శివాజీ శివతాండవం - జిమ్‌లో వెయిట్స్ విసిరేస్తూ రచ్చ రచ్చ, ప్రిన్స్‌కు ‘తెలుగు’ శిక్ష!
శివాజీకి కోపం వచ్చింది. ఈ సారి దాన్ని కంట్రోల్ చేసుకోలేక. జిమ్‌లోని వెయిట్స్‌ను విసిరేశాడు.
‘బిగ్ బాస్’ హౌస్‌లో ప్రస్తుతం మాయాస్త్ర టాస్క్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అందులో విజేతగా నిలిచే సభ్యులకు పవర్ అస్త్ర లభిస్తుంది. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’.. కంటెస్టెంట్లకు పలు టాస్కులు ఇస్తున్నాడు. మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో రణధీర టీమ్ కీను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ కీను కొట్టేసేందుకు మహాబలి టీమ్ చాలా ప్లాన్లు వేస్తోంది. వారికి ఆ కీ చిక్కకుండా ఉండేందుకు శివాజీ దాన్ని బెల్టులో చుట్టుకుని నడుముకు పెట్టుకున్నాడు. మరోవైపు శుభశ్రీ, దామినీలు ఏకంగా సందీప్ సంపాదించుకున్న పవర్ అస్త్రా పైనే కన్నేశారు. సందీప్ గదిలో లేని సమయంలో శుభశ్రీ దాన్ని కొట్టేసి.. Bigg Bossకు చెప్పింది.
తాజాగా రిలీజైన మరో ప్రోమోలో.. ‘బిగ్ బాస్’ ప్రిన్స్ యావర్‌కు పనిష్మెంట్ ఇచ్చాడు. తెలుగులో కాకుండా ఇంగ్లీష్, హిందీలో మాట్లాడుతున్నాడనే కారణంతో.. బిగ్ బాస్ ఆపమనేవరకు తెలుగులో క్షమాపణలు చెబుతూనే ఉండాలని తెలిపాడు. దీంతో ప్రిన్స్ గార్డెన్ ఏరియాలో ఆ టాస్క్ మొదలుపెట్టాడు. అయితే, కంటెస్టెంట్స్ ప్రిన్స్‌ను డిస్ట్రబ్ చేయడానికి ప్రయత్నించారు. ముందుగా టేస్టీ తేజా.. ప్రిన్స్‌ను టచ్ చేస్తూ అంతరాయం కలిగించే ప్రయత్నం చేశాడు. దీంతో శివాజీ.. ప్రిన్స్‌ను డిస్ట్రబ్ చేయొద్దని హౌస్‌మేట్స్‌కు చెప్పాడు. అయితే, శివాజీ మాటలను ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కొక్కరిగా వచ్చి ప్రిన్స్‌కు అంతరాయం కలిగించడం మొదలుపెట్టారు.
కంటెస్టెంట్లు తన మాట వినకుండా ప్రిన్స్‌ను డిస్ట్రబ్ చేస్తున్నారనే కోపంతో.. శివాజీ సైకోలా ఊగిపోయాడు. జిమ్ ఏరియాలో ఉన్న వెయిట్స్‌ను పట్టుకుని గార్డెన్‌లోకి విసిరి పారేశాడు. దీంతో కంటెస్టెంట్లు షాకయ్యారు. అయితే, ఇది ప్రేక్షకులకు మాత్రం ఫన్నీగానే కనిపించవచ్చు. ముఖ్యంగా మీమర్స్‌కు ఈ రోజు శివాజీ ఫుల్ మీల్స్ ఇస్తున్నట్లే.
మాయాస్త్రం కోసం పోటాపోటీ
బిగ్ బాస్ సీజన్ 7లోని మొదటి వారంలో పవర్ అస్త్రా అనే ఒక అస్త్రాన్ని సొంతం చేసుకున్నాడు సందీప్. దీంతో తను బిగ్ బాస్ హౌజ్‌లో పర్మనెంట్ హౌజ్‌మేట్ అయిపోయాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా మాయాస్త్రం కోసం పోటీపడాలి అంటూ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా స్టైల్‌లో ఒక పిట్టకథను అందరికీ వినిపించారు బిగ్ బాస్. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌లాగా విడిపోయారు. ఆ టీమ్స్‌కు రణధీర, మహాబలి అని పేర్లు పెట్టారు. రణధీర టీమ్‌లో అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, శివాజీ, షకీలా ఉండగా.. మహాబలి టీమ్‌లో టేస్టీ తేజ, దామిని, శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. సందీప్.. సంచాలకులు వ్యవహరించాడు. రణధీర, మహాబలి టీమ్స్ మధ్య జరిగిన మొదటి ఛాలెంజ్.. ‘పుల్ రాజా పుల్’. మూడు సార్లు జరిగిన ఈ ఛాలెంజ్‌లో రణధీర టీం విజేతలుగా నిలిచి మాయా అస్త్రానికి సంబంధించిన తాళం చెవిని సొంతం చేసుకున్నారు. బుధవారం కూడా మరో తాళం కోసం టాస్క్ ఇచ్చాడు. మరి, ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.