By: ABP Desam | Updated at : 08 Aug 2021 05:51 PM (IST)
బిగ్ బాస్ ఎంట్రీపై హీరోయిన్ రెస్పాన్స్..
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. రీసెంట్ గానే ఐదో సీజన్ కి సంబంధించిన లోగోను విడుదల చేశారు. అప్పటినుండి ఈ షో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటిలానే కంటెస్టెంట్ ల లిస్ట్ ఇదేనంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రోజుకో కొత్త పేరు తెరపై వస్తుంది.
అయితే ఇలా లిస్ట్ లో పేర్లు వినిపించిన కొంతమంది సెలబ్రిటీలు ఈ రూమర్లను ఖండిస్తున్నారు. మరికొందరు మాత్రం వారి పేర్లను చూసి నవ్వుకొని వదిలేస్తున్నారు. ఈ లిస్ట్ లో యాంకర్ రవి, వర్షిణి, సిరి హన్మంత్, జబర్దస్త్ సాయి తేజ(ప్రియాంక సింగ్), నవ్యస్వామి, విష్ణుప్రియ, సీరియల్ నటి ప్రియ, సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్, సీరియల్ హీరో మానస్, హీరోయిన్ఇషా చావ్లా, లోబో, యూట్యూబర్ సరయు, సురేఖా వాణి ఇలా కొన్ని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
మొన్నామధ్య యాంకర్ రవిని నెటిజన్లు ఇదే విషయంపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వెటకారంగా బదులిచ్చాడు. రీసెంట్ గా సురేఖా వాణి తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసింది. దీంతో అసలు ఆమె షోకి వెళ్తుందా లేదా అనే విషయంలో సందేహాలు మరింత పెరిగాయి. యాంకర్ వర్షిణి బిగ్ బాస్ షోలోకి రావడం లేదని తెలుస్తోంది. ఆమెకి 'శాకుంతలం' సినిమాలో ఆఫర్ రావడంతో నటిగా బిజీ అయింది. కాబట్టి ఆమె వచ్చే ఛాన్స్ లేదనిపిస్తుంది.
అయితే తాజాగా హీరోయిన్ ఈషా చావ్లా బిగ్ బాస్ ఎంట్రీ విషయంపై స్పందించారు. నెటిజన్లు బిగ్ బాస్ ఎంట్రీ గురించి ఆమెని ప్రశ్నిస్తుంటే.. తాజాగా వాటికి బదులిచ్చింది. తాను బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదని అసలు విషయం చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె స్థానంలో మరో కొత్త పేరు వినిపిస్తుందేమో చూడాలి. ఇక మూడు, నాలుగు సీజన్లను హోస్ట్ చేసిన నాగార్జున ఐదో సీజన్ ను కూడా హోస్ట్ చేయనున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో బిగ్ బాస్ కి సంబంధించిన సెట్ ను నిర్మిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్ నుండి బిగ్ బాస్ షో టెలికాస్ట్ కానుంది.
Also Read : Surekha Vani: బిగ్ బాస్ 5లో సురేఖావాణి.. తప్పుడు వార్తలంటూ నటి ఫైర్..
Keerthi Bhat: రక్తం మరిగిపోతోంది - అమర్ అభిమానులపై సీరియల్ నటి కీర్తి భట్ ఆగ్రహం
Bigg Boss 7 Telugu: ఆడపిల్ల అని అడ్వాంటేజ్ తీసుకోకు, మంచిది కాదు - శోభాకు శివాజీ వార్నింగ్
Bigg Boss 7 Telugu: శివాజీకి వార్నింగ్ ఇచ్చిన అమర్ - నేను కెప్టెన్ అంటూ అరుపులు, ప్రేక్షకులకు సహన పరీక్ష
Bigg Boss 7 Telugu: టాస్కులో ఫిజికల్ అయిన శోభా, యావర్! ఛీ, తూ అంటూ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు
Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌ను కొరికిన అమర్ - చెప్పుతో కొడతానంటూ సైగలు, చివరికి..
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>