News
News
X

Bigg Boss Telugu 6: బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ నేనే - ఇనయా తెగింపు మామూలుగా లేదు, ఎంత కోపంగా కుండలు బద్దలు కొట్టారో చూడండి

Bigg Boss Telugu 6: మళ్లీ ఇనయా టార్గెట్ అయిందా? ఈ ప్రోమో చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

FOLLOW US: 

Bigg Boss Telugu 6: నామినేషన్ డే చాలా హీటెక్కిపోయింది. ఏమైందో  కానీ మళ్లీ అందరూ ఇనయావైపు వేలు చూపించడం మొదలుపెట్టారు. ఎక్కువ ఓట్లు ఇనయాకే పడినట్టు అర్థం అవుతోంది. సోమవారం నాడు ప్రోమో ఎదురు చూసే వాళ్లు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అసలైన బిగ్‌బాస్ షో కనిపించేది ఈరోజే. 

ఇక ప్రోమోలో ఏముందంటే... నామినేషన్ సందర్భంగా కుండలు ఇచ్చారు బిగ్ బాస్. ఇంటి సభ్యులంతా వరుసగా నిల్చుంటే వారి ముందు కర్ర పెట్టారు. ఏ ఇంటి సభ్యుడినైతే నామినేట్ చేయాలో వారి ఫోటో ఉన్న కుండని తీసి ఆ కర్రకు పెట్టి పగులగొట్టాలి. ఆ కుండల్ని కోపంతో ఓ స్థాయిలో పగుల గొట్టారు ఇంటి సభ్యులు. ఆ కుండపెంకులు ఎవరికైనా తగులుతాయేమో అన్న ఆలోచన కూడా లేదు వారికి. రేవంత్ కీర్తిని నామినేట్ చేస్తూ ‘మీరు చివర్లో ఓ మాట అన్నారు ఛీ... థూ అని బ్యాడ్ వర్డ్ వాడారు’ అన్నాడు. దానికి కీర్తి ‘ఛీ... థూ అనేది బ్యాడ్ వర్డా’ అంది. దానికి రేవంత్ ‘అది బ్యాడ్ వర్డే’ అని చెప్పాడు. తరువాత ఇనయా రేవంత్ నుద్దేశించి ‘మీ ఓట్ల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, మీ మాటల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు’ అని అరుస్తుంటే... రేవంత్ ‘ఇనయాగారు అరవద్దు’ అంటూ ఇంకా గట్టిగా అరిచాడు. 

ఇక గీతూ మళ్లీ ఆ భార్యభర్తల మీద పడింది. వారిద్దరినీ నామినేట్ చేసింది. మీ ఇద్దరూ కలిసి ఆడుతున్నారూ అంటూ ఏవేమో మాట్లాడింది. మెరీనా చెప్పినా కూడా వినలేదు. ఇక రోహిత్ ‘గేమ్ కోసం నామినేట్ చేయండి. కానీ వ్యక్తిగతంగా వెళ్లొద్దు’ అని చాలా సున్నితంగా చెప్పాడు. ఇక గీతూ రోహిత్‌తో ‘మీరు నాకు అర్థం కాదు, చాలా కన్ఫ్యూజ్డ్ వ్యక్తి’ అంది. దానికి రోహిత్ చాలా సింపుల్‌గా చక్కగా జవాబిచ్చాడు. ‘మీరు నాకు ఒకసారి కెప్టెన్సీ కంటెండర్‌గా ఓటు వేశారు? ఎందుకు’ అని అడిగాడు. దానికి గీతూ ‘అక్కడున్న అర్జున్‌తో పోలిస్తే నువ్వు చాలా బెటర్, అందుకే వేశా’ అంది. దానికి రోహిత్ ‘అంటే నా గురించి మీకు కొంత క్లారిటీ ఉంది’ అన్నాడు. 

ఆదిరెడ్డి వర్సెస్ ఇనయా
ఆదిరెడ్డి ఇనయాను ఫేక్ అని అన్నాడు. సూర్యను నామినేట్ చేసి మళ్లీ మీరే బాధపడతారేంటి అని అడిగాడు. దానికి సూర్యను నామినేట్ చేయడం అనేది నా ఇష్టం అంది ఇనయా. ఇదే పాయింట్ రేవంత్ కూడా తన నామినేషన్లో అన్నాడు. దీంతో ఇనయా ‘సూర్య గురించి ఇక్కడ తీసుకురాకండి’ అంది. తరువాత ఆదిరెడ్డి ‘బిగ్ బాస్ అయ్యేందుకు ఇన్నర్ క్వాలిటీస్ ఏం కావాలో అవి వాంటెడ్‌గా  పెట్టుకుని చేయకూడదు’ అన్నాడు. దానికి ఇనయా ‘నాకు విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని మీరే చెప్పారు. ఓకే నేనే విన్నర్, బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ నేనే’ అంటూ అరిచింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. రేవంత్ కోపంగా వెళ్లి ఇనయా ఫోటో ఉన్న కుండ పగుల గొట్టాడు. అలాగే ఆదిరెడ్డి రేవంత్‌ని నామినేట్ చేశాడు. ఎందుకు నామినేట్ చేశాడో చూపించలేదు. కానీ పెద్ద బ్యాట్స్ మెన్ ఫోజు కొడుతూ కుండను పగుల గొట్టాడు. మొత్తం మీద ప్రోమో మంచి వాడి వేడి వాతావరణం కనిపించింది.  

News Reels

Also Read: చిత్తూరు చిరుత కాదు చిత్తూరు చింతకాయ, గీతూని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Published at : 31 Oct 2022 02:32 PM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana

సంబంధిత కథనాలు

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

టాప్ స్టోరీస్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Batti Vs Revant : రేవంత్ వర్సెస్ భట్టి విక్రమార్క - తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు ! కాంగ్రెస్‌ ఇక కోలుకోదా ?

Batti Vs Revant :  రేవంత్ వర్సెస్ భట్టి విక్రమార్క - తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు  ! కాంగ్రెస్‌ ఇక కోలుకోదా ?

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Sanju Samson Dropped: ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే సంజూపై వేటు! పంతే ముద్దు!

Sanju Samson Dropped: ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే సంజూపై వేటు! పంతే ముద్దు!