అన్వేషించండి
Advertisement
Bigg Boss6: బిగ్ బాస్ షోలో కామన్ మ్యాన్‌గా ఎంటర్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కోసం సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో మొదలవుతుందని వెల్లడించారు.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కోసం సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో మొదలవుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన చాలా ప్రోమోలు వచ్చాయి. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. గతంలో కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. కొన్నాళ్లకు ఆ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ షో కామన్ మ్యాన్ కనిపించబోతున్నారు.
కామన్ మ్యాన్ సెలెబ్రిటీగా యూట్యూబర్ ఆదిరెడ్డి షోలో ఎంట్రీ ఇవ్వబోతున్నారట. బిగ్ బాస్ రియాలిటీ షోలపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తూ.. నెటిజన్లకు దగ్గరయ్యారు ఆదిరెడ్డి. సరదాగా బిగ్ బాస్ షోలపై విశ్లేషణలతో మొదలైన అతడి ప్రస్థానం ఇప్పుడు అదే షోకి ఎంపికయ్యే వరకు సాగుతుండడం విశేషం. మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆదిరెడ్డి ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు.
ఆదిరెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు. వారిది వ్యవసాయ కుటుంబం. ఆదిరెడ్డి నెల్లూరులో డిగ్రీ చదువుతూ చివరి ఏడాది మానేశారు. అదే ఏడాది వైఎస్సార్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంతో ఆదిరెడ్డి బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ సెలెక్షన్స్ లో ఉద్యోగం కూడా వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరే సమయంలో అతడి తల్లి మరణించింది. దీంతో రెండేళ్లపాటు ఇంటి పట్టునే ఉండిపోయారు ఆదిరెడ్డి. ఆ తరువాత జాబ్ కోసం బెంగుళూరు వెళ్లారు.
అక్కడ ఉద్యోగం చేస్తూనే.. సరదాగా బిగ్ బాస్ షోపై తన విశ్లేషణలను యూట్యూబ్ లో పోస్ట్ చేసేవారు. కౌశల్ పై ఆదిరెడ్డి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటినుంచి అతడి వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. సొంతంగా తన పేరుతో యూట్యూబ్ ఛానెల్ ను మొదలుపెట్టారు. అప్పుడు మొదలైన విశ్లేషణలు బిగ్ బాస్ సీజన్ 5 వరకు కంటిన్యూ చేశారు. అలానే ఓటీటీ షోపై కూడా రివ్యూస్ ఇచ్చారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందట. మరి ఈ అవకాశాన్ని అతడి వినియోగించుకోగలరో లేదో చూడాలి..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
ఆటో
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement