Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ వేదికపై మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్, ఇంట్లో పాటల ఆటలు
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌కు ప్రతి ఆదివారం ఒక అతిధి వస్తారు, ఈసారి దేవి శ్రీ ప్రసాద్ వచ్చారు.
Bigg Boss 6 Telugu: సన్ డే... ఫన్ డే వచ్చేసింది. ఈ రోజు మొత్తం ఆటలు పాటలతో నిండిపోతుంది. అలాగే ఒక ఎలిమినేషన్ కూడా. నేటి ఎపిసోడ్ కు అతిధిగా మ్యూజిక్ మాంత్రికుడు దేవి శ్రీ ప్రసాద్ వచ్చారు. వేదికపైనే అందమైన భామలు పాట పాడి వినిపించారు. ఆయన పాడుతుంటే నాగార్జున కొంతమంది భామలతో డ్యాన్సు చేశారు. తరువాత ఇంటి సభ్యులకు దేవిశ్రీని చూపించారు. ‘ఆ పాటను రియల్ లైఫ్ లో ఎవరి కోసమైనా పాడారా?’ అని అడిగారు నాగార్జున. అయితే దేవి శ్రీ ‘మనసులో పాడుకున్నాను’ అన్నారు.
హౌస్‌లో ఆటలు...
మిమిక్రీ ఆర్టిస్టు సూర్యను దేవిశ్రీలా మాట్లాడమని అడిగారు నాగార్జున. సూర్య మిమిక్రీ చేశాడు. తరువాత అల్లు అర్జున్ లా మాట్లాడి మెప్పించాడు. తరువాత బొమ్మ గీసి ఆ పాటేంటో చెప్పే గేమ్ పెట్టారు. కొంతమంది ఫన్నీగా బొమ్మలు గీసి నవ్వించారు. మధ్యలో బాలాదిత్య లేచి దేవి శ్రీ ‘చెన్నై స్కూల్లో నేను మీ జూనియర్ ని సర్’ అన్నాడు. దానికి నాగార్జున జూనియరా? అంటూ ఆశ్చర్యపడేలా ముఖం పెట్టారు. ఆ స్కూల్లో అందరూ ఇంతేనా అంటూ జోకులేశారు.
గీతూ మాటతీరు మారదా?
గీతూకి ఒక పాట ఇచ్చారు. అది బొమ్మ వేయడం ద్వారా టీమ్ మెంబర్లకు చెప్పమన్నారు. తనకు వచ్చిన పాట చూసి ఏంటిదే? అంటూ తన స్టైల్లో మాట్లాడింది గీతూ. నాగార్జున ‘వారికి చూపించవద్దు’ అనగానే, ‘చూపించలేదు సామీ’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చుకుంటూ వెళ్లింది. దీంతో ప్రోమో ముగిసింది. గీతూ ఎవరితోనైనా ఇలాగే మాట్లాడుతుంది. ఏమైనా అంటే నేనింతే అంటుంది.
చంటి ఎలిమినేషన్
ఈ రోజు చంటి ఇంటి నుంచి బయటికి వెళ్తున్నట్టు కచ్చితమైన సమాచారం తెలుస్తోంది. చంటి తనకు తానుగా బయటికి వచ్చేశాడని, అంటే సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడని టాక్ నడుస్తోంది. నాగార్జున పర్మిషన్ తోనే ఇలా చేశారని తెలుస్తోంది. ఆయన ఇంట్లో ఇమడలేక చాలా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గీతూకు ఆయనకు అయిన గొడవ చినికి చినికి గాలివానగా మారాయి. మొదటి వారం నుంచి వారిద్దరికీ పడడం లేదు. గీతూ కక్ష కట్టి మరీ ఆయనపై చెడు ప్రచారాలు చేసింది. ఒక వారం గీతూ - చంటి గొడవే హైలైట్ అయింది. ఆ సమయంలో చంటి చాలా అప్ సెట్ అయినట్టు కనిపించాడు. గీతూ ప్రవర్తనతో ఆయన చాలా ఇబ్బంది పడినట్టు షో చూసే వారికి ఎవరికైనా అర్థం అవుతుంది. అయితే ఇలా మధ్యలో వచ్చేయడం వల్ల చంటికి ఏమైనా ఆర్ధికంగా నష్టం జరిగే అవకాశం ఉందో లేదో తరువాత ఆయనిచ్చి ఇంటర్య్వూలలో తెలియాలి.
Also read: చలాకీ చంటి షాకింగ్ నిర్ణయం, సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చేసిన కమెడియన్?
Also read: ఇంట్లో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? ఇనయా కంప్లీట్ ప్యాకేజ్ అన్న నాగార్జున