అన్వేషించండి

Bigg Boss 6 Telugu Episode 54: ఎట్టకేలకు శ్రీహాన్ కెప్టెన్? గీతూ అనుకున్నట్టే అయింది అంతా, ఇక బిగ్‌బాస్ ఎందుకు?

Bigg Boss 6 Telugu: ఈ రెండు రోజుల ఎపిసోడ్‌ను బిగ్‌బాస్ కాకుండా గీతూయే నడిపించినట్టుంది.

Bigg Boss 6 Telugu: సంచాలక్‌గా  వ్యవహరించాల్సిన గీతూ గేమ్ ఆడినా బిగ్‌బాస్ అడ్డుకోరు. ఆటగాళ్లు దగ్గర ఉండాల్సిన నల్లచేప సంచాలక్ దగ్గర ఉన్నా బిగ్‌బాస్ ఏమీ అనరు. సంచాలక్‌గా గీతూ ఎలా ఆడినా బిగ్‌బాస్ పట్టించుకోరు. అతనికి కావాల్సింది కంటెంట్ అంతే. కంటెంట్ ఇవ్వడంతో గీతూ ముందుంటుంది. ఆమె ఓవర్ యాక్షన్‌తోనే బోలెడంత కంటెంట్ ఇస్తుంది. ఆమె ఎవరి మీదైనా కక్ష కట్టిందంటే ఇక వారిని ఎలాగైనా ఆట నుంచి తప్పిస్తుంది. కాస్త కూడా ఎథిక్స్ లేని కంటెస్టెంట్ ఎవరైనా ఈ సీజన్లో ఉన్నారంటే అది గీతూనే. తను అనుకున్నట్టుగానే బాలాదిత్యను  టార్గెట్ చేసి కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు నుంచి పక్కకు తప్పించింది. అలాగే రేవంత్ ను టార్గెట్ చేసి చేపలన్నీ శ్రీసత్య -శ్రీహాన్ ఖాతాలో పడేలా చేసింది.చివరికి తాను అనుకున్న శ్రీహాన్ కెప్టెన్ అయ్యేలా చేసింది. అందుకే బిగ్ బాస్‌కు బదులు ఈమెనే రెండు ఎపిసోడ్లకు గానూ బిగ్‌బాస్ లా వ్యవహరించింది. 

కెప్టెన్స కంటెండర్ల టాస్కులో భాగంగా చేపల చెరువు టాస్కు ఇచ్చారు బిగ్ బాస్. అందులో ఓడిపోయిన మొదటి జోడీ గీతూ - ఆదిరెడ్డి. తరువాత వీరిద్దరినీ సంచాలక్ గా చేశారు బిగ్ బాస్. ఆదిరెడ్డి గీతూ ఏం చెబితే అదే చేయడం ఎప్పట్నించో ఫాలో అవుతున్నాడు. కాగా గీతూ తన కన్నింగ్ గేమ్ ను ప్రదర్శించి, తనకు నచ్చని వారిని టార్గెట్ చేస్తూ వచ్చింది. కాగా కెప్టెన్సీ కంటెండర్లుగా అయ్యేందుకు రేవంత్, సూర్య, శ్రీహాన్, కీర్తి, ఫైమా పోటీ పడ్డారు.  

ఇనయా ఏడుపు...
తాను కెప్టెన్ అవ్వాలని ఇనయా రేవంత్ ను చాలా బతిమిలాడింది. చివరికి చిట్టీలు వేసుకున్నారు. కానీ రేవంత్ పేరే రావడంతో ఆయనే పోటీ పడ్డారు. ఇనయా బాత్రూమ్ దగ్గరికి వెళ్లి బాగా ఏడ్చింది. ఓదార్చే పనిని సూరయ తీసుకున్నాడు. ఎంతగా ఓదార్చిన ఇనయా బాధపడుతూనే ఉంది. 

ఇక కెప్టెన్సీ కంటెండర్లుగా మారేందుకు చిక్కుముళ్లు గేమ్ ఇచ్చారు. ఇందులో త్వరగా చిక్కుముళ్లు విప్పిన కీర్తి, సూర్య, శ్రీహాన్ కెప్టెన్సీ కంటెండర్లుగా మారారు. వారిమెడలో ఆంగ్ల అక్షరం ‘సి’ అనే మెత్తటి ట్యాగ్ ను వేశారు. ఇంటి సభ్యులు తాము ఎవరైతే కెప్టెన్ కాకూడదు అనుకుంటున్నారో వారు సి అక్షరంపై కత్తితో గుచ్చాలని చెప్పారు బిగ్ బాస్. అందరి కన్నా తక్కువగా శ్రీహాన్‌కు కత్తిపోట్లు వచ్చాయి. ఇనయా శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. దీంతో శ్రీహాన్ చాలా బాధపడిపోయాడు. 

‘ప్రోమో కోసమే ఇదంతా చేస్తుంది. ఎవరైనా నీది సూర్యది బాండింగ్ మిస్ అవుతోంది అంటే వెళ్లి అతడితో కలిసిపోయినా ఆశ్చర్యంలేదు. ప్రతిసారి సరదాగా తీసుకుంటాను అనుకుంటుందేమో, సమయం వచ్చినప్పుడు చెబుతా. యాక్టింగ్ చేస్తోంది. వారానికో రంగు మారుస్తోంది. నమ్మకద్రోహం చేస్తుంది. నాకు ఈ రోజు కత్తి గుచ్చినందుకు బాదపడేలా చేస్తా’ అంటూ తనలో తానే రగిలిపోయాడు శ్రీహాన్. కాగా కెప్టెన్ శ్రీహాన్ అయ్యాడు. కాకపోతే అతను కెప్టెన్ అయిన విశేషాలు మరుసటి ఎపిసోడ్లో చూపించనున్నారు.

Also read: 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget