Bigg Boss 17 Winner: బిగ్ బాస్ సీజన్ 17 విజేత అతడే, మన్నారాకు షాక్ - విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే?
Munawar Faruqui: కెరీర్‌లో స్టాండప్ కమెడియన్‌గా ఎంతో గుర్తింపు దక్కించుకున్న మునావర్ ఫారుఖి.. బిగ్ బాస్ సీజన్ 17 విన్నర్ అయ్యాడు. తనకు క్యాష్ ప్రైజ్‌తో పాటు లగ్జరీ కారు కూడా బహుమతిగా దొరికింది.
Bigg Boss 17 Winner Munawar Faruqui: హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 గ్రాండ్‌గా ముగిసింది. ఈ గ్రాండ్ ఫినాలేలో ఎంతోమంది టీవీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ముందుగా ఈ ఫైనల్స్‌లో అరుణ్ మాషెట్టి బిగ్ బాస్ హౌస్ నుండి తప్పుకున్నాడు. తన తర్వాత అంకితా లోఖండే, మన్నరా చోప్రా కూడా ఎలిమినేట్ అయ్యారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు అనుకున్న ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. కానీ అప్పుడే అసలైన ఎగ్జైట్‌మెట్ మొదలయ్యింది. మునావర్ ఫారుఖి, అభిషేక్ కుమార్ మాత్రమే హౌజ్‌లో మిగిలారు. ఈ ఇద్దరికీ సమానంగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.
ప్రైజ్ మనీతో పాటు కారు..
ఫైనల్‌గా బిగ్ బాస్ సీజన్ 17 విన్నర్‌గా మునావర్ ఫారుఖిని ప్రకటించాడు సల్మాన్ ఖాన్. బిగ్ బాస్ విన్నర్‌గా ట్రోఫీని అందుకున్నాడు. ఇక ఫైనల్స్‌కు ముందు సోషల్ మీడియాలో జరిగిన ట్రెండ్స్ చూస్తుంటే మునావరే విన్నర్ అవ్వాలని చాలామంది ఆడియన్స్ కోరుకున్నట్టు తెలుస్తోంది. మునావర్ విన్నర్ అవ్వగా.. అభిషేక్ కుమార్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 17 విన్నర్‌గా నిలిచినందుకు మునావర్‌కు రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్ దక్కింది. దాంతో పాటు ఒక లగ్జరీ కారును కూడా గెలుచుకున్నాడు. మునావర్‌కు సమానంగా అభిషేక్‌కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో అభిషేక్ విన్నర్ కాకపోవడంతో ఫీల్ అయిన ఫ్యాన్స్ అంతా ‘రియల్ విన్నర్ అభిషేక్’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.
View this post on Instagram
ఎంటర్‌టైన్ చేసిన రియల్ లైఫ్ కపుల్స్..
బిగ్ బాస్ సీజన్ 17 ఫైనల్స్‌ను చూడడానికి మాజీ కంటెస్టెంట్స్‌తో పాటు హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ కుటుంబాలు కూడా వచ్చాయి. వారందరూ మునావర్ విన్నర్ అవ్వడం చూసి చాలా సంతోషించారు. ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌజ్‌లో కాస్త ఎక్కువ గొడవలే జరిగాయి. చాలాసార్లు కంటెస్టెంట్స్ ఫిజికల్‌గా కూడా ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం, కొట్టుకోవడం లాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. పైగా ఈ సీజన్‌లో రియల్ లైఫ్ కపుల్స్ కూడా బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చారు. దీంతో వారి మధ్య జరిగిన సీరియస్ గొడవలు.. ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్ చేశాయి. ముఖ్యంగా అంకితా లోఖండే, విక్కీ జైన్ కపుల్‌కు బిగ్ బాస్ సీజన్ 17 వల్ల విపరీతమైన పాపులారిటీ లభించింది.
మోస్ట్ వాంటెడ్ స్టాండప్ కమెడియన్..
మునావర్ ఫారుఖి ఒక స్టాండప్ కామెడియన్. స్టాండప్ కామెడియన్ లైఫ్ అంటే చాలా సాఫీగా సాగింపోతుంది అని చాలామంది అనుకున్నా.. మునావర్ కెరీర్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. తను చేసిన స్టాండప్ షో వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిని పెద్ద కాంట్రవర్సీనే క్రియేట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మునావర్ పేరు వైరల్ అయ్యింది. కొన్నాళ్ల వరకు తను షోలు చేయడానికి నిషేదించారు కూడా. ఇక అలాంటి కాంట్రవర్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మునావర్‌ను బిగ్ బాస్ సీజన్ 17లో కంటెస్టెంట్‌గా తీసుకొచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేశారు మేకర్స్. ఫైనల్‌గా తనే విన్నర్‌గా నిలిచి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.
Also Read: జాన్వీ కపూర్‌కు క్రేజీ ఆఫర్, సూర్య మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్!