Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? ఇనయా కంప్లీట్ ప్యాకేజ్ అన్న నాగార్జున
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్ లో ఫన్ వీకెండ్ మొదలైపోయింది.
Bigg Boss 6 Telugu: ఈ వారం అంతా ఇల్లు గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగిపోయింది. రెండు మూడు రోజులు బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు చేయడంతో అంతా ఎంటర్టైన్మెంట్ తో నిండిపోయింది. దీంతో వీకెండ్లో నాగార్జున మాట్లాడేందుకు, నిలదీసేందుకు హాట్ టాపిక్స్ ఏమీ లేవు. దీంతో శనివారం ఫన్ డేగా చేసేశారు నాగార్జున. ఇక విడుదలైన ప్రోమోలో ఏముందంటే...
ఇంట్లో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనే గేమ్ పెట్టారు. తాను ఇద్దరి పేర్లు పిలుస్తానని, వారిద్దరిలో ఎవరు హిట్, ఎవరు ఫ్లాప్ అనేది వాళ్లే తేల్చుకోవాలని చెప్పారు నాగార్జున. మొదట ఇనయా, సూర్యను పిలిచారు. ఇనయా మాత్రం తెగ సిగ్గుపడిపోతూ కనిపించింది. ఇనయా తన గురించి మాట్లాడుతూ ‘హిట్ అంటే అన్నీ కలిపిన ఒక ప్యాకేజే హిట్ అవుతుంది’ అంది. దానికి నాగార్జున ఇనయా కంప్లీట్ ప్యాకేజ్ అని నేను ఒప్పుకుంటున్నా అని చెప్పారు. దీంతో ఇనయా చాలా ఆనందపడింది. ఇనయా క్రష్ టాపిక్ మాట్లాడారు నాగార్జున. దీంతో ఇక ఇనయా సిగ్గుల మొగ్గ అయింది. ఈ రోజు ఎపిసోడో ఇనయాకు మంచి ప్రాధాన్యతనే ఇచ్చారు నాగార్జున.
సత్యభామ ఇష్టం..
తరువాత నాగార్జున అర్జున్ కళ్యాణ్, వాసంతిని పిలిచారు. వారిద్దరి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ టాపిక్ పై సెటైర్లు వేశారు నాగ్. వాసంతి మాత్రం నాకేమీ తెలియదు సర్ అంది. ఇక అర్జున్ ను ఉద్దేశించి ‘నీకు పురాణాలలో సత్యభామ అంటే ఇష్టమని మాకు తెలుసు’ అన్నారు. మధ్యలో శ్రీ సత్య దూరుతూ వచ్చింది.
గీతూ - ఆదిరెడ్డి...
నాగార్జున గీతూ, ఆదిరెడ్డి మధ్య ఇదే పోటీ పెట్టారు. దీంతో గీతూ తాను ఎంటర్టైన్మెంట్ ఇస్తానని చెప్పాడు. కానీ ఆదిరెడ్డి ఎంటర్టైన్మెంట్ తో పనేముంది, ఇది బిగ్ బాస్ షో అన్నాడు. దానికి గీతూ ‘బిగ్ బాస్ 6, ఎంటర్టైన్మెంట్ కు అడ్డా ఫిక్స్’ అని అంది. దీనికి ఆదిరెడ్డి ఏం సమాధానం చెప్పాడో ఎపిసోడ్లో చూడాలి.
చంటి ఫ్లాప్
ఇక చంటి - సుదీపలను పిలిచారు నాగార్జున. సుదీప తాను అందరిని కలుపుకుని, ఎవరేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించానని, చంటి మాత్రం తెలుసుకుని అక్కడే ఆగిపోయారని అంది. దానికి చంటి తాను హిట్ అని చెప్పుకోవడం లేదు అన్నారు. దానికి నాగార్జున మీరు ఫ్లాప్ అని ఒప్పుకుంటున్నారా? అంటే... అవును అన్నాడు చంటి. చూసే ప్రేక్షకులకు మీరు ఫ్లాప్ అని మీరే చెబుతున్నారా అని రెట్టించి అడిగారు నాగార్జున. అప్పుడు కూడా చంటి అవుననే అన్నారు.
ఈ వారం నామినేషన్లో ఉన్న సభ్యులు...
1. చంటి
2. బాలాదిత్య
3. మెరీనా
4. ఆదిరెడ్డి
5. వాసంతి
6. ఫైమా
7. అర్జున్
8. ఇనయా
Also read: కొత్త కెప్టెన్ రేవంత్, నీ వెనుక నేను తిరగాలా అంటూ అర్జున్‌తో వాసంతి ముచ్చట్లు
Also read: కార్తీక దీపం కీర్తి నాలుగేళ్లు పెంచుకున్న పాప ఎలా చనిపోయింది?