News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss Season 7: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో మహిళలదే డామినేషన్, అప్పుడే డ్రామా క్వీన్స్ అంటూ బిరుదు!

ఈ మొదటి నామినేషన్స్ అయిపోయే సమయానికి బిగ్ బాస్ హౌజ్‌లో, ప్రేక్షకుల్లో అటెన్షన్ విషయంలో మహిళలదే పైచేయి ఉన్నట్టుగా కనిపిస్తోంది.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి నామినేషన్స్ పూర్తయ్యాయి. అవి పూర్తయ్యే సమయానికి చాలామంది హౌజ్‌మేట్స్ మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కొందరు హౌజ్‌మేట్స్ మధ్య మనస్పర్థలు తొలగిపోయినట్టు కనిపించినా.. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడం మాత్రం మానేయలేదు. అయితే ఈ మొదటి నామినేషన్స్ అయిపోయే సమయానికి బిగ్ బాస్ హౌజ్‌లో, ప్రేక్షకుల్లో అటెన్షన్ విషయంలో మహిళలదే పైచేయి ఉన్నట్టుగా కనిపిస్తోంది. అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ప్రేక్షకుల అటెన్షన్ కోసం ఎదురుచూస్తున్నట్టు, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపించింది.

అప్పుడే కన్నీళ్లు..
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లోని 14 మంది కంటెస్టెంట్స్‌లో ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. ఇప్పటికీ రెండురోజుల పాటు ఈ సీజన్‌లోని మొదటి నామినేషన్స్ ప్రసారం అయ్యాయి. ఈ రెండు రోజుల్లో మహిళలే ఎక్కువగా కెమెరా ముందు కనిపిస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ సంపాదించుకున్నారు. వారు ఇతరులను నామినేట్ చేయడం, ఇతర కంటెస్టెంట్స్ చేత వారు నామినేట్ అవ్వడం.. ఇలా రెండు రకాలుగా వారికి అటెన్షన్ సంపాదించుకునే అవకాశం లభించింది. ఇక హౌజ్‌లోకి ఎంటర్ అయిన రెండోరోజుకే తన కన్నీళ్లతో సింపథీ సంపాదించుకుంటోంది శోభా శెట్టి. ‘కార్తిక దీపం’ అనే సీరియల్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న శోభ.. అందులో విలన్ క్యారెక్టర్‌తో అందరికీ చెమటలు పట్టించింది. రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉంటుందేమో అని అనుకున్నారంతా. కానీ దానికి పూర్తి భిన్నం అని ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

నామినేషన్స్‌లో తనే హైలెట్..
ముందుగా శోభా శెట్టి.. గౌతమ్ కృష్ణను నామినేట్ చేసింది. తనతో బాండింగ్ లేకపోవడమే దీనికి కారణమని చెప్పింది. అక్కడ నుండి గొడవ మొదలయ్యింది. అసలు సమస్యను పరిష్కరించుకుందామని శోభాతో మాట్లాడడానికి ప్రయత్నించాడు గౌతమ్. కానీ గౌతమ్‌ను మాట్లాడనివ్వకుండా పంతంతో ఉండిపోయింది శోభా. వీరిద్దరి మధ్య రెండుసార్లు జరిగిన వాగ్వాదం.. ప్రేక్షకుల్లో ఫుల్ అటెన్షన్‌ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత దామిని.. శోభా ఏమీ పనిచేయడం లేదంటూ తనను నామినేట్ చేసింది. ఈ కారణంతో దామినితో గొడవకు దిగింది శోభా. తను ఉదయం నుండి చాలా పనిచేసిందంటూ నిరూపించుకుంది. ఆ తర్వాత పనిచేసినా చేయడం లేదని ఆరోపిస్తున్నారు అంటూ గార్డెన్‌లో కూర్చొని ఏడ్చింది. దీంతో ప్రేక్షకులు శోభాను డ్రామా క్వీన్ అనేస్తున్నారు.

అసలు పనిచేయడం లేదు..
సింగర్ దామిని కూడా ఏ మాత్రం ఆలోచించకుండా నామినేషన్స్‌లో పాల్గనడంతో అసలు తను ఏంటి ఇలా చేసింది అని ప్రేక్షకులు తనపై కూడా ఫోకస్ పెట్టారు. ఇక షకీలా లాంటి సీనియర్ నటి వచ్చి బిగ్ బాస్‌లో ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంది అనుకున్నా కూడా తన వల్ల ప్రేక్షకులకు పెద్దగా ఎంటర్‌టైన్మెంట్ లభించలేదు. కేవలం యావర్ విషయంలో మాత్రమే షకీలా యాక్టివ్ అయ్యారు. చివరిగా శోభా శెట్టితో పాటు ప్రేక్షకుల అటెన్షన్‌ను ఎక్కువగా సంపాదించుకున్న మరో మహిళా కంటెస్టెంట్ రతిక. సీక్రెట్ టాస్క్ అంటూ తనలోని ఫైర్‌ను బయటపెట్టిన రతిక.. ఆ తర్వాత అసలు ఏమీ పనిచేయడం లేదంటూ అందరి చేత నామినేట్ చేయించుకోబడింది. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 చూస్తుంటే ఈసారి డామినేషన్.. మహిళా కంటెస్టెంట్స్‌దే అని అర్థమవుతోంది.

Also Read: శివాజీకి నిజంగానే పెళ్లి కాలేదా? నాగార్జునతో ఒకలా, హౌజ్‌మేట్స్‌తో మరోలా!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 06 Sep 2023 04:57 PM (IST) Tags: Bigg Boss Shobha Shetty Nagarjuna Bigg Boss Telugu 7 Bigg Boss Telugu Season 7 Bigg Boss 7 Telugu Bigg Boss Telugu 2023 BB 7 Telugu damini shakila Rathika bigg boss season 7 nominations

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు

బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు

Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!

Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!

Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!

Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !