అన్వేషించండి

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

బుల్లితెరపై బిగ్ బాస్ షోకు మంచి క్రేజ్ ఉంది. మనిషికి ఉన్న ఎమోషన్స్‌ మీద నడిచే షో కావడం, పక్క ఇంట్లో జరిగే గొడవల మీద ఎలాగూ జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుందని అందరికీ తెలిసిందే.

‘బిగ్ బాస్’ ఈ షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ‘బిగ్ బ్రదర్’ పేరుతో విదేశాలకే పరిమితమైన ఈ క్రేజీ షో.. ‘బిగ్ బాస్’గా ఇండియాలోకి అడుగుపెట్టింది. దానికి మంచి ఆధారణ లభించడంతో దక్షిణాది భాషల్లో కూడా ఈ షోను ప్రారంభించారు. ముఖ్యంగా తెలుగులో ఈ షోకు ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది. టీఆర్పీ రేటింగ్స్‌లో దూసుకెళ్లింది. అయితే, అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ షోకు రాను రాను రేటింగ్ పడిపోతూ వస్తోంది. ఆరో సీజన్‌కు వచ్చిన రేటింగ్స్ చూస్తేనే అది క్లియర్ గా అర్థమవుతుంది.

మొదట్లో బిగ్ బాస్ వస్తుందంటే చాలు.. పనులు పక్కనపెట్టి మరీ టీవీల ముందు కూర్చొనేవారు ప్రేక్షకులు. కానీ, ఇప్పుడు అలా లేదు. జనాల అభిరుచి మారుతుందో లేదా ఆ షోకు ఎంపిక చేసిన కంటెస్టెంట్లు నచ్చకో తెలీదు గానీ ‘బిగ్ బాస్’కు క్రమేనా దూరమవుతున్నట్లు అర్థమవుతోంది. తెలుగు బిగ్ బాస్ లో మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. ఈ సీజన్ కు మంచి హైప్ వచ్చింది. తర్వాత రెండో సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని చేశారు. ఇక తర్వాత నాలుగు సీజన్ లూ కింగ్ నాగార్జున నడిపించారు. ఈ ఆరు సీజన్ లలో శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, వీజే సన్నీ, సింగర్ రేవంత్ లు వరుసగా టైటిల్స్ గెలుచుకున్నారు. ఈ ఆరు సీజన్లలో విన్నింగ్ ఎపిసోడ్ లకు కూడా రకరకాలుగా రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. వివిధ మీడియా, సామాజిక మాధ్యమాల సమాచారం ప్రకారం...

⦿ శివ బాలాజీ విన్నర్‌గా నిలిచిన ‘బిగ్ బాస్’ మొదటి సీజన్‌కు 14.13 రేటింగ్ వచ్చింది.

⦿ కౌశల్ విజేతగా నిలిచిన రెండో సీజన్‌‌కు 15.05 రేటింగ్ వచ్చింది.

⦿ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచిన మూడో సీజన్‌కు 18.29 రేటింగ్ వచ్చింది.

⦿ అభిజిత్ విజేతగా నిలిచిన నాలుగో సీజన్‌కు 19.51 రేటింగ్ వచ్చింది. 

⦿ విజే సన్నీ విజేతగా నిలిచిన ఐదో సీజన్‌కు 16.04 రేటింగ్ వచ్చింది.

⦿ రేవంత్ విజేతగా నిలిచిన ‘బిగ్ బాస్’ సీజన్-6కు మాత్రం దారుణంగా 8.17 రేటింగ్ వచ్చినట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అత్యంత దారుణమైన రేటింగ్స్ సీజన్-6కు వచ్చినట్లే. ‘బిగ్ బాస్’ ఆరో సీజన్‌పై ముందు నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆరో సీజన్ లో ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా సరిగ్గా ఆడలేదనే విమర్శలు వచ్చాయి. ఉన్న వాళ్ళల్లో కొంచెం సింగర్ రేవంత్ పర్లేదనిపించాడు. అతనే విన్నర్ అని ముందే ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. అందుకే ఈ ఆరో సీజన్ విన్నింగ్ ఎపిసోడ్‌ను ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేనట్లు తెలుస్తోంది. 

‘బిగ్ బాస్’ సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలేమిటీ? 

ఈ ఒక్క రేటింగ్‌తో ‘బిగ్ బాస్’ డౌన్ అయ్యిందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సీజన్-6 తక్కువ మంది చూడటానికి చాలా కారణాలున్నాయి. సీజన్-6 మొదలవ్వడానికి ముందే ఓటీటీలో ‘బిగ్ బాస్ - నాన్ స్టాప్’ వచ్చింది. అది అలా ముగియగానే.. ‘సీజన్-6’ టీవీలో మొదలైంది. పైగా, ఈ సీజన్‌కు ఎంపిక చేసిన కంటెస్టెంట్లు కూడా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారే. కేవలం సీరియల్ నటీనటులు తప్పా.. అంతా కొత్త ముఖాలే. అలాగే, కంటెస్టెంట్లు కూడా ప్రజలకు కావాల్సిన కంటెంట్ అందించలేకపోయారు. గత సీజన్లలో.. ముఖ్యంగా సీజన్-4లో అఖిల్-మోనాల్-అభిజీత్ మధ్య సాగిన నాటకీయ పరిణమాలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. సీజన్-5లో షన్ను-సిరి మధ్య సాగిన ప్రేమాయణం కూడా వర్కవుట్ అయ్యింది. అందుకే, ఆ సీజన్‌కు అంత టీఆర్పీ వచ్చింది. అయితే, సీజన్-6లో అలాంటివి ఏవీ లేవు. ఈ నేపథ్యంలో ‘బిగ్ బాస్’ నిర్వాహకులు దీన్ని సవాలుగా తీసుకుని.. వచ్చే సీజన్‌లోనైనా మంచి కంటెస్టెంట్‌తో అలరిస్తారని ఆశిద్దాం. 

Read Also: ఇండియాపై పాక్ కుట్ర - ఆ హీరోయిన్లతో హనీ ట్రాపింగ్, నటి సజల్ అలీ పాత్రేంటి?

ఇదీ ‘బిగ్ బాస్’ కాన్సెప్ట్: వివిధ రంగాల నుంచి ప్రముఖ వ్యక్తులను తీసుకొచ్చి.. వంద రోజుల పాటు వారిని ప్రపంచానికి దూరంగా ఉంచితే వాళ్లు ఏం చేస్తారు. వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అని ప్రజలకు తెలియజేయాలన్నదే ఈ షో కాన్సెప్ట్. ఈ షో లో కంటెస్టెంట్ లు ఎవరికి నచ్చినట్టు వారు ఉంటారు. ప్రేక్షకులు కూడా నచ్చిన వారికే ఓటేస్తారు. నచ్చని వారిని బయటకు ఎలిమినేషన్ ద్వారా పంపిస్తారు. చివరికి మిగిలే ఐదుగురిలో ఒకరిని విన్నర్‌గా ప్రకటిస్తారు. రెండో వ్యక్తిని రన్నరప్‌గా నిర్ణయిస్తారు. అయితే, కేవలం విజేతకు మాత్రమే ట్రోపీ, నగదు గెలుచుకొనే అవకాశం ఉంటుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Ram Charan: ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్
ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
K Srinath IAS: పోర్టర్‌గా పని చేసి ఐఏఎస్ సాధించాడు - ఈ శ్రీనాథ్ పట్టుదల ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే !
పోర్టర్‌గా పని చేసి ఐఏఎస్ సాధించాడు - ఈ శ్రీనాథ్ పట్టుదల ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే !
Embed widget