Bigg Boss 6 Telugu curtain raiser: బిగ్ బాస్ షో కోసం రంగం సిద్ధం - 18 మంది పోటీదారుల్లో ఓ సర్‌ప్రైజ్ కంటెస్టెంట్!
బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కోసం సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో మొదలవుతుందని వెల్లడించారు.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కోసం సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో మొదలవుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన చాలా ప్రోమోలు వచ్చాయి. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు.
ఇప్పటివరకు బయటకొచ్చిన వివరాల ప్రకారం కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..
1. బాలాదిత్య (హీరో)
2. అభినయ శ్రీ (నటి)
3. రోహిత్, మెరీనా (రియల్ కపుల్)
4. రేవంత్ (సింగర్)
5. నేహా (యాంకర్)
6. చలాకీ చంటి (కమెడియన్)
7. సుదీప (నటి, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్)
8. శ్రీ సత్య (సీరియల్ నటి)
9. ఇనయా సుల్తానా (నటి)
10. శ్రీహాన్ (యూట్యూబర్)
11. ఆరోహి రావ్
12. వాసంతి
13. అర్జున్
14. ఆర్జే సూర్య
15. కీర్తి భట్ (కార్తీకదీపం హీరోయిన్)
16. రాజశేఖర్
17. గీతూ (యూట్యూబర్)
18. ఫైమా (కమెడియన్)
19. తన్మయ్ (జబర్దస్త్ లేడి గెటప్)
20. ఆది రెడ్డి (యూట్యూబర్)
ఈ లిస్ట్ లో 20 మంది ఉన్నారు. వీరిలో 18 మందిని ఫైనల్ చేసి హౌస్ లోకి పంపించనున్నారు. వీరితో పాటు ఓ సర్‌ప్రైజ్ కంటెస్టెంట్ ఉన్నట్లు సమాచారం. అది ఎవరో తెలియాలంటే రేపటివరకు ఎదురుచూడాల్సిందే. ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారట. అయితే హౌస్ లో 8 బెడ్స్ మాత్రమే ఉన్నాయట. అందులో కొన్ని సింగిల్ బెడ్స్ కూడా ఉంటాయి. 18 మందికి కేవలం 8 బెడ్సే అంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇంత మంది బిగ్ బాస్ హౌస్ లో ఎలా అడ్జస్ట్ అవుతారో చూడాలి.
మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.