బిగ్ బాస్ హౌస్‌లో ‘బాహుబలి’ - కట్టప్ప ఎవరు? భల్లాలదేవ ఎవరు?
‘బిగ్ బాస్’ సీజన్ 7లో హోస్ట్ నాగార్జున ఈ రోజు కంటెస్టెంట్లకు ‘బాహుబలి’ టాస్క్ ఇచ్చారు. మరి, వారిలో ఎవరు భల్లాలదేవ? ఎవరు కట్టప్ప?
‘బిగ్ బాస్’ హౌస్‌లో ఆదివారం ప్రసారం కానున్న 15వ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున.. హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరనేది ఆదివారం రాత్రి ప్రకటించనున్నారు. అయితే, షకీలా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోనుందనే సమాచారం బయటకు వచ్చింది. తాజా ప్రోమో ప్రకారం.. నాగ్ హౌస్ మేట్స్‌లో ‘బాహుబలి’ టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో బాహుబలి ఎవరు? భల్లాలదేవ ఎవరో చెప్పాలని కంటెస్టెంట్లను అడిగారు.
ముందుగా టేస్టీ తేజ.. శివాజీని భల్లాలదేవ అని, గౌతమ్ కట్టప్ప అని పేర్కొన్నాడు. ఆ తర్వాత దామినీ మాట్లాడుతూ.. హౌస్‌లో చాలామంది కట్టప్పలు ఉన్నారని తెలిపింది. ఆ తర్వాత ప్రియాంక.. శివాజీని కట్టప్పగా, సందీప్‌ను భల్లాలదేవుడిగా పేర్కొంది. షకీలా.. పల్లవి ప్రశాంత్‌ను భల్లాలదేవుడిగా, ప్రిన్స్‌ను కట్టప్పగా పేర్కొంది. చివరిగా హౌస్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ పేరు చెప్పారు నాగ్.
షకీలా ఔట్?
బిగ్ బాస్ హౌస్ నుంచి షకీలా బయటకు వెళ్లినట్లు సమాచారం. దీంతో తక్కువ ఓట్లు రావచ్చని భావిస్తున్న ప్రిన్స్ యావర్ సేవ్ అయినట్లే. ఈసారి వచ్చే టాస్కుల్లో పవర్ అస్త్రను సాధించికపోయినట్లయితే ప్రిన్స్ మళ్లీ నామినేషన్స్ టెన్షన్ ఎదుర్కోవల్సిందే. ఈ వారం అనుదీప్, ప్రశాంత్, షకిలా, టేస్టీ తేజ, గౌతమ్, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, రతికలు నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వారిలో అమర్ దీప్ సేవ్ అయ్యాడు.
ఈ వారం మరో ఇద్దరు కంటెస్టెంట్లకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
ఈ వారం మరో ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అర్జున్ అంబటి, నటి సురేఖా వాణి కూతురు సుప్రిత హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. సీరియల్స్ చూసే ప్రేక్షకులకు అర్జున్ సుపరిచితుడే. అలాగే, సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి సుప్రిత గురించి పరిచయం అక్కర్లేదు. యూత్‌లో ఆమెకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. సురేఖా వాణి కూతురులాగా కంటే ముందు తను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నెటిజన్లకు పరిచయం అయ్యింది. డబ్‌స్మాష్, రీల్స్ చేస్తూ ఫేమస్ అయినవారిలో సుప్రిత కూడా ఒకరు. తను మాత్రమే కాకుండా తన తల్లి సురేఖా వాణితో కూడా వీడియోలు చేయిస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంది సుప్రిత. మరి బిగ్ బాస్‌లో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.
గౌతమ్ చొక్క విప్పించిన నాగార్జున
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో నాగార్జున కింగ్ మీటర్ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రిన్స్ యావర్‌కు కూడా గ్రీన్ ఇచ్చారు నాగ్. బాగా ఆడిన తర్వాత పోటీదారుడివి కాకపోతే బాధ ఉంటుంది. ఆవేశపడుతూ అరవొద్దు అని చెప్పారు నాగ్. ‘‘ఆటలో రాజకీయాలు సహజం. అన్యాయానికి అరిస్తే లాభం ఉండదు’’ అని సూచించారు. ‘‘బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు ఒక్కటే కాదు.. కంటెస్టెంట్లను కూడా మెప్పించాలి.. అప్పుడే దేనికైనా అర్హులు’’ అని యావర్‌కు చెప్పారు. ప్రిన్స్ స్టెరాయిడ్స్ తీసుకున్నాడంటూ గౌతమ్ చేసిన వ్యాఖ్యలపై నాగ్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా షర్ట్ విప్పించి బాడీ చూపించాలని అన్నారు. ఆ తర్వాత యావర్‌కు క్షమాపణలు చెప్పించారు. గౌతమ్‌కు రెడ్ మార్క్ ఇచ్చారు. శుభశ్రీకి రెడ్ మార్క్ ఇచ్చారు నాగార్జున. దామినికి రెడ్ కంటే బాగా కిందకు పెట్టారు. ఆటతీరు బాగోలేదని తెలిపారు నాగ్. శోభాశెట్టికి కూడా రెడ్ ఇచ్చారు నాగార్జున.
Also Read: బిగ్ బాస్ 7లోకి కొత్త ముఖాలు - వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సిద్ధమైపోతున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా?