Shivaji: శివాజీకి నిజంగానే పెళ్లి కాలేదా? నాగార్జునతో ఒకలా, హౌజ్‌మేట్స్‌తో మరోలా!
తాజాగా హీరో శివాజీ పర్సనల్ లైఫ్ గురించి బిగ్ బాస్ స్టేజ్‌పై ఒకలాగా, బిగ్ బాస్ హౌజ్‌లో ఒకలాగా మాట్లాడుతుండడంతో అసలు ఇందులో ఏది నిజం అని ప్రేక్షకులు తేల్చుకోలేకపోతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్‌లో ఎవరు ఎలాంటి వారు అనే అంచనాకు ఇంకా ప్రేక్షకులు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన చాలామంది సెలబ్రిటీలు ప్రేక్షకులకు ముందు నుంచి పరిచయం లేనివారే. శివాజీ, షకీలా లాంటి సీనియర్లు ఉన్నా కూడా వారి పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. వారిని సినిమాల్లో చూసి అభిమానించినవారు ఉన్నారు కానీ.. వారి పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యేక శ్రద్ధతో తెలుసుకున్నవారు చాలా తక్కువ. ఇక తాజాగా హీరో శివాజీ పర్సనల్ లైఫ్ గురించి బిగ్ బాస్ స్టేజ్‌పై ఒకలాగా, బిగ్ బాస్ హౌజ్‌లో ఒకలాగా మాట్లాడుతుండడంతో అసలు ఇందులో ఏది నిజం అని ప్రేక్షకులు తేల్చుకోలేకపోతున్నారు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన శివాజీ.. గత కొన్నేళ్ల నుంచి సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. రాజకీయాలపై తనకు ఉన్న ఇంట్రెస్ట్‌తోనే సినిమాలను దూరం పెట్టాడని స్పష్టంగా కనిపిస్తోంది. శివాజీ.. రాజకీయనాయకుడు కాకపోయినా.. రాజకీయాలపై ఉన్న ఆసక్తి.. తనను రాజకీయ విశ్లేషకుడిని చేసింది. చాలామంది సన్నిహితులు రాజకీయాలు మనకు ఎందుకులే అన్నా కూడా శివాజీ వినకుండా తనకు నచ్చిన దారిలోనే వెళ్తున్నాడు. ఇక అలాంటి శివాజీ.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ రోజు నాగార్జునతో తన భార్య పేరు శ్వేత అని చెప్పిన శివాజీ.. హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే తాను సింగిల్ అని చెప్పాడు. అసలు ఎందుకలా చెప్పాడు అంటూ ప్రేక్షకుల్లో పలు సందేహాలు మొదలయ్యాయి.
ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు..
హీరో శివాజీ గుంటూరు జిల్లాలోని నర్సంపేటలో జన్మించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ముందుగా సీరియల్స్‌కు ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అదే సమయంలో సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేయడానికి శివాజీకి అవకాశం లభించింది. ఆ తర్వాత సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి. అలా తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ దాదాపు 90 కు పైగా సినిమాల్లో నటించాడు శివాజీ. తను నటుడిగా ఉన్న సమయంలోనే తెలంగాణకు చెందిన శ్వేత అనే ఒక అమ్మాయిని.. ఓ పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడు. ఈ ఇష్టం.. పెళ్లి వరకు దారితీసింది.
ఏది అబద్ధం..?
మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అని ఒక ఇంటర్వ్యూలో శివాజీకి ప్రశ్న ఎదురవ్వగా.. ప్రేమ అని చెప్పలేనని, ఓ పెళ్లిలో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని అన్నాడు. అప్పటికే తాను యాక్టర్ అవ్వడంతో బయట తిరగడం కష్టంగా ఉండేదని, అందుకే అలా చేయకుండా నేరుగా పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అప్పట్లో అలా చెప్పిన శివాజీ.. ఇప్పుడు సడెన్‌గా మాట ఎందుకు మార్చాడు అని బిగ్ బాస్ ప్రేక్షకులు సందేహంలో ఉన్నారు. టేస్టీ తేజ.. తనను పెళ్లి గురించి అడగగా.. తనకు ఎవరూ పిల్లను ఇవ్వలేదని, పెళ్లి కాలేదని అన్నాడు శివాజీ. కెమెరాలు చూస్తున్నాయి నిజం చెప్పు అన్నప్పుడు కూడా ఆయన అదే మాట మీద ఉన్నారు. కొన్నిరోజులపాటు కలిసి ఉండాల్సిన హౌజ్‌మేట్స్‌తో శివాజీ అంత పెద్ద అబద్దం ఎందుకు చెప్పారు? ఆయన సరదాగానే టేస్టీ తేజను ఆటపట్టించేందుకు అలా చెప్పి ఉండవచ్చని అనుకుంటున్నారు.
Also Read: అనసూయ ఫోటోలకు నెటిజన్ దారుణమైన కామెంట్ - దిమ్మతిరిగే సమాధానం చెప్పిన రంగమ్మత్త
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial