అన్వేషించండి

Subhasree: వామ్మో శుభశ్రీ, ‘బిగ్ బాస్’లో ఉన్న 5 వారాల్లో అంత సంపాదించిందా?

బిగ్ బాస్ సీజన్ 7కు గ్లామర్ యాడ్ చేయడం కోసం శుభశ్రీ ఎంత డిమాండ్ చేస్తే అంత రెమ్యునరేషన్ ఇచ్చేశారట మేకర్స్.

బిగ్ బాస్ సీజన్ 7లో అయిదో వారం శుభశ్రీ రాయగురు హౌజ్ నుండి ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్లిపోయింది. బిగ్ బాస్ కంటే శుభశ్రీ ఎవరో.. బుల్లితెర ప్రేక్షకులకు తెలియకపోయినా.. హౌజ్‌లోకి వచ్చిన తర్వాత తనకంటూ ఒక ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. తను కూడా మిగతా కంటెస్టెంట్స్‌లాగానే కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పుల వల్లే ఎలిమినేట్ అయ్యింది. అయితే మోడల్‌గా సక్సెస్‌ఫుల్ అయిన శుభశ్రీ.. బిగ్ బాస్‌లో మాత్రం ఫుల్‌గా సక్సెస్ కాలేకపోయింది. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం శుభశ్రీకి న్యాయమే జరిగిందని తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 కోసం శుభశ్రీ అందుకున్న రెమ్యునరేషన్ ఇదేనంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మల్టీ టాలెంటెడ్‌గా..
మిస్ ఇండియా ఒడిస్సా టైటిల్ గెలుచుకున్న తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో నటిగా, యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, మోడల్‌గా తన కెరీర్‌లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది శుభశ్రీ. యాంకర్‌గా దాదాపు 3000కు పైగా లైవ్ షోలు చేసింది. సినీ పరిశ్రమలోకి ఎంటర్ అవ్వకముందు లా పూర్తి చేసింది. 2020లో మిస్ ఇండియా ఒడిస్సా టైటిల్ సంపాదించుకున్న తర్వాత వెంటనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. మిగతా కంటెస్టెంట్స్‌లాగా శుభశ్రీ.. రెగ్యులర్ కమిట్మెంట్స్ వదిలి బిగ్ బాస్ హౌజ్‌లోకి రాకపోయినా.. రెమ్యునరేషన్ విషయంలో భారీగానే డిమాండ్ చేసిందట ఈ భామ. ఇక తనవల్ల బిగ్ బాస్ హౌజ్‌కు గ్లామర్ కూడా యాడ్ అవుతుందని మేకర్స్ కూడా ఒప్పుకున్నట్టు తన రెమ్యునరేషన్ చూస్తుంటే అర్థమవుతోంది.

వారానికి ఎంతంటే..?
బిగ్ బాస్ సీజన్ 7లోకి రావడానికి వారానికి రూ.2 లక్షలు డిమాండ్ చేసిందట శుభశ్రీ. దీన్ని బట్టి చూస్తే.. తను బిగ్ బాస్ హౌజ్‌లో మొత్తం 5 వారాలు గడిపింది. వారానికి రూ.2 లక్షలు రెమ్యునరేషన్‌గా అందుకుంది అంటే.. పూర్తిగా 5 వారాలకు తన రెమ్యునరేషన్ రూ.10 లక్షలు అని తెలుస్తోంది. గౌతమ్‌ను కూడా శుభశ్రీతో పాటు ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత నాగార్జున.. గౌతమ్‌కు రెండో అవకాశం ఇస్తున్నట్టు, తనను సీక్రెట్ రూమ్‌కు పంపిస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం ఆ సీక్రెట్ రూమ్ నుండే గౌతమ్.. ఇతర కంటెస్టెంట్స్‌ను గమనిస్తూ ఉన్నాడు.

కంటెస్టెంట్స్ అందరిపై శుభశ్రీ అభిప్రాయం..
బిగ్ బాస్ నుండి బయటికి రాగానే పలు ఇంటర్వ్యూలో పాల్గొంది శుభశ్రీ. అందులో చాలావరకు ఇంటర్వ్యూలలో పల్లవి ప్రశాంత్ తనకు అన్నలాంటి వాడని, తనే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పింది. అంతే కాకుండా శివాజీతో కూడా తనకు మంచి బాండింగ్ ఉందని చెప్పింది. గౌతమ్.. తనకు బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండే ఫ్రెండ్ అయినా కూడా తనకంటే యావర్ అంటేనే ఎక్కువ ఇష్టం అని శుభశ్రీ బయటపెట్టింది. హౌజ్‌లో ఉన్నప్పుడు శివాజీతో గొడవపడినా కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో తనకు శివాజీ, పల్లవి ప్రశాంత్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చింది. నామినేషన్స్ సమయంలో అమర్‌దీప్‌తో జరిగిన గొడవ వల్ల ప్రేక్షకుల్లో శుభశ్రీ ఫోకస్ అయ్యింది. టాస్కుల విషయంలో కూడా అంత యాక్టివ్‌గా లేకపోవడంతో తనను బిగ్ బాస్ ప్రేక్షకులు బయటికి పంపించేశారు.

Also Read: రతిక అతడిని తిట్టినప్పుడు బాధేసింది, అతడు గెలవాలని కోరుకుంటున్నా - శుభశ్రీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget