Bigg Boss Telugu Season 7 Episode 19: మగాళ్లకు సెన్స్ ఉండాలి, ఆడవాళ్ల ముందు షర్టులు విప్పుతున్నారు: శోభాశెట్టి కామెంట్స్ - గౌతమ్‌కు అన్యాయం?
గురువారం ప్రసారమైన ‘బిగ్ బాస్’ ఎపిసోడ్‌లో రెండు టాస్కులు జరిగాయి. వాటిలో శోభాశెట్టి, ప్రియాంక విజేతలై పవర్ అస్త్ర చివరి టాస్క్‌కు అర్హత సాధించారు.
‘బిగ్ బాస్’ సీజన్-7లో పవర్ అస్త్ర పోటీ వల్ల వాడీ వేడీ వాతావరణం నెలకొంది. పవర్ అస్త్ర కోసం ఎంపికై కంటెస్టెంట్లను టాస్కుల భయం వెంటాడుతోంది. ఇప్పటికే ప్రిన్స్ యావర్ పవర్ అస్త్ర కంటెస్టెంట్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. గురువారం.. శోభాశెట్టి స్పైసీ చికెన్ టాస్క్‌లో అనుకోకుండా విజేతగా నిలిచింది. గౌతమ్‌కు అన్యాయం జరిగిందనే భావన ప్రేక్షకుల్లో నెలకొనేలా ఈ టాస్క్ ఉంది. అయితే, శోభాశెట్టి.. గౌతమ్ మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో ఈ టాస్క్ ఇద్దరికీ కీలకంగా మారింది. అయితే, సందీప్ అనుమానస్పద నిర్ణయం వల్ల గౌతమ్ టాస్క్‌లో ఓటమిని అంగీకరించక తప్పలేదు.
గౌతమ్‌పై శోభాశెట్టి నిప్పులు
పవర్ అస్త్ర కంటెస్టెంట్‌గా శోభాశెట్టి అనర్హురాలని గౌతమ్ బిగ్ బాస్‌కు తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం ఎపిసోడ్‌లో పెద్ద రచ్చే జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్.. తన షర్ట్ విప్పి టాస్కులో తగిలిన గాయాన్ని శోభాశెట్టికి చూపించే ప్రయత్నం చేశాడు. అయితే, శోభాశెట్టి.. తనకు బాడీని చూపించొద్దని చెప్పింది. ఆ తర్వాత గౌతమ్ కసరత్తులపై కామెంట్స్ చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన గౌతమ్ ఆమె ముందే.. వెయిట్స్ ఎత్తుతూ.. రాత్రి పగలు.. నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎత్తుతా.. అంటూ అరిచాడు. ఆ గొడవను శోభాశెట్టి ఇంకా క్యారీ చేస్తోంది.
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో శోభాశెట్టి.. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించింది. శివాజీతో మాట్లాడుతూ.. ఈ ఇంట్లో కొంతమంది మగాళ్లకు కనీసం సెన్స్ ఉందా. ఆడవాళ్ల ముందు షర్టులు విప్పుతున్నారు. నిన్నయితే ఒకరు షర్టు విప్పుతా, ఫ్యాంట్ విప్పుతా అన్నాడు’’ అంటూ కామెంట్లు చేసింది. అయితే, శోభాశెట్టి ఈ విషయాన్ని ప్రస్తావించడాన్ని ఆడియన్స్, మీమర్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.
గౌతమ్‌కు అన్యాయం?
శోభాశెట్టికి ఇచ్చిన స్పైసీ చికెన్ టాస్కులో 27 ఘాటైన పీస్‌లను తినేసింది. దీంతో బిగ్ బాస్.. ఆమె పవర్ అస్త్ర టాస్క్‌కు అనర్హురాలని తెలిపిన పల్లవి ప్రశాంత్, శోభా, గౌతమ్‌లు శోభాశెట్టి తరహాలోనే చికెన్ పీస్‌లను తినాలంటూ టాస్క్ ఇచ్చాడు. ముగ్గురిలో ఎవరైతే శోభా కంటే ఒకటి ఎక్కువగా 28 చికెన్ పీస్‌లు ఫస్ట్ తింటారో.. వారు పవర్ అస్త్ర కంటెస్టెంట్‌గా ఎంపికవుతారని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో గౌతమ్ అందరి కంటే ముందు 28 చికెన్ పీస్‌లు తినేశాడు. అయితే, సంచాలకుడిలా వ్యవహరించిన సందీప్.. సరైన నిర్ణయం చెప్పలేదనే సందేహం ప్రేక్షకులకు రావచ్చు. అలాగే హౌస్‌మేట్స్‌కు కూడా సందేహం ఉన్నా.. సంచాలకుడి నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి.. శోభాశెట్టిని విజేతగా ప్రకటించాడు బిగ్ బాస్. అయితే, శోభాశెట్టి చాలాసేపు ఆ 27 చికెన్ పీస్‌లు తిన్నాది. పైగా మధ్య మధ్యలో ఏడుస్తూ.. సెంటిమెంట్ పండించింది. అవే దాదాపు అన్నే పీస్‌లను వేగంగా తిన్న శోభాశెట్టి మాత్రం చాలా కూల్‌గా కనిపించింది. ఘాటును భరిస్తూనే టాస్క్ కంప్లీట్ చేసింది. పల్లవి ప్రశాంత్ కూడా వేగంగానే చికెన్ పీస్‌లను ఖాళీ చేశాడు. వారి కంటే ముందు గౌతమ్ టాస్క్‌ను పూర్తి చేసినా.. చాలా చిన్న రీజన్‌తో ఫలితం లేకుండాపోయింది.
జుట్టు కత్తిరించుకున్న ప్రియాంక
అమర్ దీప్, ప్రియాంకల విషయానికి వస్తే.. జుట్టును త్యాగం చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పవర్ అస్త్రకు తాము అర్హులమని భావిస్తే.. జుట్టు కత్తిరించుకోవాలని మెలిక పెట్టాడు. దీని ప్రకారం ప్రియాంక చెవుల వరకు జుట్టును కత్తిరించుకోవాలి. ఇక అమర్ అయితే దాదాపు గుండు చెయ్యించుకోవాలి. ట్రిమ్మర్‌తో 3 మిల్లీ మీటర్ల వరకు మాత్రమే జుట్టు ఉండేలా జుట్టును కత్తిరించుకోవాలి. దీంతో ప్రియాంక తాను అందుకే సిద్ధమేనని చెప్పేసింది. అమర్ కూడా వెనుకడుగు వేయడంతో ప్రియాంక తన జుట్టును కత్తిరించుకుంది. పవర్ అస్త్ర పోటీకి కంటెస్టెంట్‌గా అర్హత సాధించింది. శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, ప్రియాంక పవర్ అస్త్ర కోసం పోటీ పడనున్నారు. మరి, వీరిలో ఎవరు పవర్ అస్త్రాను సొంతం చేసుకుంటారో చూడాలి.
Also Read: ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ‘బిగ్ బాస్’ రతికపై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్?