News
News
X

Bigg Boss 6 Telugu Episode 34: కొత్త కెప్టెన్ రేవంత్, నీ వెనుక నేను తిరగాలా అంటూ అర్జున్‌తో వాసంతి ముచ్చట్లు

Bigg Boss 6 Telugu: రేవంత్ కెప్టెన్ అయిపోయాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ కెప్టెన్ అయ్యక ఎలా ప్రవర్తిస్తాడో చూడాలి.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: ఎపిసోడ్ మొదలవ్వగానే వాసంతి, అర్జున్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వాసంతి తనకు లవర్స్‌ని కలపడం ఇష్టమని చెప్పింది. దానికి అర్జున్ ‘అయితే నువ్వు వాడితో కాక వీడితో పెట్టు అని చెప్పి ఉంటే నేను వచ్చేవాణ్ని’ అన్నాడు. దీని వెనుక నేపథ్యం ఏమిటో అర్థం కాలేదు. దానికి వాసంతి ‘నువ్వు ఆమె వెనుక తిరుగుతుంటే, నేను వెనుక తిరగలా’ అని అడిగింది. దానికి అర్జున్ ‘మంచి కంటెంట్ వచ్చి ఉండేది కదా, నేను ఒకమ్మాయి వెనుక తిరుగుతున్నా అన్న నింద నాకు వచ్చి ఉండేది కాదు’ అన్నాడు. దానికి వాసంతి ‘ట్రయాంగిల్ అవుతుందా నీకు, అప్పుడు నేను చాలా లో ఫీలింగ్ కు లోనవుతా’ అంది. దాంతో ఆ సీన్ కట్ అయిపోయింది. 

ఉదయం సూపర్ మచ్చి పాటతో నిద్ర లేపాడు బిగ్ బాస్. కెప్టెన్సీ పోటీలో రెండో లెవెల్‌కు అర్హత సాధించిన ముగ్గురు రేవంత్, బాలాదిత్య, సూర్య. వీరు ముగ్గురిలో ఒకరికి బంతిపూల దండ వేసి తమ మద్దతును ప్రకటించమన్నారు బిగ్ బాస్. ఎవరికి అర్హత ఉందో వారికి తమ దండను వేయాలని ఇంటి సభ్యులకు చెప్పాడు బిగ్‌బాస్.  మొదట గీతూ దండ అందుకుంది.  అక్కడ కూడా యాటిట్యూడ్ చూపించింది. దండ పట్టుకుని ఇటూ అటూ తిరుగుతూ కనిపించింది. చివరికి సూర్యకు దండ వేసింది. రాజశేఖర్ దండను బాలాదిత్యకు వేశాడు.  మొదట్లో ఎవరూ రేవంత్ కు సపోర్ట్ చేయలేదు. చివరలో వరుసగా దండలు రేవంత్ మెడలో పడ్డాయి. 

ఇనయా ఏం చేసిందంటే...
ఇనయాకు సూర్య అంటే ఎంతింష్టమో చెప్పేసింది. కానీ కెప్టెన్ గా మాత్రం రేవంత్‌కు ఓటేసింది. రేవంత్ ను ఎక్కువ మంది కార్నర్ చేసినట్టు అనిపిస్తోందని అందుకే ఆయనకు ఓటేశానని చెప్పింది. రేవంత్‌కు దండ వేశాక వెళ్లి సూర్యను హగ్ చేసుకుంది. రేవంత్ ఫ్రెండ్ శ్రీ సత్య బాలాదిత్యకు దండ వేసింది. అర్జున్, శ్రీహాన్, మెరీనా, ఆదిరెడ్డి రేవంత్‌కే ఓటేశారు. ఎక్కువ మంది రేవంత్‌కే వేయడంతో ఆయన కెప్టెన్ అయ్యాడు. వాష్రూమ్‌కి వెళ్లాక కాస్త ఎమోషనల్ అయ్యాడు. 

బాలాదిత్య ఫైర్
లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం టగ్ ఆఫ్ వార్ గేమ్ ఇచ్చారు. రెండు టీములుగా విడిపోయారు ఇంటిసభ్యులు. టగ్ ఆఫ్ వార్‌లో అబ్బాయిలే పోటీ పడ్డారు. గట్టిగా పోరాడి తమకు కావాల్సిన వస్తువులను తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టారు. ఈ ఆటలో రేవంత్ సంచాలక్‌గా పనిచేశారు. ఇతనితో చంటి కాసేపు వాదించాడు. చంటితో బాలాదిత్య మాట్లాడడానికి వచ్చాడు. ఆ సమయంలో గీతూ ‘లాయర్ పాయింట్లు మాట్లాడుతున్నాడు’ అంది. ఎందుకంటే ఓ వెబ్ సిరీస్లో బాలాదిత్య లాయర్ గా నటించాడు. దీంతో బాలదిత్యకు కోపం వచ్చేసింది. నువ్వు నా ప్రొఫెషన్‌ను తక్కువ చేస్తున్నావ్ అంటూ గట్టిగా అరిచాడు. కాసేపు గీతూ-బాలాదిత్య వాదించుకున్నారు. కాసేపటి తరువాత గీతూ - ఆదిరెడ్డి రివ్యూలు మొదలుపెట్టారు. 

News Reels

Also read: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Also read: ఎపిసోడ్‌లో హైలైట్ ఫైమానే, అందరినీ నవ్వించింది ఈమె ఒక్కతే, గీతూ ఎప్పటిలాగే ఓవర్ యాక్షన్

Published at : 08 Oct 2022 06:58 AM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Revnath Captain Surya and Inaya

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్