By: ABP Desam | Updated at : 03 Sep 2023 08:48 PM (IST)
Image Credit: Star MAA, Disney Hotstar
ఉల్టా పుల్టా సీజన్ అంటే ఏంటో అని ప్రేక్షకులు అంచనాలు వేసుకున్నా కూడా వారి ఊహలకు అందకుండా టాస్కులు ఇస్తున్నారు బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ అయిన మొదటిరోజు నుంచే కంటెస్టెంట్స్‌ను ఇబ్బందుల్లో పడేసే టాస్కులు మొదలుపెట్టేశాడు బిగ్ బాస్. మామూలుగా బిగ్ బాస్‌లోని ప్రతీ సీజన్ ఫైనల్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్న సమయంలో సూట్‌కేస్ అందించి.. ఆ డబ్బును తీసుకొని ట్రాఫీ రేస్ నుండి తప్పుకునే అవకాశం కంటెస్టెంట్స్‌కు లభిస్తుంది. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో ఫస్ట్ 5 కంటెస్టెంట్స్‌కు ఈ ఆఫర్ లభించింది.
బిగ్ బాస్ సీజన్ 7లో ఫస్ట్ 5 కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయ్యారు ప్రియాంక జైన్, శివాజీ, దామిని, శుభశ్రీ, యావర్. అందులో ఫస్ట్ కంటెస్టెంట్‌గా వచ్చిన ప్రియాంక జైన్ చేతికి ఒక సూట్‌కేస్ వచ్చింది. దానిని తీసుకెళ్లి ఎక్కడైనా దాచిపెట్టే బాధ్యతను అందించాడు నాగార్జున. దానిని ప్రియాంక.. తెలివిగా లాక్ చేసి ఉన్న జైలులోని వాష్‌రూమ్‌లో దాచిపెట్టింది. ఈ విషయం నాగార్జున చెప్పే వరకు ఎవరు కనీసం గెస్ కూడా చేయలేకపోయారు. ఆ సూట్‌కేస్ తీసి అందరి ముందు పెట్టిన తర్వాత అసలు ఆట మొదలుపెట్టారు నాగార్జున. పవర్ అస్త్రా వచ్చేవరకు బిగ్ బాస్‌లో ఎవరు హౌజ్‌మేట్స్ కాదని, అప్పటి వరకు అందరూ కంటెస్టెంట్సే అని, అందుకే ఆ సూట్‌కేస్ తీసుకొని వెళ్లిపోయే ఛాన్స్ ఉందని నాగ్ గుర్తుచేసుకున్నారు.
ముందుగా ఆ సూట్‌కేసులో ఎంత అమౌంట్ ఉందో చెప్పకుండానే అయిదుగురు కంటెస్టెంట్స్‌కు ఆఫర్ ఇచ్చారు నాగార్జున. ముందుగా అందులో రూ.5 లక్షలు ఉన్నాయని చెప్పినా కంటెస్టెంట్స్ అసలు వెనక్కి వెళ్లడానికి సిద్దంగా లేరు. మెల్లగా ఆ అమౌంట్‌ను పెంచుకుంటూ పోయారు. రూ.15 లక్షలు అని చెప్పినా ఎవరూ వెళ్లడానికి సిద్ధపడలేదు, రూ.25 లక్షలు, రూ.35 లక్షలు అన్నా కూడా అలాగా కదలకుండా నిలుచుకున్నారు. రూ.35 లక్షలు ఆఫర్ చేసినప్పుడు మాత్రం హీరో శివాజీ ఆఫర్ బాగుంది అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. రూ.70 లక్షలు ఇస్తే ఓకే అంటూ దామిని.. ముందు నుండి ఒకే మాట మీద ఉంది.
‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చివరిగా ఫస్ట్ 5 కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ ఇచ్చిన సూట్‌కేస్ ఆఫర్ ఎవరూ తీసుకోలేదు. దీంతో 3 సెకండ్లలో ఆ సూట్‌కేసును తీసుకెళ్లి స్టోర్ రూమ్‌లో పెట్టిన వారికి గిఫ్ట్ ఇస్తానని నాగ్ ఆఫర్ చేశారు. ఆ సూట్‌కేసును స్టోర్ రూమ్‌లో పెట్టడానికి ముందుగా శివాజీ ముందుకు రాగా.. తనను అడ్డుకోవడానికి యావర్ విశ్వప్రయత్నాలు చేశాడు. ఇద్దరి మధ్య మినీ యుద్ధమే జరిగింది. వారిద్దరినీ చూస్తుంటే అసలైన బిగ్ బాస్ ప్రారంభం అయినట్టు అనిపిస్తుందని నాగ్.. వారిని ప్రశంసించారు. ఎవరూ వెనక్కి వెళ్లడానికి సిద్ధంగా లేకపోవడం బాగుందంటూ చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ అయిదుగురి కంటెస్టెంట్స్‌లో ఒకరికి మాత్రమే స్టోర్ రూమ్ ఎక్కడ ఉందో తెలిసి అందరూ నవ్వుకున్నారు. ఇంకా బిగ్ బాస్ హౌజ్‌లో ఏది, ఎక్కడ ఉందో తెలుసుకోకముందే కంటెస్టెంట్స్ మధ్య కాంపిటీషన్ మొదలయ్యిందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ - శోభాశెట్టి చీటింగ్ గేమ్, శివాజీ ఫ్రస్ట్రేషన్
Bigg Boss: ‘బిగ్ బాస్’ విన్నర్‌పై ఆరోపణలు, ట్రోఫీ తిరిగి ఇచ్చేస్తానంటూ వీడియో
Subhasree: కచ్చితంగా తిడతారు, నేను చాలామందికి ఆ సలహా ఇవ్వను: శుభశ్రీ
Bigg Boss Telugu 7: పవర్ అస్త్రాలు మటాష్, కెప్టెన్సీ టాస్క్ షురూ - ‘ఏం మనుషులు అయ్యా’ అంటూ శివాజీ ఆగ్రహం
YSRCP Nominated posts: వైసీపీలో త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ-ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహం
తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్
Mansion 24 Web Series : 'మ్యాన్షన్ 24'కి వెళ్లిన వరలక్ష్మి ప్రాణాలతో బయట పడిందా? ఓంకార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?
షారుఖ్ Vs ప్రభాస్ - సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!
/body>