By: Haritha | Updated at : 17 Dec 2022 12:51 PM (IST)
(Image credit: Star maa)
Bigg Boss winner: బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరు? ఇదే ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకుల తొలిచేస్తున్న ప్రశ్న. తమ తమ ఫేవరేట్ కంటెస్టెంట్లు గెలవాలని ప్రతి అభిమాను కోరుకుంటారు. అయితే మనకు వచ్చిన సమాచారం మేరకు ప్రధాన పోటీ రేవంత్, రోహిత్ మధ్యే జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. సెలెబ్రిటీలు డ్యాన్సులతో ఫినాలే హోరెత్తి పోనుంది. కాగా టాప్ 5లో మిగిలిన అయిదుగురిలో మొదట్నించి విన్నర్ అవుతాడని అనుకుంటున్నది రేవంత్. ఆయనకు ఇనాయ ఒకానొక దశలో చాలా పోటీ ఇచ్చింది. కానీ ఆమెను అనూహ్యంగా తప్పించారు. ఓటింగ్లో మంచి స్థానంలోనే ఉంటున్నప్పటికీ ఇనాయను ఎలిమినేట్ చేశారు. ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 6కు సగం కంటెంట్ ఇచ్చిందే ఇనాయ. అలాంటిది ఆమెనే తప్పించారు.
పదివారాలకు రోహిత్ ఆట, మాట పెద్దగా బయటికి రాలేదు. కానీ మెరీనా ఎలిమినేట్ అయ్యాక రోహిత్ అసలైన ఆట బయటికి వచ్చింది. మాట కూడా గట్టిగా వినిపించసాగింది. ఆటలోనూ జోరు పెరిగింది. మాటలో నిలకడ, ప్రవర్తన మర్యాద, మంచి నడవడిక రోహిత్‌లో అందరినీ ఆకర్షించాయి. అందుకే ఆయన ఓట్లు పడడం మొదలైంది. ఒకానొక దశలో రోహిత్ రేవంత్‌ను దాటి మొదటి స్థానానికి పాకాడు. అందుకే ఆయన కూడా విన్నర్ అయ్యే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు.
రోహిత్ లేదా రేవంత్
ఫినాలే వేదికపై నాగార్జున ఇద్దరి కంటెస్టెంట్‌ల చేతులు పట్టుకుని నిల్చుని చివరకు విజేత చేతిని పైకెత్తుతాడు. అలా వేదికపై నిల్చుంది రేవంత్, రోహిత్ అని తెలుస్తోంది. వీరిద్దరిలో రేవంత్ విన్నర్ అయినట్టు సమాచారం. ఇక రోహిత్ రన్నర్‌గా మిగిలిపోయినట్టు తెలుస్తోంది. ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయి ముందే బయటికి వచ్చేశారు.
మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా శ్రీసత్య బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఫైనల్ వరకు చేరకుండానే ఇంటి ముఖం పట్టినట్టు. ఇనాయలాంటి గట్టి ప్లేయర్ ఫినాలేలో లేకపోవడం మాత్రం కాస్త ఆశ్చర్యమే.
Also read: డబ్బు కోసమే బిగ్‌బాస్‌కు వచ్చిన శ్రీసత్య మొత్తంగా ఎంత సంపాదించిందంటే...
Bigg Boss Telugu: నాన్‌స్టాప్‌కు పుల్‌స్టాప్? ‘బిగ్ బాస్’ ఓటీటీ వెర్షన్ ఇక లేనట్లేనా!
Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్