By: Haritha | Updated at : 30 Nov 2022 10:49 AM (IST)
(Image credit: Star maa)
Bigg Boss 6 Telugu: ‘టిక్కెట్ టు ఫినాలే’ ఇది గెలుచుకుంటే నేరుగా ఫైనల్‌కి వెళ్లిపోవచ్చు. ఇది గెలుచుకునేందుకు రకరకాల టాస్కులు ఇస్తున్నారు బిగ్ బాస్. మొదటగా స్నో మ్యాన్ ను తయారు చేసే టాస్క్ ఇచ్చారు. బిగ్ బామ్ టీమ్ విసిరిన ముక్కలను ఏరుకుని తెచ్చి స్నోమ్యాన్‌ను రెడీ చేయాలి. ఆ తరువాత పక్కవాళ్ల నుంచి స్నోమ్యాన్ ముక్కలను లాక్కో వచ్చని చెప్పారు బిగ్ బాస్. దీంతో పక్కవాళ్ల నుంచి లాక్కుని మరీ స్నోమ్యాన్ ను కట్టుకున్నారు కొంతమంది కంటెస్టెంట్లు. ఈ టాస్కులో సత్య, కీర్తి, ఇనాయ ఓడిపోయారు. దీంతో వీరు టిక్కెట్ టు ఫినాలే రేసు నుంచి తప్పకున్నట్టే అనుకున్నారంతా. అయితే బిగ్ బాస్ వీరికి మరో అవకాశం ఇచ్చారు.
రంగు పడుద్ది...
వీరు ముగ్గురికీ రంగు పడుద్ది అనే టాస్కు ఇచ్చారు.ఈ టాస్కులో ఎవరు గెలుస్తారో వారు ఫినాలే రేసు టాస్కులో పోటీ పడొచ్చు. ఒక సర్కిల్ లోపల వీరు ముగ్గురు ఉండి, అక్కడ పెట్టిన ఎర్రరంగును ఎదుటి వారి తెల్లని టీ షర్టుపై పూయాలి. ఎవరి టీ షర్టు అయితే ఎక్కువ రంగుతో నిండిపోతుందో వారు ఆట నుంచి అవుట్ అవుతారు. మొదటి రౌండ్లో కీర్తి, ఇనాయ కలిసి, శ్రీసత్యకు రంగును బాగా పులిమారు. దీంతో ఆమె అవుట్ అయింది. చివరికి కీర్తి, ఇనాయ మిగిలారు. వీరిద్దరూ ఆడ పులుల్లా ఆడారు. ఎవ్వరూ వెనక్కి తగ్గకుండా పోటీ పడ్డారు. కిందా మీదా పడి, దెబ్బలు తాకుతాయన్న భయం కూడా లేకుండా ఆడారు. ఇద్దరు టీ షర్టులు ఎర్రగా మారాయి. ఎవరి టీషర్టు ఎక్కువ రంగును కలిగి ఉందో చెప్పి, వారిని ఎలిమినేట్ చేసే బాధ్యత సంచాలక్ అయిన రేవంత్ పై పడింది. ఇద్దరు టీషర్టులు చూసిన రేవంత్ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. బిగ్ బాస్ కష్టంగా ఉంది అన్నాడు. చివరికి ఎవరిని ఆట నుంచి ఎలిమినేట్ చేశాడో ఎపిసోడ్లో చూసి తెలుసుకోవాల్సిందే.
ఈసారి ఎవరు?
13వ వారం నామినేషన్లో రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య, ఫైమా ఉన్నారు. ఇనాయ కెప్టెన్ అవ్వడంతో ఆమెను ఎవరూ నామినేట్ చేయలేదు. శ్రీహాన్‌ను కూడా ఎవరూ నామినేట్ చేయకపోవడంతో ఆయన కూడా సేవ్ అయ్యాడు. ఈసారి ఫైమా, శ్రీసత్యలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. రాజ్ కన్నా ఫైమాకు తక్కువగా ఓట్లు వచ్చాయి మొన్న. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా ఆమె సేవ్ అయ్యింది. కానీ ఈసారి ఆమె బయటికి వెళ్లే ఛాన్సు ఉంది. అయితే శ్రీసత్యకు కూడా అవకాశాలు ఉన్నాయి.
One last chance for Revival!
— starmaa (@StarMaa) November 30, 2022
Who will be back in the race for Ticket To Finale?
To find out, watch today's episode of Bigg Boss on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/VMB2fVQZK0
Also read: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!
Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా
Income Tax Rule: బిగ్‌బాస్, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!
Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam