch: పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget