Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయించిన బిగ్‌బాస్, అందరూ ఆట మొదలుపెట్టేశారు
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లో ప్రతిజ్ఞలు, ప్రమాణాలు జరిగాయి.
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 చప్పగా సాగుతుందని ఇప్పటికే ఎన్నో కామెంట్లు వచ్చాయి. దానికి తగ్గట్టే ఇంటి సభ్యులు కూడా ఏ టాస్క్ ఇచ్చినా సరిగా ఆడకుండా ఎప్పుడూ ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపించేవారు. కాసేపు టాస్క్ ఆడి ఎక్కువ సేపు రెస్ట్ తీసుకునేవారు. కొంతమంది మాత్రం ఇంట్లో చురుగ్గా ఉండేవారు. దీంతో బిగ్‌బాస్‌కు కోపం వచ్చింది.ఇంటి సభ్యులకు ఆసక్తి లేకపోతే హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవచ్చని చెప్పారు. అంతేకాదు ఆహారం అందకుండా చేసి టాస్క్ లు పెట్టి ఆడించారు. చివరికి ఇంటి సభ్యుల్లో కాస్త మార్పు కనిపించింది.
ఇక కొత్తగా విడుదలైన ప్రోమోలో ఏముందంటే... ‘ఇప్పటివరకు మీరు చూపించిన నిరుత్సాహం పట్ల పశ్చాత్తాపం పడుతున్నట్టయితే మీ ఆటను ఎలా మార్చుకుంటారో చెప్పి, ఈ షోలో మీనుంచి ఏం ఆశించాలో కూడా చెప్పాల్సి ఉంటుంది’ అని చెప్పారు బిగ్ బాస్. దీంతో అందరూ ప్రమాణాలు చేసి తమ ఆటతీరు గురించి చెప్పారు. తరువాత టాస్క్ వచ్చింది. ఈ టాస్క్ లో మెయిన్ డోర్ నుంచి వచ్చే బొమ్ములను అందుకుని తమ టీమ్‌కు కేటాయించిన ప్రదేశాల్లో పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో అందరూ చాలా కష్టపడినట్టు కనిపించారు. దాదాపు ఈ టాస్క్ ఫిజికల్ అయినట్టే కనిపించింది. ఎంతో ఎఫర్ట్ పెట్టి ఆడినట్టు కనిపించింది.
View this post on Instagram
ఇక శ్రీసత్య నిదానంగా బొమ్మల దగ్గర కూర్చుని అందరికీ ఆజ్ఞలు ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రాపర్టీ డామేజ్ చేయద్దు, డోర్ తోయద్దు అంటూ అరవడం మొదలుపెట్టింది. ఆమె అక్కడికి వెళ్లి ఆడితే తెలిసేది కష్టం, కూర్చుని ఎన్ని కబుర్లయినా చెబుతుంది అని కామెంట్లు పెడుతున్నారు ప్రేక్షకులు. ఈ సీజన్లో ఇంటి సభ్యులు గట్టిగా ఆడిన టాస్క్ ఇదేనేమో.
ఇక వారంలో మరో మూడు రోజుల్లో ఈ ఇంటిని వదిలి ఒకరు వెళ్లబోతున్నారు. అది వాసంతి లేదా మెరీనా అయ్యే అవకాశం ఉందని అంచనా.
Also read: శ్రీహాన్ బర్త్ డేకు ఇనయా హడావుడి, ఇంట్లో అర్హత కోసం పోటీ పెట్టిన బిగ్‌బాస్