Pakistan Captain Warning to India Asia Cup 2025 Final | ఫైనల్ లో తలపడబోతున్న ఇండియా పాక్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫైనల్ వచ్చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. సూపర్-4 దశలో అగ్రస్థానంలో నిలిచి భారత్ ఫైనల్‌కు చేరుకోగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి పాకిస్తాన్ రెండో టీమ్ గా ఫైనల్ కు అర్హత పొందింది. ఒకే టోర్నమెంట్ లో ఇండియా పాకిస్తాన్ మూడవసారి తలపడబోతున్నాయి. జరిగిన రెండు మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. అలాగే వివాదాలు, గొడవలు, విమర్శలు కూడా జరిగాయి.
ఆసియా కప్ ఫైనల్ లో ఎలాగైనా గెలవాలని రెండు టీమ్స్ చూస్తున్నాయి. భారత అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తుండగా, పాకిస్తాన్ తమ బ్యాటింగ్ వైఫల్యాలను అధిగమించి, ఫైనల్లో సత్తా చాటాలని చూస్తుంది. పాకిస్తాన్ - బంగ్లాదేశ్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా హాట్ కామెంట్స్ చేసాడు. 'మేము పూర్తిగా సెట్ అయ్యాము. ఏ టీమ్ ని అయినా ఓడించగలమనే నమ్మకం మాకు ఉంది. ఫైనల్‌లో ఇండియాను ఓడించడమే మా లక్ష్యం' అని అన్నాడు. పాక్ కెప్టెన్ విసిరిన సవాలుకు టీమ్ ఇండియా మైదానంలో ఎలా బదులిస్తుందో చూడాలి.





















