By: Haritha | Updated at : 07 Dec 2022 05:27 PM (IST)
(Image credit: Star maa)
Bigg Boss 6 Telugu: ప్రతి సీజన్లో కామన్‌గా ఉండే టాస్కు దెయ్యాల గది. ఓ గదిలో అంత చీకటిగా చేసి గడ్డితో నింపేసి, రకరకాల శబ్ధాలతో కంటెస్టెంట్లను భయపెడతారు. అందులోకి ఇంటి సభ్యులను పంపి ఒక వస్తువను వెతికి కనిపెట్టమని చెబుతారు. అలా ఈ ఎపిసోడ్లో ఆదిరెడ్డిని దెయ్యాల గదిలోకి పంపారు. ఆయన చాలా భయపడుతూ లోపలికి వెళ్లాడు. కూర్చోవచ్చా బిగ్ బాస్ అని అడిగాడు ఆదిరెడ్డి. కావాలంటే పడుకోవచ్చు అని చెప్పాడు బిగ్ బాస్. కాసేపయ్యాక ఎవరినైనా తోడు పంపమంటారా అని అడిగాడు బిగ్ బాస్. దానికి శ్రీహాన్‌ను పంపించమని అడిగారు బిగ్ బాస్.
కొవ్వొత్తి,గన్
వారిద్దరికీ కొవ్వొత్తి, గన్ వెతికి బయటకు తీసుకెళ్లమని చెప్పారు.ఆ చీకటి గదిలో గజ్జల చప్పుళ్లు, దెయ్యాల అరుపులు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌లా పెట్టారు. దీంతో శ్రీహాన్ ఆదిరెడ్డి కన్నా భయపడ్డాడు. అంతేకాదు ఈసారి దయ్యాల్లా తయారైన మనుషులను కూడా ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఇది అదనపు ఆకర్షణ.
ఇక టాస్కుల విషయానికి వస్తే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఖర్చుపెట్టిన మనీని వెనక్కి ఇచ్చేందుకు బిగ్‌బాస్ రకరకాల టాస్కులు పెడుతున్నాడు. వాటిల్లో కొన్ని గెలుస్తున్నారు, కొన్ని ఓడి పోతున్నారు ఇంటి సభ్యులు.రోహిత్, ఆదిరెడ్డిలకు టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. మిగతా ఇంటి కంటెస్టెంట్లకు 20 వేల చొప్పున నగదు ఇచ్చి, వారు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో వారి పక్కన నిల్చోమన్నారు. కాగా రోహిత్‌ను కేవలం శ్రీసత్య మాత్రమే సపోర్ట్ చేసింది. ఇక మిగతా నలుగురు ఆదిరెడ్డినే సపోర్ట్ చేశారు. అంటే ఆదిరెడ్డి గెలిస్తే 80 వేల రూపాయలు ప్రైజ్ మనీకి కలుస్తుంది. అదే రోహిత్ గెలిస్తే కేవలం 20 వేల రూపాయలే ప్రైజ్ మనీకి కలుస్తుంది. ఎవరు గెలుస్తారో ఎపిసోడ్లో చూడాలి.
బిగ్‌బాస్ సీజన్ 6 చప్పగానే సాగుతోంది. చివరి రెండు వారాలు కూడా చిరాకు కలిగించేలాగే ఉంది. అందులోనూ ఈ సీజన్లో విన్నర్ మెటీరియల్‌గా ఏ ఒక్కరూ పర్‌ఫెక్ట్ అనిపించకపోవడం పెద్ద మైనస్. అదే ఈ సీజన్ ఫెయిల్ అవ్వడానికి పెద్ద కారణం. కాగా విన్నర్ అవుతాడని అనుకుంటున్న రేవంత్ తన బిహేవియర్ చిరాకు పెడుతున్నాడు. మాట మీద నిలకడ లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం, అలగడం, ప్రతి దానికి ఇష్యూ చేయడం చూడటానికే చిరాకుగా ఉంది. ప్రస్తుతం ఇంట్లో కామ్ అండ్ కంపోజ్డ్ రోహిత్ అనే చెప్పాలి. అతను మొదట్నించి చురుగ్గా ఆటలు ఆడి ఉంటే విన్నర్ అయ్యే వాడు. టాస్కుల్లో చురుగ్గా పాల్గొనక పోవడం అతడికి మైనస్ అయింది. ఆదిరెడ్డి నామినేషన్ సమయంలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు ఆడకుండా అతి తెలివి చూపించడం, ఎవిక్షన్ ఫ్రీపాస్ సమయంలో ఓవర్ యాక్షన చేయడం, తన గెలుపుపై అతి నమ్మకం పెట్టుకోవడం, తానే విన్నర్ అని ఎవిక్షన్ ఫ్రీ పాస్ సమయంలో పదే పదే చెప్పుకోవడం కూడా ప్రేక్షకులను చికాకు కలిగించాయి. శ్రీహాన్ విన్నర్ అని ఇంతవరకు ఎవరికీ అనిపించలేదు. అమ్మాయిల్లో ఇనాయ తప్ప మిగతావాళ్లు వేస్ట్.
Also read: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!
Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా
Income Tax Rule: బిగ్‌బాస్, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!
ఎప్పుడైనా ఎన్నికలు, సిద్ధంగా ఉండాలి- నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!
RRR 100 Days : ఆర్ఆర్ఆర్ @ 100 డేస్ ఇన్ జపాన్ - రజనీకాంత్ రికార్డులు స్మాష్
ఎమ్మెల్సీ కవితతో నటుడు శరత్ కుమార్ భేటీ- రాజకీయాలపై చర్చ!