Chiranjeevi Vs Balakrishna:: బాలకృష్ణ మాటలకు బాధపడ్డారు సరే... మరి మూడేళ్లుగా ఎందుకు సైలంట్‌గా ఉన్నారు చిరంజీవి..!
అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చిరంజీవిపై కామెంట్లు చేస్తే.. చిరు రివర్స్‌లో బాలయ్యను టార్గెట్ చేశారు. బాలకృష్ణ చిరంజీవి విషయంలో శృతి మించారు సరే.. ఇన్నాళ్లు చిరంజీవి దీనిపై ఎందుకు సైలంట్ అయ్యారు. ?

Chiranjeevi Vs Balakrishna: అసెంబ్లీలో అంతగా మాట్లాడని బాలకృష్ణ ఉన్నట్టుండి అగ్గి రాజేశారు…
ఎప్పుడోకానీ రియాక్ట్ కాని చిరంజీవి…. వెంటనే స్పందించి మంటను మరింత పెద్దది చేశారు.
చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కొంచం పరిధి దాటి మాట్లాడినట్లుగానే ఉన్నాయి. వాటికి తప్పని సరిగా చిరంజీవి స్పందించాల్సినట్లుగా ఉన్నాయి. మొత్తానికి అగ్ర కథానాయకులిద్దరూ అగ్గి పెట్టారు. బాలకృష్ణ తన తరహాలో కొంచం నో ఫిల్టర్ లెక్క మాట్లాడిన మాటలను తెలుగుదేశం శ్రేణులు సమర్థించుకోవడానికి ఇబ్బంది పడుతున్న మాట నిజమే… కానీ చిరంజీవి ఇన్‌స్టంట్‌గా ఇచ్చిన రియాక్షన్ అందరికీ షాక్ ఇచ్చింది. మూడేళ్ల నుంచి ఉన్న నేరేటివ్‌ను మొత్తం మార్చేసింది. ఆయన క్లారిటీ ఇచ్చారు. సరే.. మరి ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు..!?
మూడేళ్ల కిందటి ముచ్చటపై గురువారం అసెంబ్లీలో జరిగిన రగడ గురించి అందరికీ తెలిసిందే.. అప్పట్లో సినీ ప్రముఖులను తన ఇంటికి పిలిపించుకుని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వారిని అవమానించారన్నది ఇండస్ట్రీ సర్కిల్‌లో ఇప్పటిదాకా ఉన్న మాట.. అసెంబ్లీలో వేరే విషయంపై జరుగుతున్న చర్చలో మరోసారి ఈ ప్రస్తావనను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేయడం.. దానికి సభలోనే ఉన్న హిందూపూర్ ఎమ్మెల్యే.. సినిమా నటుడు అయిన బాలకృష్ణ స్పందించడం దానిపై దుమారం రేగడం జరిగింది. అప్పటి సీఎం జగన్ మోహనరెడ్డి “చిరంజీవితో సహా.. సినీ ప్రముఖులను చిన్నచూపు చూశారు.. సీఎంతో మీటింగ్ ఉందని చెప్పి.. సీనిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారు.. కానీ చిరంజీవి గట్టిగా మాట్లాడటంతో సీఎం వాళ్లని కలిశారు..” అన్నారు.
బాలయ్య కామెంట్స్‌పై దుమారం..
దానికి బాలకృష్ణ వెంటనే రియాక్ట్ అయ్యారు. “చిరంజీవి గారు గట్టిగా మాట్లాడారు అని ఆయన అంటున్నారు… కానీ అక్కడ ఎవడూ గట్టిగా మాట్లాడలేదు.. మీరు మాట్లాడుతోంది తప్పు” అని కామినేని ఉద్దేశించి అన్నారు. ఎవరో గట్టిగా మాట్లాడారంట.. అంటూ ఆ తర్వాత కూడా వ్యంగ్యంగా అన్నారు. మొత్తానికి చిరంజీవి విషయంలో బాలకృష్ణ Intemiation చేసినట్లు కనిపించింది. ప్రభుత్వ పెద్దలతో కలవడానికి వెళ్పేప్పుడు ఎవరూ తనని సంప్రదించలేదని..తనని అడిగే ధైర్యం వాళ్లకి లేదని కూడా ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. చిరంజీవి, నాగార్జున విషయంలో బాలకృష్ణకు కొంత గ్యాప్ ఉంది. ఈ విషయాన్ని ఆయన దాచుకోలేదు కూడా.. ! కొన్ని సందర్భాల్లో ఇండైరెక్టుగా సెటైర్లు వేశారు. గురువారం నేరుగా అసెంబ్లీలోనే కామెంట్ చేశారు.
అయితే బాలకృష్ణ తప్పేం మాట్లాడలేదని.. చిరంజీవిని దూషించలేదని.. ఎవ్వరూ మాట్లాడలేదు అన్న విషయాన్ని మాత్రమే క్లారిఫై చేశారని ఆయన అభిమానులు, టీడీపీ ఫ్యాన్స్ వెనుకేసుకువస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికి కావలసిన విధంగా వాళ్లు తీసుకోవచ్చు. కానీ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన విధానం అయితే మాత్రం చిరంజీవి నొచ్చుకునేలానే ఉంది. ఆ ప్రభావం వెంటనే కనిపించింది కాబట్టే చిరంజీవి నుంచి క్విక్ రియాక్షన్ వచ్చింది.
బాలకృష్ణ సపోర్ట్ చేయలేదన్న చిరంజీవి…
బాలకృష్ణ అసెంబ్లీలో అధికారికంగా తన పేరు ప్రస్తావించారు కాబట్టి రియాక్ట్ అవుతున్నా అంటూ.. ఫారిన్ నుంచి ఓ ప్రకటన పంపిచారు చిరంజీవి. అది చిరంజీవి ఎప్పుడూ రియాక్ట్ అయ్యే దానికి కొంత భిన్నంగానే ఉంది. మామూలుగా ఇలాంటి విషయాలను లైట్ తీసుకునే ఆయన కొంచం పెద్ద లేఖనే పంపారు. జగన్ మోహనరెడ్డి సినీ ప్రముఖులను అవమానించలేదని.. అంతకు ముందు తమ దంపతులను సాదరంగా ఆహ్వానించి గౌరవించారని... ఆ తర్వాత కూడా ఎవరికీ అవమానాలు జరగలేదని చెప్పారు. అదొక్కటే కాదు..ఈ మీటింగ్‌కు తానే చొరవ తీసుకున్నా అని.. బాలకృష్ణ అందుబాటులో లేరని.. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి.. ఆర్.నారాయణమూర్తితో పాటు కొంతమందిని తీసుకువెళ్లానని చెప్పారు. ఆర్.నారాయణ మూర్తి పేరు ప్రత్యేకంగా చెప్పడం వెనుక ప్రత్యేక కారణం ఏంటి..? బాలకృష్ణ లాంటి ప్రముఖ కమర్షియల్ హీరో రాలేదు కానీ.. తాను.. ఆల్టర్నేట్ స్టార్‌లను కూడా తీసుకెళ్లా అని చెప్పడం కావొచ్చు..
కల్ట్ ఫ్యాన్స్ కొట్లాట..
చిరంజీవి జనసేనాని పవన్ కల్యాణ్‌కు సొంత అన్నయ్య కావడం.. ఇన్నాళ్లు చిరంజీవికి అవమానం జరిగిందన్న వాదననే వాళ్లు చేయడంతో ఇప్పుడు వాళ్లు ఎటూ మాట్లాడలేని పరిస్థితి. కానీ రెండు వైపులా ఉన్న కల్ట్ అభిమానులు.. కుల పరంగా కావొచ్చు.. సినిమా పరంగా ఉన్న కావొచ్చు.. ఫ్యాన్స్‌గా ఉన్న వాళ్లు కౌంటర్ ఆర్గ్యుమెంట్లు చేసుకుంటున్నారు. బాలకృష్ణకు కంట్రోల్ లేదని వీళ్లు అంటే.. అసలు చిరంజీవి కూటమిలో సభ్యుడా.. పార్టీ సపోర్టరా.. ఆయన జగన్‌కు చాలా సార్లు సపోర్ట్ చేశాడు.. అని.. చిరంజీవి జగన్‌కు సపోర్ట్ చేసిన వీడియోలు.. పేపర్ క్లిప్పింగ్స్ తిప్పుతున్నారు.
జగన్ ట్రీట్‌మెంట్ బాగుంటే ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు..
అయితే ఇక్కడ బేసిక్‌గా చిరంజీవి ఇచ్చిన వివరణ మీద అనేక ప్రశ్నలు వస్తున్నాయి... బాలకృష్ణ మాట్లాడిన భాషలో అభ్యంతరాలు ఉండొచ్చు.. కానీ చిరంజీవి ఇచ్చిన వివరణ కరెక్ట్గ్ గా ఉందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్లు అలా మాట్లాడటానికి కారణాలున్నాయి. భాష వేరు కావొచ్చు కానీ..బాలకృష్ణ మాట్లాడిన దాన్నే.. మూడేళ్లుగా మెగా ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. “ చిరంజీవికి అవమానం జరిగింది అని మొత్తం సినీ ఇండస్ట్రీ ఫీల్ అయింది.. మురళీమోహన్‌లాంటి కొంతమంది బహిరంగంగానే చెప్పారు. అంతెందుకు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఈవెంట్‌లో స్వయంగా అన్నారు. “చిరంజీవి గారికి చెప్పండి.. అడుక్కుంటే గౌరవం రాదు.. అది మన హక్కు” అని..! పవన్ కళ్యాణ్ గెలిచిన వెంటనే.. అన్నయ్య ఇంటికి వెళ్లినప్పుడు బయటకు వచ్చిన వీడియోను… "అన్నయ్య అవమాననానికి బదులు తీర్చుకున్న తమ్ముడు అని.." ఫాన్స్ అంతా తెగ మురిసిపోయి ంమాట్లాడింది. అంతే కాదు.. ఆ రోజు తాడేపల్లిలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందనే భావన ఇండస్ట్రీలో దాదాపు 90శాతం మందిలో ఉంది.
ఇన్ని జరిగినప్పుడు స్పందించని.. చిరంజీవి... తన తమ్ముడు మాట్లాడినప్పుడు మాట్లాడని చిరంజీవి.. ఇండస్ట్రీ మొత్తం ఎలా ఫీల్ అవుతుందో.. తెలిసినా కూడా తెలియనట్లు ఉన్న చిరంజీవి.. నిన్న మాత్రమే ఎందుకు రియాక్ట్ అయ్యారు.. అన్నది వాళ్ల ప్రశ్న.. "జగన్ గారు సాదరంగా ఆహ్వానించారు" అని మూడేళ్ల కిందటే మాట్లాడి ఉంటే.. ఈ ఇష్యూ ఎప్పుడో క్లోజ్ అయి ఉండేది. బాలకృష్ణ చిరంజీవిని నొప్పించారన్నది నిజమే.. బాలకృష్ణ అన్నమాటలకు కోపంతోనో.. లేక ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కాబట్టి వివరణ ఇచ్చి తీరాలన్న ఉద్దేశ్యంతోనో చిరంజీవి ప్రకటన ఇచ్చి ఉండొచ్చు. “ బాలకృష్ణ తనని చిన్బబుచ్చితే తట్టుకోలేరు కానీ.. జగన్ film ఇండస్ట్రీ ను అవమానిస్తే పర్లేదు అన్నమాట.. !” అనే మాటకి మరి చిరంజీవి ఆన్సర్ చేయాలి కదా.. ఇన్నాళ్లుగా అందరూ అనుకుంటున్నది ఏంటో అంత బహిరంగంగా చెబుతున్నప్పుడు.. అలా జరగలేదు.. అని చెప్పాల్సిన responsiblity చిరంజీవికి లేదా..? ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు…?





















