Bigg Boss Telugu OTT: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’, గత సీజన్స్ కంటే కొత్తగా, భిన్నంగా - ఈ మార్పులు గమనించారా?

పాత ‘బిగ్ బాస్’ సీజన్స్‌కు కొత్తగా ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న.. ‘నాన్ స్టాప్’కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మరి ఆ మార్పులు, ప్రత్యేకతలు ఏమిటో చూసేయండి మరి.

FOLLOW US: 

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న ‘బిగ్ బాస్ - నాన్‌స్టాప్’ ఓటీటీ సీజన్-1 శనివారం మొదలైపోయింది. హోస్ట్ అక్కినేని నాగార్జున 17 మంది సభ్యులను హౌస్‌లోకి పంపించారు. వీరిలో పాత, కొత్త కంటెస్టెంట్స్ ఉన్నారు. అంటే.. ‘బిగ్ బాస్’ గత సీజన్లలో ఎలిమినేట్ అయిన సభ్యులను మళ్లీ ఒకే వేదిక మీద చూసే అవకాశాన్ని ‘బిగ్ బాస్’ కల్పించాడు. ఈ నేపథ్యంలో ఆట మరింత రంజుగా ఉండనుంది. గత సీజన్లతో పోల్చితే బిగ్ బాస్ భిన్నంగా, కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. మరి, ఆ హైలెట్స్ ఏమిటో చూసేయండి మరి. 

⦿ ఈ బిగ్ బాస్‌లో 17 మంది సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. 
⦿ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్లు 100 రోజులు ఉండేవారు. ఓటీటీ వెర్షన్‌ మాత్రం 84 రోజులకే ముగియనుంది. 
⦿ సాధారణ ‘బిగ్ బాస్’ సీజన్లలో అంతా కొత్త సెలబ్రిటీలే ఉంటారు. కానీ, ఈ బిగ్ బాస్‌లో మాత్రం గత సీజన్లో ఎలిమినేటైన సభ్యులు కూడా ఉన్నారు. 
⦿ గత సీజన్‌లో ఉన్న సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులును ఛాలెంజర్స్‌గా విభిజించారు. 
⦿ ఈ సారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేవారికి ఒక ‘హ్యాష్‌ట్యాగ్‌’ను ఇచ్చారు. వారు హౌస్‌లో ఎలా ఉండనున్నారో చెప్పేందుకు ఇదొక ట్యాగ్.
⦿ గత సీజన్లో ఉన్న బిగ్ బాస్ హౌస్ కంటే.. ఓటీటీ ‘నాన్ స్టాప్’ సీజన్ హౌస్ చాలా పెద్దదిగా, విశాలంగా ఉంది. 
⦿ ఈ సారి గార్డెన్ ఏరియాలో స్విమ్మింగ్ పూల్‌తోపాటు బాత్ టబ్ కూడా ఏర్పాటు చేశారు. 
⦿ గత సీజన్లలో కంటే.. భిన్నంగా, కలర్‌ఫుల్‌గా హౌస్ డిజైన్ చేశారు. 
⦿ రెగ్యులర్ ‘బిగ్ బాస్’ సీజన్లలో కంటే ఎక్కువ టాస్క్‌లు ఈ కొత్త సీజన్లో ఉండనున్నాయి. 
⦿ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ 24x7 టెలికాస్ట్ కానుందనే సంగతి తెలిసిందే. అయితే, శనివారం మాత్రం రికార్డెడ్ ఎపిసోడ్స్‌ను మాత్రమే టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత లైవ్ టెలికాస్ట్ మొదలుపెట్టారు.

⦿ గత సీజన్ల తరహాలో ఈ సారి సినీయర్ క్యారెక్టర్ ఆర్టిసులను హౌస్‌లోకి పంపలేదు.

Also Read: వారియర్స్ vs ఛాలెంజర్స్ - గెలిచేదెవరు? ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు వీరే!

బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:

వారియర్స్ టీమ్: 
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5) 
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)

Also Read: బిందు మాధవి లవ్ ఫెయిల్యూర్, ఆ సమయంలోనే బిగ్ బాస్ ఛాన్స్

ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్)

Published at : 26 Feb 2022 09:48 PM (IST) Tags: Bigg Boss Telugu OTT bigg boss non stop bigg boss non stop contestants Bigg Boss Non Stop Live Bigg Boss Highlights Bigg Boss Non Stop Updates Bigg Boss Non Stop Live Updates

సంబంధిత కథనాలు

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!