అన్వేషించండి

Telugu Bigg Boss Season 9: మాధురి దివ్వెలకు భయపడుతున్న నాగ్‌ మామ! హైపర్‌ ఆది బెటర్ అంటున్న ప్రేక్షకులు!

Telugu Bigg Boss Season 9: బిగ్‌బాస్‌ సీజన్ 9లోకి వైల్డ్‌కార్డులు వచ్చిన తర్వాత ఆటలో మజా వచ్చింది. కానీ హోస్ట్ నాగార్జున హోస్టింగ్‌లో పస లేదని ప్రేక్షకుల ఫీలింగ్. హైపర్ ఆది బెటర్ అంటున్నారు.

Telugu Bigg Boss Season 9:తెలుగు బిగ్‌బాస్‌హౌస్‌ సీజన్9 చదరంగం కాదు రణ రంగమే అంటూ హైప్ తీసుకొచ్చినా అక్కడ జరుగుతున్నది మాత్రం పూర్తిగా వేరు. హౌస్‌లోకి వచ్చిన వారిలో కొందరిపై బిగ్ బాస్ టీం, హోస్ట్ నాగార్జున చాలా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. మొదట్లో కామనర్స్‌ను టార్గెట్ చేశారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వారిపై మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే వాళ్ల యాటిట్యూడ్‌తో చిరాకుపడుతున్న ప్రేక్షకులు హోస్ట్ నాగార్జున డిఫెన్సివ్‌ హోస్టింగ్‌తో మరింత డీలాపడుతున్నారు. ప్రమోలు అద్భుతంగా ఉంటున్నాయి. కానీ ఎపిసోడ్‌లో మాత్రం దమ్ముండటం లేదనే మాట గట్టిగానే వినిపిస్తోంది. ఈసారి వీకెండ్ ఎపిసోడ్‌లో హైపర్ ఆది వేసిన పంచ్‌లు హౌస్‌లో ఉన్న వాళ్లకు చెప్పిన హింట్‌లు బెటర్ అని ఫీల్ అవుతున్నారు. 

ప్రోమో సూపర్‌ ఎపిసోడ్‌ పేలవం

శనివారం ఉదయం వచ్చిన ప్రోమో చూసిన ప్రేక్షకులు చాలా ఊహించుకున్నారు. గత వారం రోజులుగా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కంటెంస్టెంట్స్‌కు పగిలిపోద్ది అనుకున్నారు. నోరు జారుతా వాళ్లు చేస్తున్న ఓవర్‌యాక్షన్‌కు సరైన క్లాస్ ఉంటుందని భావించారు. కానీ ఏమైందో ఏమో కానీ అసలు డీల్ చేయాల్సిన చాలా వాటిని చాలా లైట్ తీసుకున్నారని అర్థమవుతుంది. విడివిడిగా వీడియోలు చూపించి చెప్పాల్సిన విషయాలను చెప్పకుండా వదిలేశారనే టాక్ ప్రేక్షకుల్లో బలంగా ఉంటోంది. 

మాధురికి భయపడుతున్న నాగార్జున

మాధురి, రమ్య, ఆయేషా చాలా తప్పులు చేసినా వారిని ఏమీ అనకుండా వదిలేశారు. అది జనాలుకు నచ్చడం లేదు. అప్పటికే హౌస్‌లో ఉన్న వారిని కావాలని టార్గెట్ చేస్తూ వారిని అనవసరంగా దూషిస్తున్న పట్టించుకోలేదనే ఫీల్ జనాల్లో ఉంది. ఈసారి నాగార్జున హోస్టింగ్ రైట్ డైరెక్షన్‌లో ఉండటం లేదని అంటున్నారు. కల్యాణ్, మాధురి ఎపిసోడ్‌లో ఆమెతో తప్పు ఉన్నప్పటికీ చాలా నెమ్మదిగా నోరు తగ్గించుకోవాలని మాత్రమే చెప్పారు. అది కూడా ఆమెకు భయపడుతున్నట్టు సలహా ఇచ్చారు. దివ్య, మాధురి ఎపిసోడ్‌లో జరిగిన గొడవలో కూడా ఇదే జరిగింది. అంతే కాకుండా తిరిగి దివ్యకే క్లాస్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనకు ఇంట్లో వాటాగా వచ్చిన ఫుడ్‌ను అందరికీ సమానంగా పంచాలనే థియరీ ఎలా చెప్పారని ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడ మాధురిని ఏమనలేక దివ్యను మందలించినట్టు కనిపిస్తోందని అంటున్నారు.  

రమ్య, కల్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది. వీడియో చూపించి వదిలేశారు. అంత మాట అన్నందుకు ఆమెను కనీసం కరెక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. చూసుకోమని మాత్రం చెప్పారు. ఇదే విషయంలో మాధురి కూడా నోరు జారినా ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదు నాగార్జున. రీతు, పవన్ విషయంలో కూడా నాగార్జున ఓవరాక్షన్ చేశారని అనిపిస్తోంది. తనకు రీతుపై ఎలాంటి ఫీలింగ్స్ లేవని, కేవలం కంఫర్ట్‌జోన్‌లో ఉన్నందునే క్లోజ్‌గా ఉన్నామని చెబుతున్నా క్లారిటీ లేదూ క్లారిటీ లేదూ అని పదే పదే చెప్పి అక్కడ పవన్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. కావాలని హౌస్‌లో కంటెంట్‌ కోసం గొడవలు పెట్టుకుంటున్న ఆయేష లాంటి వాళ్లను మరింతగా ఎంకరేజ్ చేసినట్టు కనిపిస్తోంది. రీతు, దివ్యతో కోరి కయ్యాలు పెట్టుకుంటున్న విషయాన్ని నైస్‌గా పక్కకు తప్పించారు. అయితే వారి దూకుడు ఎక్కడ తగ్గిపోతుందోనని భయపడే ఇలా చేసి ఉంటారని అలా చేస్తే కంటెంట్ రాకుండా పోతుందని ఆలోచించిం ఉంటారనే వాదన కూడా ఉంది. 

అందర్నీ పేర్లు పెట్టి పిలిచే నాగార్జున, మాధురిని మాత్రం గారు అని సంబోధించడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. తన వయసులో సగం ఉన్న ఆమెను అలా పిలిచి ప్రత్యేకంగా చూస్తున్నారని అంటున్నారు. దీని ప్రభావం హౌస్‌లో కూడా పడుతుందని అంటున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న మాధురిని నాగార్జున గౌరవప్రదంగా పిలుస్తున్నారని ఇది హౌస్‌లో ఉన్నవారు కూడా గమనించి ఆమెను ఏమైనా అనడానికి భయపడతారనే భావన కలుగుతుంది. బిగ్‌హౌస్‌రూల్స్ ప్రకారం బయట ఎంతటి తోపు అని ఒకసారి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అంతా ఒక్కటే. కానీ ఇక్కడ నాగార్జున, బిగ్‌బాస్ టీం వాళ్లు మాత్రం ఈ రూల్ చాలా చక్కగా మర్చిపోతున్నారనే విమర్శ ఉంది. 

అంత యాటిట్యూడ్ అవసరమా!

ఆదివారం ఎపిసోడ్ మరింత పేలవంగా ఉంది. పెట్టిన టాస్క్‌లు కానీ, వచ్చిన గెస్ట్‌లు కానీ అంతగా ఆకట్టుకోలేదు. పేరడీ పాటలు ఫర్వాలదనిపించాయి. చివర్లో హైపర్ ఆది మాత్రం దుమ్ము లేపాడు. హౌస్‌లో ఉన్న వాళ్లకు ఇవ్వాల్సిన హింట్‌లు ఇచ్చాడు. ఎక్కడ ఆట మార్చుకోవాలనో కూడా పూసగుచ్చినట్టు చెప్పారు. అందర్ని పేరు పేరున పలకరిస్తూ ఆటలో ఎలా ముందుకెళ్లాలో చెప్పారు. ఇక్కడ మాధురి చేస్తున్న ఓవరాక్షన్, రమ్య చేసే కామెంట్స్, ఆయేషా చేష్టలపై క్లియర్‌గా చెప్పాడు. ఇలాంటి ధైర్యం నాగార్జున చేయలేకపోయాడని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఆది తన దృష్టికి వచ్చిన విషయాలతో కామెడీ చేస్తున్న టైంలో మాధురి, రమ్య చాలా సీరియస్‌గా ఏంటో ఈ సోది అన్నట్టు చూస్తున్న ఉండటం గమనించవచ్చు. వారి గురించి వచ్చినప్పుడు కూడా చాలా రెక్లెస్‌గానే ఉన్నారు. ఇది కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇదే ధోరణి కొనసాగి వాళ్లు నామినేషన్‌లో ఉంటే మాత్రం కచ్చితంగా ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Embed widget