అన్వేషించండి

Bigg Boss 7 Contestants: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్స్ వీరే - ఈ సెలబ్రిటీలను మీరు ఊహించి కూడా ఉండరు!

ఇప్పటికే ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్స్ వీరే అంటూ పలు లిస్ట్స్ బయటికి వచ్చాయి. కానీ తాజాగా వచ్చిన ఒక లిస్ట్ ప్రకారం 95 శాతం కంటెస్టెంట్స్ వీరే అని కన్ఫర్మ్ అని తెలుస్తోంది.

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 7’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఎప్పటిలాగానే సీజన్ ప్రారంభం అయ్యేముందు అసలు కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ వీరే అంటూ పలు లిస్ట్స్ బయటికి వచ్చాయి. కానీ తాజాగా వచ్చిన ఒక లిస్ట్ ప్రకారం 95 శాతం కంటెస్టెంట్స్ వీరే అని కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో ఇప్పటివరకు 12 మంది మగవారు, ఆరుగురు ఆడవారు ఉన్నారు. వారు ఎవరంటే..

1. హీరో శివాజీ
ఒకప్పుడు సినిమాల్లో హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా యాక్టివ్‌గా ఉన్న శివాజీ.. గతకొంతకాలంగా రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. రాజకీయాల్లోకి చేరినప్పటి నుంచి పలు కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేశారు. అందుకే అలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ షోలో ఉంటే ప్రేక్షకులకు ఆసక్తిగా ఉంటుందని టీమ్.. ఆయనను అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. కానీ ఆయన తరపున పూర్తిస్థాయిలో కన్ఫర్మేషన్ రాలేదని తెలుస్తోంది.

2. అమర్‌దీప్
సీరియల్స్‌తో, డ్యాన్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న అమర్‌దీప్ కూడా బిగ్ బాస్ 7లో భాగం కానున్నట్టు ముందు నుండే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముందు నుంచి తన భార్య తేజస్వినితో కలిసి కపుల్ కంటెస్టెంట్స్‌గా వస్తారని రూమర్స్ వినిపించినా.. ఎక్కువశాతం అమర్‌దీప్ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

3. ఆట సందీప్
ఒకప్పుడు డ్యాన్స్ షోలలో కంటెస్టెంట్‌గా, ఆ తర్వాత జడ్జిగా మెరిసిన ఆట సందీప్.. కొన్నాళ్లుగా షోలకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడిప్పుడే బుల్లితెరపై వెలిగిపోతున్న సందీప్.. బిగ్ బాస్ 7లో కనిపిస్తే మళ్లీ తన కెరీర్ ఊపందుకుంటుంది అన్న ఉద్దేశ్యంతో టీమ్ ఇస్తున్న ఆఫర్‌ను అందుకున్నట్టు సమాచారం.

4. బొంబాయ్ భోలే
భోలే షవాలి అలియాస్ బొంబాయ్ భోలే అనే సింగర్, యూట్యూబర్ కూడా ఈసారి బిగ్ బాస్ 7లో పార్టిసిపేట్ చేయనున్నట్టు సమాచారం. ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్‌లో ఉంటే ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు కాంట్రవర్సీలు కూడా క్రియేట్ అవుతాయని, షో రసవత్తరంగా సాగుతుందని టీమ్.. అతడిని అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది.

5. బుల్లెట్ భాస్కర్
‘జబర్దస్త్’ షో చాలామంది కమెడియన్స్‌కు కొత్త జీవితాన్ని ఇచ్చింది. అలాంటి వారిలో బుల్లెట్ భాస్కర్ కూడా ఒకరు. ఇప్పటికే ‘జబర్దస్త్’ నుంచి చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా వచ్చి కొత్త లైఫ్‌ను ప్రారంభించారు. బుల్లెట్ భాస్కర్ కూడా ఆ లిస్ట్‌లో చేరాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

6. నరేశ్
బుల్లెట్ భాస్కర్‌తో పాటు ‘జబర్దస్త్’‌ ద్వారా ప్రేక్షకులను అలరించినవారిలో నరేశ్ కూడా ఒకరు. అయితే భాస్కర్‌తో పాటు నరేశ్ కూడా బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా రానున్నట్టు సమాచారం. కానీ సీజన్ మొదట్లో నరేశ్ ఎంట్రీ ఉంటుందా లేదా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తాడా అనే విషయంపై క్లారిటీ లేదు.

7. మహేశ్
‘జబర్దస్త్’ నుంచి సినిమాల్లోకి వెళ్లిన కమెడియన్స్ చాలామందే ఉన్నారు. మహేశ్ కూడా తన ప్రయాణాన్ని ‘జబర్దస్త్’‌తో ప్రారంభించి, ‘రంగస్థలం’లో క్యారెక్టర్ ద్వారా తన పేరునే రంగస్థలం మహేశ్‌గా మార్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు లేని మహేశ్.. బిగ్ బాస్‌లో కనిపించి మళ్లీ తన కెరీర్‌ను ఫార్మ్‌లోకి తీసుకురానున్నాడని సమాచారం.

8. మహేశ్
బిగ్ బాస్ సీజన్ 7లో ఇద్దరు మహేశ్‌లు ఉండబోతున్నట్టు సమాచారం. అందులో ఒకరు రంగస్థలం మహేశ్ అయితే.. మరొకరు సీరియల్ ఆర్టిస్ట్ మహేశ్. ఇప్పటికే బిగ్ బాస్ 6లో కీర్తి భట్‌కు సపోర్ట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అల్లరి చేసిన మహేశ్.. పూర్తిస్థాయి కంటెస్టెంట్‌గా ఎంటర్ అయితే ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

9. విలేజ్ షో అనిల్
గంగవ్వ లాంటి సీనియర్ టాలెంట్ ఉన్న నటిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అనిల్. ‘మై విలేజ్ షో’ అనే తన యూట్యూబ్ ఛానెల్‌తో సెన్సేషన్ సృష్టించిన అనిల్ కూడా బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్‌గా కనిపించనున్నట్టు సమాచారం.

10. పల్లవి ప్రశాంత్
వ్యూయర్స్‌కు కనెక్ట్ అయ్యే వీడియోలు చేస్తే చాలు.. యూట్యూబ్ ఛానెళ్లకు లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ వచ్చిపడతారు. అలా అందరికీ కనెక్ట్ అయ్యే వీడియోలు చేసేవారిలో పల్లవి ప్రశాంత్ కూడా ఉంటాడు. యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్.. ఎంతోకాలంగా బిగ్ బాస్‌లోకి రావాలని ప్రయత్నాలు చేస్తుండగా.. ఇన్నాళ్లకు ఈ ప్రయత్నాలు సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.

11. యువసామ్రాట్
బిగ్ బాస్ 7లో ఈసారి యూట్యూబర్ల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మై విలేజ్ షో అనిల్, పల్లవి ప్రశాంత్ కంటెస్టెంట్స్‌గా కన్ఫర్మ్ అవ్వగా.. ఇప్పుడు మరో యూట్యూబర్ యువసామ్రాట్ కూడా ఇందులో భాగం కానున్నట్టు సమాచారం.

12. సాగర్
సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు.. ‘మొగలిరేకులు’ సీరియల్‌లోని పాత్రలు ఇప్పటికీ చాలామందికి గుర్తుంటాయి. ఆ సీరియల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ముఖ్యంగా ఆర్కే నాయుడు పాత్రకు అయితే ఫ్యాన్ బేస్ ఇంకా తగ్గలేదు. ఆ పాత్ర పోషించిన సాగర్‌కు మొగలిరేకులు సీరియల్ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ 7తో అలాంటి అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం.

13. అంజలి
సీరియల్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. తన భర్త, నటుడు అయిన పవన్‌తో కలిసి బిగ్ బాస్ 7లోకి ఎంట్రీ ఇస్తుందని సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ 7లో కపుల్ కంటెస్టెంట్స్‌గా ఎవరు ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. అంజలి, పవన్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది.

14. శోభా శెట్టి
శోభా శెట్టి.. ఈ పేరు చెప్తే.. చాలావరకు బుల్లితెర ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు. కానీ ‘కార్తీకదీపం’లో మోనిత అంటే గుర్తుపట్టనివారు ఉండరు. ఒకేఒక్క నెగిటివ్ క్యారెక్టర్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. ఇప్పుడు బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్‌గా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది.

15. మోహన భోగరాజు
సింగర్‌గా పలువురు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసింది మోహన. కానీ వాటికంటే తను సొంతంగా చేసుకున్న ఆల్బమ్ సాంగ్స్, కవర్ సాంగ్స్ వల్లే తనకు ఎక్కువగా గుర్తింపు లభించింది. ఇప్పుడు బిగ్ బాస్ 7 ప్రేక్షకులను తన పాటలతో మైమరింపించడానికి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టనుంది.

16. ఐశ్వర్య పిస్సే
కన్నడ నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటీమణులు ఎంతోమంది ఉన్నారు. అందులో ఐశ్వర్య ఒకరు. ఒకప్పుడు ఏ సీరియల్‌లో చూసినా.. తనే హీరోయిన్‌గా కనిపించేది. ప్రస్తుతం పెరుగుతున్న పోటీ వల్ల ఐశ్వర్యకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బిగ్ బాస్ 7 తనకు మరోసారి అవకాశాలు తెచ్చిపెడుతుందని ఇందులో కంటెస్టెంట్‌గా రావడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.

17. శీతల్ గౌతమన్
బిగ్ బాస్ 7కు మరింత గ్లామర్‌ను యాడ్ చేయడానికి హాట్ యూట్యూబర్ శీతల్ గౌతమన్ రంగంలోకి దిగనుంది. పలు వెబ్ సిరీస్‌లతో మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టుల ద్వార కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకున్న శీతల్ కూడా బిగ్ బాస్ 7లో భాగం కానుందట.

18. శుభ శ్రీ
ఒకప్పుడు హీరోయిన్స్‌గా వెలిగిపోయిన నటీమణులను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం బిగ్ బాస్‌కు అలవాటే. అదే విధంగా 90ల్లో హీరోయిన్‌గా వెలిగిపోయిన శుభ శ్రీను బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్‌గా రీ ఎంట్రీకి సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

Also Read: ‘తని ఒరువన్ 2’ ప్రకటనకు వేళాయే - మరి రామ్ చరణ్ ‘ధృవ 2’ సంగతేంటి రాజా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
Thandel Second Single: కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Embed widget