Bigg Boss Season 9: డబుల్ హౌస్... డబుల్ డోస్ - ఈసారి బిగ్ బాస్‌నే మార్చేసిన కింగ్ నాగార్జున... స్పెషల్ ప్రోమో అదుర్స్
Nagarjuna: బిగ్ బాస్ సీజన్ 9 నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఈసారి డబుల్ డోస్ డబుల్ హౌస్ అంటూ హోస్ట్ నాగార్జున ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయగా వైరల్ అవుతోంది.

Bigg Boss Season 9 New Promo Out: కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 9 కొత్త సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి రణరంగమే అంటూ సీజన్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ నాగార్జున భారీ హైప్ క్రియేట్ చేశారు. గతంలోలా కాకుండా ఈసారి రూల్స్, కండీషన్స్ కూడా మార్చినట్లు పలు సందర్భాల్లో తెలిపారు.
కొత్త ప్రోమో అదుర్స్
హైప్ పదింతలు చేసేలా బిగ్ బాస్ 9 సీజన్ కొత్త ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. వెన్నెల కిశోర్‌తో నాగార్జున చేసిన ఫన్నీ వీడియోను షేర్ చేసుకుంటూ... కొత్త సీజన్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. 'సార్ గారు నా నెక్స్ట్ 100 డేస్ షూటింగ్ డేట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయండి. కొత్త ప్లాన్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9కు వెళ్లాలనుకుంటున్నా.' అంటూ కిశోర్ చెప్పగా... 'ప్లానింగ్ ఉంటే సరిపోదు సార్ ఆ 9 ప్లానెట్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి.' అంటూ ఆయన డ్రైవర్ చెబుతాడు.
ఆ గ్రహాల కమాండింగ్ ఫ్రెండ్ అంటూ నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. కిశోర్ హౌస్‌లోకి వెళ్లేందుకు రెడీ అవుతుండగా... కొత్త సీజన్‌లో కండీషన్స్ విని షాక్ అయ్యారు. 'ఈసారి వెరీ టఫ్. ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్.' అంటూ నాగార్జున చెప్పడం చూసి ఆశ్చర్యపోతారు. 'ఎప్పుడైనా పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తావా?' అంటూ ప్రశ్నించగా... నేను డైరెక్ట్‌గా బిగ్ బాస్‌తోనే మాట్లాడుకుంటా అంటూ వెన్నెల కిశోర్ వెళ్లిపోబోతుండగా... 'అందుకే ఈ సారి బిగ్ బాస్‌నే మార్చేశా.' అంటూ చెప్పగా షో ఎలా ఉండబోతోందో అనే సస్పెన్స్ నెలకొంది.
Double House, Double Dose! 👑🔥 Mugimpu varaku prathi kshanam oka yuddhame, andhari saradhaalu theeripothayi 👁️💥
— Starmaa (@StarMaa) August 10, 2025
Biggest Battle of the Year #BiggBossSeason9ComingSoon On #StarMaa 💥#BiggBossTelugu #BiggBossTelugu9 pic.twitter.com/4AXMR9QWVh
Also Read: విజయ్ దేవరకొండతో హరీష్ శంకర్ మూవీ? - ఈ క్రేజీ కాంబో అస్సలు ఊహించి ఉండరు
కంటెస్టెంట్స్‌పై వీడని సస్పెన్స్
ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 200 మంది నుంచి 40 మందిని స్క్రూటినీ చేసి వారిలో 40 మందిని ఫైనల్ చేసి... ముగ్గురు లేదా నలుగురికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరికి 'అగ్ని పరీక్ష' నిర్వహించగా... ఆ ఎపిసోడ్స్‌ను జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
BIGG BOSS 9 Contestants List: బిగ్ బాస్ కొత్త సీజన్ హౌస్‌లోకి ఏయే సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. టీవీ ఆర్టిస్టులు జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వారికి ఛాన్స్ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. జబర్దస్త్ ఐశ్వర్య, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి, సీరియల్ యాక్టర్స్ సాయికిరణ్, దేబ్జానీ, కావ్యశ్రీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కన్నడ హీరోయిన్ కావ్యాశెట్టి, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య, కల్పికా గణేష్, ఆరే రాజ్, సుమంత్ అశ్విన్, దీపికా వర్ష, తేజస్విని గౌడ, నాగదుర్గా దత్తా, లక్ష్మి, తేజస్విని గౌడలు హౌస్‌లోకిి వస్తారని తెలుస్తోంది. వీరితో పాటే సామాన్యులు కూడా ఎంటర్ అవుతారని సమాచారం. సెప్టెంబర్ 7 నుంచి షో ప్రారంభం కానుంది.






















