అన్వేషించండి

Bigg Boss Telugu 6: చిత్తూరు చిరుత కాదు చిత్తూరు చింతకాయ, గీతూని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Bigg Boss Telugu 6: గీతూ రాయల్ ఓవరాక్షన్‌తో తన పరువు తానే తీసుకుంటోంది.

Bigg Boss Telugu 6: దూకుడు సినిమాలో ‘నాగార్జున సర్... వారిని ఎలిమినేట్ చేసేయండి సర్, ఎలిమినేట్ దెమ్ ఇమ్మీడియట్లీ’ అన్న డైలాగ్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ డైలాగ్ ఎక్కడో దగ్గర వినిపిస్తుంది. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గీతూ రాయల్‌కి  క్లాసు తీసుకున్నాక,  మళ్లీ ఆ డైలాగ్ ట్రెండవ్వడం మొదలైంది. నెటిజన్లు ‘ఎలిమినేట్ చేసేయండి సర్, ఆమెను ఎలిమిటనేట్ చేసేయండి’ అంటూ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. గీతూ మాత్రం ఈసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది. తానే బిగ్‌బాస్‌లా మారి సీజన్ మొత్తాన్ని ఆడించేద్దాం అనుకుంది. చూసి చూసి గట్టిగా ఇచ్చిపడేశారు నాగార్జున. 

ఇక బిగ్‌బాస్ ఎందుకు?
‘నేను గేమర్‌ని సర్, గేమ్ అంటే మెంటలెక్కిపోతుంది. నేనున్న సీజన్లో ఇలా ఉండకూడదు, అందరూ బాగా ఆడాలి అని అందరినీ రెచ్చగొట్టా సర్’ అని ఏదో చెప్పుకొచ్చింది కన్నింగ్ గీతూ. కానీ నాగార్జున ఆమె మాటలు ఏవీ కూడా పట్టించుకోలేదు. ‘గేమ్ ఎలా ఆసక్తికరంగా మార్చాలో బిగ్ బాస్ చూసుకుంటాడు, నీకెందుకు’ అంటూ సుత్తిమెత్తని మాటలతో గట్టిగా ఇచ్చిపడేశారు. అయినా పిల్ల తగ్గితే కదా ఇంకా ఏదో చెప్పుకోవాలనే చూసింది. ఇంతకుముందులా నాగార్జున, బిగ్‌బాస్ సపోర్ట్ చేస్తారు, చప్పట్లు కొడతారు అనుకుంది. కానీ బయట వస్తున్న విమర్శలను చూసి బిగ్‌బాస్ టీమ్ ముందు జాగ్రత్త పడింది. ఈ వారమంతా గీతూని ఫ్రీగా వదిలేసింది. ఆమె ఏం చేసినా ఏమీ అనలేదు. ఆమె కూడా ఇచ్చిన ఫ్రీడమ్‌ని దుర్వినియోగం చేసుకుని పిచ్చిపిచ్చిగా నచ్చిన డెసిషన్లు తీసుకుంది. చివరికి వీకెండ్లో నాగార్జున ఎపిసోడ్‌ హైలైట్ అయ్యేలా చేసింది. గీతూని తిట్టాక బయట నెటిజన్ల ఆనందం చూడాలి. వారి కామెంట్లు చూస్తేనే గీతూ తన ప్రవర్తనతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంత విసిగించిందో అర్థమైపోతుంది. 

 చేపల టాస్కులో సంచాలక్ గా ఆమె చేసిన అరాచకం గురించి ఎంత చెప్పినా తక్కువే. బిగ్‌బాస్ షో చరిత్రలో ఎవరూ ఇలా ప్రవర్తించలేదు. అందరూ బిగ్‌బాస్ ఆదేశాల మేరకే నడుచుకున్నారు. కానీ ఈమె నాగార్జున, బిగ్‌బాస్ ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. తనకు నచ్చిన రూల్స్ పెట్టి ఇంటి సభ్యులను ఆడమని చెప్పింది. అంతేనా సంచాలక్ అయి ఉండి తాను కూడా ఆడేసింది. ఒకపక్క ఆమె నమ్మిన బంటు ఆదిరెడ్డి చెబుతున్నా కూడా వినలేదు. పైగా ఫిజికల్ టాస్కు ఇస్తే గుద్ది పడేస్తా బిగ్ బాస్ అంటూ డైలాగులు. అందుకే నెటిజన్లు ఇప్పుడు ఆమెను ఏకిపడేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో : నవ్వించేశావ్ నరేశా! నామినేషన్లను రీక్రియేట్ చేసిన నరేశ్, రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో : నవ్వించేశావ్ నరేశా! నామినేషన్లను రీక్రియేట్ చేసిన నరేశ్, రాంప్రసాద్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బూతులు తిట్టుకున్న అమన్, త్రిగుణ్! షాలిని దొంగతనంలో రేగిన మంట!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బూతులు తిట్టుకున్న అమన్, త్రిగుణ్! షాలిని దొంగతనంలో రేగిన మంట!
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ కోసం మరో యుద్ధం! మరోసారి వర్షిణి సంచాలక్‌గా ఫెయిలైందా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ కోసం మరో యుద్ధం! మరోసారి వర్షిణి సంచాలక్‌గా ఫెయిలైందా!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రెచ్చిపోయిన ఇంటి సభ్యులు! డ్రాగర్స్ కోసం ఒకరి మీద ఒకరు దాడులు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రెచ్చిపోయిన ఇంటి సభ్యులు! డ్రాగర్స్ కోసం ఒకరి మీద ఒకరు దాడులు!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది, రెసిపీ ఇదే
34 Percent BC Reservation Supreme Court: బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటన
బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటన
KTR Arrogance Allegations: కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
Embed widget