Bigg Boss 6 Telugu Episode 55: అతడే ఇంటి కెప్టెన్, ఆడినా కూడా బాలాదిత్యను జైలుకి పంపిన శ్రీహాన్, శ్రీసత్య-గీతూల కోసమేనా?
Bigg Boss 6 Telugu: గీతూ తనకు నచ్చిన వారే ఇంటి కెప్టెన్ అవ్వాలనుకుంది, చివరికి చేసింది.
Bigg Boss 6 Telugu: గీతూ కన్నింగ్ గేమ్ ఈ వారం అదరగొట్టింది. సంచాలక్ అయినా కూడా ఆడి, తనకు నచ్చని వారిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్లింది. చివరికి రేవంత్ చేపను శ్రీహాన్ - శ్రీసత్యలకు వచ్చేలా చేసింది. అలా వారిద్దరినీ కెప్టెన్సీ కంటెండర్ల పోటీలో నిలిచేలా చేసింది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో శ్రీహాన్ కెప్టెన్ అయ్యాడు. ఇక ఆయన కెప్టెన్ కుర్చీలో కూర్చోగానే గీతూ విజిల్స్ వేసింది. కుర్చీలో కూర్చోని మీసం మెలేశాడు శ్రీహాన్. కానీ ఆ ధీరత్వం కెప్టెన్ గా చూపించలేకపోయాడు. శ్రీసత్యకు, గీతూకు ఫేవర్ చేస్తూ కనిపించాడు. ఇక శ్రీసత్య అయితే ఆమెనే కెప్టెన్ అన్నంత బిల్డప్ ఇస్తోంది.
అలిగిన రేవంత్
మధ్యలో బిగ్‌బాస్ యమహా కాల్ ఆఫ్ ది బ్లూమెంట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇనయా సంచాలక్‌గా వ్యవహరించింది. ఈ టాస్కులో రకరకాల వ్యాయామాలు చేయాలి. చివరికి విన్నర్‌గా రోహిత్‌ని ప్రకటించింది. దీంతో రేవంత్‌కి కోపం వచ్చేసింది. అక్కడ్నించి అలిగి, ఏదో అనుకుంటూ వెళ్లిపోయాడు. రేవంత్ బాగా ఆడినా కూడా చిన్నవిషయాలకే వచ్చే కోపం వల్ల అతను ఇంటి సభ్యులకు ఫేవరేట్ కాలేకోతున్నాడు.
వరస్ట్ ఇంటి సభ్యుడు
ఇక ఇంట్లో వరస్ట్ ఇంటి సభ్యుడిని ఎంచుకోమని చెప్పారు బిగ్ బాస్. దానికి శ్రీహాన్ బాలాదిత్యను ఎంచుకున్నారు. అతని ముఖానికి ఎర్ర రంగు పూశారు. నిజానికి వరస్ట్ గా ఆడింది గీతూ కదా. నిజానికి బాలాదిత్య గేమ్ ఆడాడు. కేవలం గీతూకి, శ్రీ సత్యకు నచ్చని కారణంగానే శ్రీహాన్ అతడిని వరస్ట్ ఇంటి సభ్యుడిగా ఎన్నుకున్నట్టు కనిపించింది. మొదటి రౌండ్ లోనే ఓడిపోయిన గీతూ, పెద్దగా ఈవారం ఏమీ ఆడని ఆదిరెడ్డి అతనికి కనిపించలేదు. ఒక చేపను మీరు సూర్యకు ఇచ్చేశారంటూ బాలాదిత్యను నామినేట్ చేశారు. ఇది మాత్రం వింతల్లోకెల్లా వింత. చివరికి బాలాదిత్యను జైల్లో వేశాడు శ్రీహాన్. గీతూకి ఇంట్లో ఫస్ట్ టార్గెట్ రేవంత్, రెండో టార్గెట్ బాలాదిత్య. వీళ్లిద్దరిలో ఎవరు వెళ్లినా ఆమె మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఆదిరెడ్డి చెప్పినా...
గీతూ పద్దతులు బాగోలేక పోయినా ఆమెతోనే ఎందుకు ఉంటున్నాడో ఆదిరెడ్డి ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. ‘గీతక్క నువ్వు తప్పు చేస్తున్నావనిపిస్తోంది’ అన్నాడు ఆదిరెడ్డి. దానికి ఏం తప్పు? అంటూ ముఖంలో అదోలా పెట్టిన గీతూ ‘చెప్పు చెప్పు’ అడిగింది. డెసిషన్స్ తప్పుగా తీసుకుంటున్నావ్ అని చెప్పాడు ఆదిరెడ్డి. ఈలోపు శ్రీహాన్ వస్తే ‘నీకు రేవంత్ చేసిన తప్పులు కనిపించలేదా, పది చేపలు తీసుకెళ్లి సూర్యకు ఇచ్చాడు’ అంది. దానికి శ్రీహాన్ నేను వాడికి చెప్పాను అన్నాడు. అలా పక్కకెళ్లి కాదు అందరిముందు అడగాలా అంది గీతూ. దానికి శ్రీహాన్ ‘నువ్వేగా ఫ్రెండ్స్ అయితే పక్కకు తీసుకెళ్లి చెప్పాలి అన్నావ్’ అన్నాడు. దానికి గీతూ ‘నామినేషన్ సమయంలోనే అలా చేయాలి’ అని చెప్పుకొచ్చింది. దేవుడి దయ వల్ల గీతూ నిజ జీవితంలో జడ్జి కాలేదు, అయ్యుంటే ఈమె జడ్జిమెంట్తో ఎంత మంది జీవితాలు ఏమయ్యేవో మరి.
ఆదిరెడ్డికి మళ్లీ వీడియో...
ఆదిరెడ్డి కూతురి మొదటి పుట్టినరోజు కావడంతో మళ్లీ అతని కుటుంబం వీడియోను వేశారు బిగ్ బాస్. ఆ వీడియోలో భార్య కవిత, చెల్లెలు నాగలక్ష్మి, కూతురు హద్విత ఉన్నారు. తన కూతురికి హ్యాపీ బర్త్ డే చెప్పాడు ఆదిరెడ్డి.
Also read: ఎట్టకేలకు శ్రీహాన్ కెప్టెన్? గీతూ అనుకున్నట్టే అయింది అంతా, ఇక బిగ్‌బాస్ ఎందుకు?