అన్వేషించండి

Shivaji : ఏడ్చేసిన శివాజీ - ఇంత పెయిన్ ఎప్పుడూ లేదు, మీ ఇద్దరి కోసమే ఉంటున్నా అంటూ కన్నీళ్లు

‘బిగ్ బాస్’ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్నా శివాజీ భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలను తలచుకుంటూ.. కేవలం తాను యావర్, పల్లవి ప్రశాంత్ కోసమే హౌస్‌లో ఉంటున్నా అని తెలిపింది.

‘బిగ్ బాస్’ సీజన్ 7 ( Bigg Boss Telugu Season 7)లో నామినేషన్ల పర్వం కొనసాగింది. దీంతో హౌస్‌మేట్స్ అంతా.. కాస్త రిలక్స్ అవ్వి కబుర్లు చెప్పుకున్నారు. నామినేషన్స్ గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా శోభాశెట్టి.. నామినేషన్స్‌లో భోలే తనని అన్న మాటలను తలచుకుంది. బయట ఎంతో పలుకుబడి గౌరవంగా ఉండేదాన్ని.. తనని ఈ షోలో ఎవడో తెలియని మనిషి.. నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు.. మెంటల్ హాస్పిటల్‌లో ఉండాలి అనేసరికి నాకు చాలా బాధ అనిపించిందని తేజాతో తెలిపింది. ఆ తర్వాత శివాజీ.. తన బిడ్డను తలచుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 

యావర్‌ను హత్తుకుని ఏడ్చేసిన శివాజీ

‘‘రాత్రి.. పడుకున్నాను కదా. ఫస్ట్ టైమ్ అజీబ్ ఫీలింగ్ వచ్చింది’’ అని శివాజీ అన్నారు. దీంతో యావర్ కూడా నాకు కూడా భయమేస్తోందని అన్నాడు. శివాజీ స్పందిస్తూ.. ‘‘నువ్వు ఎందుకురా భయపడతావు. నువ్వు ఒంటరివి.. ప్రోపర్ స్టైల్, ప్రొపర్ వేలో ఉండు’’ అని అన్నాడు. ‘‘నేను పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నా. కేవలం మీ ఇద్దరి కోసమే నేను ఇంకా బిగ్ బాస్ హౌస్‌లో ఉంటున్నారా’’ అంటూ శివాజీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది గమనించిన వెంటనే యావర్ ఆయన్ని హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ‘‘మీ కోసమే ఉంటున్నారా.. నాతో కావడం లేదు. నేను చాలా స్ట్రాంగ్, లైఫ్‌లో ఇంత పెయిన్ నాకు ఎప్పుడూ లేదు. నేను బాబుగారిని ఎప్పుడో అడిగేస్తా బయటకు వెళ్లిపోతానని. కానీ నీ కోసమే ఉంటున్నా’’ అని అన్నారు. ఆ తర్వాత శివాజీ అమర్‌దీప్‌ను సరదాగా ఆటపడించాడు. నామినేషన్స్‌లో అశ్వినీని అలా భయపెట్టేశావేంటీ.. బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. ఒక కంటెస్టెంట్ నామినేషన్ వేయకుండా వేరొకరికి వేసిందని శివాజీ అన్నాడు. 

ఒకే మాటకు రెండు అర్థాలు వచ్చేలా శివాజీ మాట్లాడతాడు: అర్జున్

శివాజీని నామినేట్ చేసిన గౌతమ్‌‌కు అర్జున్ హితబోధ చేశాడు. ‘‘శివాజీ ఏదైనా అన్నా.. అప్పుడే క్లారిటీ తీసుకోవాలి. ఆయన అన్న మాటకు మీనింగ్ అడిగి.. అర్థం చేసుకోవాలి. ఆయన ఎక్స్‌పియరెన్స్ కలిగిన వ్యక్తి.. ఒకే మాటకు రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడతాడు’’ అని అర్జున్ అన్నాడు. ఆ తర్వాత.. పూజా మూర్తి, టేస్టీ తేజా మధ్య పనిష్మెంట్ గురించి వాగ్వాదం నెలకొంది. మరోవైపు గౌతమ్ తల్లి లెటర్‌ను చూస్తూ.. తాను ఒంటరిగా పోరాడుతానని.. హౌస్‌మేట్స్ అవమానాలను, వెక్కిరింతలను తట్టుకొనే శక్తిని పంపాలని మాట్లాడాడు.

గ్రహాంతరవాసిని మెప్పిస్తే కెప్టెన్సీ

కెప్టెన్సీ కోసం ‘బిగ్ బాస్’ ఓ టాస్క్ ఇచ్చాడు. ఒక యూఎఫ్‌వో గులాబీపురం, జిలేబీపురం మధ్యలో క్రాష్ అయ్యిందని.. ఎవరైతే గ్రహాంతరవాసులను మెప్పిస్తారో వారికి ఆ ఊరి నుంచి కెప్టెన్సీ వస్తుందని బిగ్ బాస్ తెలిపాడు. ఈ సందర్భంగా వారితో ఒక స్కిట్ చెయ్యించాడు. హౌస్‌మేట్స్ ఆ పాత్రల్లో జీవించారు. అయితే, అక్కడక్కడ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. 

టాస్కులో భాగంగా రెండు ఊర్లలో ప్రజలుగా హౌస్‌మేట్స్ నటించారు. గులాబీపురం ఊరికి శోభా సర్పంచ్. ఆమె తన భర్త తేజాతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. యావర్ పల్లెటూరి అమ్మాయి కోసం వెతుకుతున్న ఎన్ఆర్ఐ అబ్బాయి. సర్పంచ్‌ను ఇంప్రెస్ చేసేందుకు తెలుగులో మాట్లాడతాడు. ఊర్లో అందరి గాసిప్స్ చేసే టీ కొట్టు ఓనర్ అమర్ దీప్. సర్పంచ్ శోభను ప్రేమిస్తున్న రోడ్ సైడ్ రోమియో గౌతమ్. పూజా ఒక పల్లెటూరి అమ్మాయి. పక్కఊరి అర్జున్ అంటే క్రష్. ప్రియాంక జిలేబీపురం సర్పంచ్. భోలే.. జ్యోతిష్కుడు.. తనతో మాట్లాడేవారితో మాత్రమే మాట్లాడుతాడు. సందీప్.. ఆ ఊరిలో కీళ్లి కొట్టు యజమాని. అర్జున్ గల్లీ గూండా. అశ్వినీ పల్లెటూరి అందమైన అమ్మాయి. ప్రశాంత్ అర్జున్ వెంట తిరిగే కుర్రాడు. రెండూళ్లకు పెద్దమనిషి శివాజీ. 

Also Read: ‘బిగ్ బాస్’ హోస్ట్ అన్ని ఎపిసోడ్స్ చూస్తారా? అసలు విషయం చెప్పేసిన నాగార్జున

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget